సరళమైన, సమర్థవంతమైన సంభాషణా ప్రసంగాలు
1 దేవుని రాజ్యమును సరళమైన, సూటియైన పద్ధతిలో యేసు ప్రకటించెను. సత్యమును విన్నప్పుడు గొర్రెలాంటివారు అనుకూలంగా ప్రతిస్పందిస్తారని ఆయనకు తెలుసు. ప్రజలలో విభిన్న ఆలోచనలు, ఆసక్తులు, తర్క సామర్థ్యము గలవారుంటారని కూడా ఆయనకు తెలుసు. అందుకనుగుణ్యంగా వినేవారి అవధానాన్ని ఆకట్టుకొని వారి హృదయాన్ని తట్టుటకు ఆయన అనేక విధముల సరళమైన ఉపోద్ఘాతాలను, ప్రశ్నలను, ఉపమానములను ఉపయోగించాడు. మనము కూడా ఆయన మాదిరి ననుసరించి సరళమైన సమర్థవంతమైన సంభాషణా ప్రసంగాలను బాగా ఉపయోగించవచ్చును.
2 రీజనింగ్ పుస్తకమును సమర్థవంతముగా ఉపయోగించుము: రీజనింగ్ పుస్తకము పేజి 11లో “ఎంప్లాయ్మెంట్/హౌసింగ్” శీర్షిక కింది మొదటి ఉపోద్ఘాతము, సమయోచితమైనది, అందించుటకు సులభమైంది.
మీరిట్లు చెప్పవచ్చును:
◼ ‘ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ఇల్లు ఉంటాయనే అభయాన్ని కలిగియుండటానికి ఏమిచేయవచ్చునని మేము మీ పొరుగువారితో మాట్లాతున్నాము. మానవ ప్రభుత్వములు దీనిని సాధించగలవని ఆశించటం కారణ సహితమని మీరు నమ్ముతారా? . . . అయితే వీటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన ఒకాయనున్నారు; ఆయన మానవ జాతి సృష్టికర్త.” యెషయా 65:21-23 చదవండి. అది అతనికి ఎలా అన్పించిందో ఇంటివారిని అడగవచ్చును.
3 పేజి 12లోని “ఇంజస్టీస్/సఫరింగ్” అంశము కింద ఉన్న ఉపోద్ఘాతము అనేకమందికి ఈనాడు యిష్టంగా ఉంటుంది.
మీరు ఇలా అడగవచ్చును:
◼ “నేడు మానవులు అనుభవించే అన్యాయము, బాధనుగూర్చి దేవుడు నిజంగా శ్రద్ధకలిగివున్నాడా” అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంటివారిని సమాధానము చెప్పడానికి అనుమతించి, ప్రసంగి 4:1, కీర్తన 72:12-14 చదవండి. తదుపరి మీరు నిరంతరము జీవించగలరు పుస్తకము పేజీలు 150-3లలోని చిత్రములను తిప్పి ఈనాటి లోక పరిస్థితులు బైబిలు ప్రవచన నెరవేర్పుకు ఎలా సరిపోతున్నాయో చూపండి. పిమ్మట మానవుని ఆశీర్వాదము నిమిత్తము దేవుడు ఇంకా ఏమి చెప్పాడో చూపేందుకు పేజీలు 161-2 తిప్పండి. వీటిలో ఏ విషయం తనను ఆకట్టుకొందో అడగండి.
4 ఇంటివారితో క్లుప్తముగా చర్చించిన తర్వాత, ఆయన అవధానాన్ని నిరంతరము జీవించగలరు పుస్తకముకంటె పత్రికలోని ఒక శీర్షికవైపు, బ్రోషర్ లేక కరపత్రమువైపో మళ్లించడం మంచిదేమో మీరే నిర్ణయించవచ్చును.
ఉదాహరణకు, ఈ శీర్షిక 2వ పేరాలోని ఉపోద్ఘాతమును ఉపయోగించిన తరువాత, మీరిలా చెప్పవచ్చును:
◼ “మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయముచేయుదురు?, అను ఈ బ్రోషర్ మనం అనుదిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుటకు దేవుడు ఏమి వాగ్దానము చేశాడో, దానినుండి మనం ఎలా మేలు పొందగలమో స్పష్టంగా వివరిస్తుంది.” తర్వాత బ్రోషర్ను 18, 19 పేజీలకు తిప్పి యెహోవా చేసిన గొప్ప వాగ్దానములవైపు అవధానాన్ని మళ్లించండి.
5 లేదా, పేరా 3లోని ఉపోద్ఘాతాన్ని ఉపయోగించిన తర్వాత, లైఫ్ ఇన్ ఎ ఫీస్ఫుల్ న్యూ వరల్డ్ కరపత్రమును ప్రధానంగా వాడవచ్చును.
మీరిలా చెప్పవచ్చును:
◼ “ఈనాడు లోకంలో ఎంతో దుఃఖము, కష్టము నెలకొని ఉంది. ఈ కరపత్రము మానవజాతికి యుద్ధము, ఆహార కొరత, ఆరోగ్య సమస్యలు గతించిన సంగతులైయుండే అద్భుతకరమైన మార్పును తెచ్చే వాగ్దానాన్ని దేవుడు చేశాడని చూపుతుంది. కరపత్రమునందు 3పేజి, రెండవ పేరాను చదువుము.
6 ప్రజలయెడల మనము చూపే మన నిష్కపటమైన ఆసక్తికి, హృదయాన్ని తాకే సరళమైన, సమర్థవంతమైన సంభాషణా ప్రసంగాన్ని మేళవిస్తే, అది నిశ్చయంగా గొర్రెలాంటివారిని ఆకట్టుకొంటుంది.—యోహా. 10:16.