కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/93 పేజీ 7
  • ప్రశ్నా భాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగము
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1997
  • సంఘంలోవున్న పాత ప్రచురణలను ఉపయోగించుకోండి
    మన రాజ్య పరిచర్య—2011
  • ‘తగినవేళ ఆహారం’ మీరు పొందుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • మన ప్రచురణలను చక్కగా ఉపయోగించుకోండి
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 3/93 పేజీ 7

ప్రశ్నా భాగము

◼ ఇతరులకు పంచడానికై సొసైటి ప్రచురణలను పునరుత్పత్తిచేయడం సరియైనదేనా?

అనేక సంవత్సరాలుగా బైబిలుయొక్క ప్రతివిధమైన జ్ఞానముతోకూడిన ప్రచురణలను సొసైటి విస్తారంగా ఉత్పత్తిచేసింది. ఇటీవలి కాలంలో సత్యమును నేర్చుకొన్న వ్యక్తులు, గతంలో ప్రచురించబడిన సమాచారాన్ని కోల్పోయామని దాన్ని మరలా పొందే అవకాశం లేదని భావించవచ్చును. తత్సంబంధంగా కొంతమంది చెప్పుకోదగినంతగా శ్రమకోర్చి పాత ప్రచురణలను సంపాదించారు. మరికొందరు ఆ బాధ్యతను తమపైనే వేసుకొని వాటిని పునరుత్పత్తిచేసుకొనడం లేక ఇతరవిధాలలో వాటిని పొందేలా చేసుకున్నారు. వీటిలో కచ్చితంగా ప్రచురణలను తిరిగి ముద్రించడం, లేక కంప్యూటర్ల ద్వారా పునరుత్పత్తి చేయడం జరిగింది. కొన్ని సందర్భాలలో దీన్ని ఆర్థిక లాభం కొరకుచేయడం కూడా జరిగింది.

నమ్మకమైన “దాసుడు” మన ఆత్మీయ అవసరతలను ఎరిగి, “తగినవేళ” అందుకు కావలసిన ఏర్పాట్లను చేస్తున్నాడు. (మత్త. 24:45) గతంలో ప్రచురించబడిన ప్రచురణలను తిరిగి అందించవలసిన అవసరతను చూసినప్పుడు సొసైటి అందుకు తగిన ఏర్పాట్లను చేసింది. ఉదాహరణకు 1960 నుండి 1985 వరకు వాచ్‌టవర్‌ బౌండ్‌ వాల్యూమ్స్‌ను తిరిగి ముద్రించి వాటిని అందుబాటులో ఉండేలా చేసింది. ఏమైనా, ఆయావ్యక్తులు చొరవ తీసికొని తమకైతామే వాటిని తిరిగి ఉత్పత్తిచేసి, అటువంటి సమాచారమును పంచబూనుకొంటే అనవసరమైన సమస్యలు తలెత్తగలవు.

ఈ సమాచారమును పునర్ముద్రించి ఆర్థిక లాభాలకొరకు వాటిని పంచినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. మన రాజ్య సేవ జూలై 1977లోని ప్రశ్నాభాగము ఇలా తెలియజేసింది: “వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఏవైనా వస్తువులను లేక సేవలను రాజ్యమందిరములో, సంఘ పుస్తక పఠనములలో లేక యెహోవా ప్రజల సమావేశములలో అమ్మడం లేక ప్రచారము చేయడంద్వారా దైవపరిపాలనా సంబంధమైన సహవాసములను స్వలాభంకొరకు ఉపయోగించుకొనడం మంచిది కాదు. అలా ఉపయోగించుకొనకుండుట ద్వారా ఆత్మీయ విషయాలకు ఇవ్వవలసిన పూర్తి అవధానాన్ని వాటికిచ్చి, వ్యాపార కార్యాకలాపాలను వాటి స్థానంలో ఉంచడానికది మనకు దోహదం చేయగలదు.” కాబట్టి దేవుని వాక్యాన్ని లేక దానికి సంబంధించిన వాటిని వ్యాపారరీతిగా చేసే సందర్భాలలో లాభాపేక్షగల మనస్సును మనం విసర్జించడం ప్రాముఖ్యం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి