దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
నవంబరు 2 నుండి ఫిబ్రవరి 15, 1993 మధ్యవారములలోని నియామకముల సమాచారముపై ఆధారపడి, పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష అనుమతించిన సమయములోపల, మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోవున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు, సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:
1. ఏ విధమైన నోట్స్ లేకుండా ఉండేందుకు ఒక ప్రసంగాన్ని బాగా జ్ఞాపకముంచుకోవడం శ్రేష్టం. [యస్‌జి పే. 63 పేరా 17]
2. మీ స్వర సరళతను అభివృద్ధిపరచుకొనడానికి, మీ స్వంత స్వరాన్ని రికార్డు చేసికొని వినడం సహాయకరంగా ఉంటుంది. [యస్‌జి పే. 64 పేరా 3]
3. అవిశ్వాసులైన కుటుంబ సభ్యులతో మాట్లాడునప్పుడు మనము వివేచనతోకూడిన నేర్పు చూపనవసరం లేదు. [యస్‌జి పే. 72 పేరా 12]
4. ఒక వ్యక్తి హృదయాన్ని చేరుటకు దృక్పథమును బయల్పరచే ప్రశ్నలడగటం ఎంతో సహాయకరంగా ఉంటుంది. [యస్‌జి పే. 76 పేరా 10]
5. పొరపాటున హంతకుడైనవాడు ఆశ్రయపురంలోనే వుండుట ద్వారా తాను చేసిన దానియొక్క గంభీరత మరియు అట్టి రక్షిత స్థానంలో ఉంచడంద్వారా యెహోవా కనికరము తన మనస్సులో నాటుకొనును. (యెహో. 20:6) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 73 పే. 304 కూడా చూడుము.]
6. న్యాయాధిపతులు 6:37-39 లోని వృత్తాంతం ప్రకారం గిద్యోను విపరీతమైన జాగ్రత్త తీసుకున్నాడు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 88 4/1 పే. 30 చూడుము.]
7. మానోహ నిజంగా దేవుని చూడకపోయినను, దేవునికి మారుగా మాట్లాడు శరీరము దాల్చిన దేవదూతను చూచి ఆయన అలా భావించాడు (న్యాయా. 13:22) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 88 5/15 పే. 23 చూడుము.]
8. యెహోషువ తదుపరి న్యాయాధిపతులుగా వ్యవహరించినవారిలో సమూయేలు ఆయన కుమారులు లెక్కించబడలేదు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 86 6/1 పే. 31 కూడా చూడుము.]
9. సమూయేలు ప్రవక్త కాకపోయినను, 1 సమూయేలు 10:8లో వ్రాయబడిన ప్రకారం బలులనర్పించుటలో ఆయన యుక్తముగానే ప్రవర్తించెను. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 71 పే. 478 చూడుము.]
10. దావీదునకు తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును ఇచ్చుట ద్వారా యోనాతాను ఆయనను అభిషేకించబడిన రాజుగా గుర్తించి, ఆయనకు విధేయతను చూపెను. (1 సమూ. 18:3, 4) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 89 6/1 పే. 24 పేరా 4 చూడుము.]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:
11. బయలు ఆరాధికులను వధించుమని యెహోవా ఆజ్ఞాపించుట ఎందుకు సరైయున్నది? [యస్‌ఐ పే. 47 పేరా 7 (1983 ఎడి., పే. 47 పేరా 8)]
12. ఎక్సెటెంపొరేనియస్ ప్రసంగములోని రెండు ప్రయోజనాలేమిటి? [యస్‌ఐ పే. 59-60 పేరా 5-7]
13. నేర్పును ఎలా నిర్వచింపవచ్చును? [యస్‌ఐ పే. 69 పేరా 2]
14. మరొకరికి బోధించునప్పుడు, కేవలం జ్ఞానాన్ని మాత్రం అందజేయడం కంటె యింకా ఎక్కువగా చేయుటకు ఎందుకు ప్రయత్నించాలి? [యస్‌ఐ పే. 75 పేరా 7, 8]
15. మాట్లాడుటకు తోడుగా సంభాషించడంలో ఏమి ఇమిడివుంది? [యస్‌జి పే. 79 పేరా 3]
16. ఒక గుంపులోని సంభాషణ క్షేమాభివృద్ధికరమైన మార్గాన్ని తప్పిపోతుంటే దాని విషయంలో వ్యక్తిగతంగా మనమేమి చేయవచ్చును? [యస్‌జి పే. 83 పేరా 22]
17. న్యాయాధిపతులు 4:4 దృష్ట్యా, దెబోరాను పురాతన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో నొకదానిగా ఎంచవచ్చా? వివరించండి. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 86 6/1 పే. 31 చూడుము.]
18. ఫిలిష్తియుల పట్టణమైన గాజాలో సమ్సోను వేశ్య గృహమున కెందుకెళ్లెను? (న్యాయా. 16:1) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 79 2/15 పే. 31 కూడా చూడుము.]
19. సౌలును రాజుగా ‘నిర్ణయించినందుకు యెహోవా ఎందుకు పశ్చాత్తాపపడెను’? (1 సమూ. 15:10, 11) [వారపు బైబిలు పఠనము; అవేక్! 77 3/22 పే. 28 కూడా చూడుము.]
ఈ క్రింది వాక్యములను పూరించుటకు అవసరమైన పదములను లేక మాటలను చేర్చండి:
20. యెహోషువ 10:10-14లో వ్రాయబడిన అసాధారణ మానవాతీత సంఘటనలు _________________________ శక్తివంతమైన జ్ఞాపికలైయున్నవి. [యస్‌ఐ పే. 45 పేరా 23 (పే. 46 పేరా 23)]
21. సాధారణముగా ఒకరి నోరు మైక్రోఫోనుకు _________________________ అంగుళముల దూరములో ఉండాలి. [యస్‌జి పే. 68 పేరా 19]
22. మనము యెహోవాకు ప్రార్థించి, ఆయనపై ఆధారపడి యున్నట్లయితే దేవుని ఆత్మసహాయముతో _________________________ శరీరకంగా ఎంత బలముగలవాడైయుండెనో మనమును ఆత్మీయంగా అంత బలం కలిగియుండగలము. [యస్‌ఐ పే. 50 పేరా 27 (పే. 50 పేరా 28)]
23. రూతు గ్రంథము _________________________ ఉత్పత్తిచేసే యెహోవా సంకల్పమును ఉన్నత పరుస్తుంది. [యస్‌ఐ పే. 51 పేరా 1 (పే. 51. పేరా 1)]
24. న్యాయాధిపతులు 19:15 అలవాటు ప్రకారముగా చేయు _________________________ చూపని అసాధారణ సంఘటనను చెప్పుచున్నది. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 75 పే. 359 కూడా చూడుము.]
25. అత్యవసర పరిస్థితులలో _________________________ దేవుడు విధించిన ఆజ్ఞను త్రోసిపుచ్చుటకు వీలు లేదు. (1 సమూ. 14:31-34) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 3/1 పే. 18 పేరా 10 కూడా చూడుము.]
ఈ క్రింది వాక్యములనుండి సరియైన సమాధానములను ఎంపిక చేయండి:
26. న్యాయాధిపతులు వ్రాయబడటం పూర్తి అయ్యింది సా.శ.పూ. (దాదాపు. 1090; దాదాపు. 1100; 1078) [యస్‌ఐ పే. 46 పేరా 3 మరియు బాక్స్ (పే. 46 పేరా 3)]
27. (రూతు; రాహాబు; దెబోరా) యెహోవా ఆరాధనను కొనసాగించుటకు తన స్వంత దేశమును వదులుకొని యథార్థమైనదానిగా, విధేయురాలిగా, యిష్టపూర్వకమైన పనికత్తెగా నిరూపించుకొన్నది. [యస్‌ఐ పే. 52 పేరా 9 (పే. 52 పేరా 9)]
28. సా.శ.పూ. (917; 1017; 1117) సంవత్సరమున ఇశ్రాయేలీయుల జాతీయ వ్యవస్థలో గొప్పమార్పు సంభవించింది. [యస్‌ఐ పే. 53 పేరా 1 (పే. 53 పేరా 1)]
29. మొదటి సమూయేలును వ్రాసిన వారు (సమూయేలు; గాదు; నాతాను; దావీదు; సౌలు) [యస్‌ఐ పే. 53 పేరా 2 (పే. 53 పేరా. 2)]
30. దేవునికంటె మిన్నగా తన కుటుంబ సభ్యులను ఘనపరచినవాడు (మానోహ; ఏలి; సౌలు) (1 సమూ. 2:29, 30) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 12/15 పే. 16 పేరా 8 కూడా చూడుము.]
ఈ క్రింద చూపబడిన వాక్యములకు సరైన లేఖనములను జతపర్చుము:
యెహో. 22:9-31; న్యాయా. 8:23; రూతు 2:9; 1 సమూ. 21:13-15; ఎఫె. 5:3, 4
31. మన అనుదిన జీవితంలో ఎటువంటి భాషను విసర్జించాలో దేవుని వాక్యము చూపుతుంది. [యస్‌జి పే. 56 పేరా 9]
32. లైంగిక దుశ్చర్యకొరకు స్త్రీలను బాధపెట్టుట యెహోవా అనుమతించడు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 3/15 పే. 5 కూడా చూడుము.]
33. మనకు సమస్యలు ఎదురైనప్పుడు, కేవలము యెహోవాయే వాటిని తీర్చాలని ఎదురు చూసేదానికన్నా, మన మానసిక సామర్థ్యాలను కూడా ఉపయోగించాలని యెహోవా కోరుతున్నాడు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 4/15 పే. 19 పేరా 14 కూడా చూడుము.]
34. అధికారాన్ని దుర్వినియోగపరచే శోధనను అసంపూర్ణ మానవులు ఎదిరించాలి. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 10/1 పే. 24 పేరా 13 కూడా చూడుము.]
35. ఇతరులు చేసే క్రియల వెనుక చెడు ఉద్దేశములున్నవని ఆరోపించకుండా నిరోధించేందుకు వివేచన మనకు సహాయపడుతుంది. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 86 11/1 పే. 23 పేరా 10 కూడా చూడుము.]