దైవిక బోధ బలమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది
1 మన సృష్టికర్తయు, దేవాదిదేవుడైన యెహోవా నుండి ఉపదేశము నొందుటకు మనమెంత ఆధిక్యతనొందిన వారమో! (కీర్త. 50:1; యెష. 30:20 బి) ఆయనచే బోధించబడుటకు ఈనాడు అనేకులు అన్ని జనాంగముల నుండి, తన పరిశుద్ధ ఆరాధన అనే పర్వతానికి ప్రవాహంవలే వస్తున్నారు. (మీకా 4:2) మానవ ఆలోచనను, లోక జ్ఞానమును ఘనపర్చే పాఠశాలల్లో లక్షలాదిమంది ఇతరులు చేరుతున్నారు. అయితే యెహోవాను, ఆయన వ్రాతపూర్వక వాక్యాన్ని తిరస్కరించే జ్ఞానం దేవుని దృష్టిలో వెఱ్ఱితనమైయున్నది, మరియు దానిచేత నడిపించబడేవారు బుద్ధిహీనులౌతారు.—కీర్త. 14:1; 1 కొరి. 1:25.
2 దాదాపు గత సంవత్సరాంతంలో మన జిల్లా సమావేశమందు, మనం దైవిక బోధ యొక్క శక్తిని అసమానమైన రీతిలో అనుభవించాం. “దైవిక బోధ” అనే మూలాంశం కార్యక్రమమంతటా చొచ్చుకొని ఉంది. ఆయన ఆత్మతోపాటు దేవుని వాక్యం మనలను ప్రపంచ వ్యాప్త సహోదరత్వమందు ఐక్యపర్చి, మన వ్యక్తిత్వాలను మలచి, దయ్యముల బోధ నుండి మనలను సంరక్షించి, మంచి పరిచారకులగునట్లు మనకు తర్ఫీదునిస్తుందని మనం నేర్చుకున్నాం. దైవిక బోధనుండి మీరెట్లు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందారు?
3 క్రైస్తవ జీవితంపై ప్రభావము: దైవిక బోధ మన మనస్సాక్షిని మలుచుకొనుటకు సహాయపడుతుంది. ప్రతి ఒక్కరు మనస్సాక్షితోనే జన్మించారు, కాని అది మనలను నీతియుక్తమైన మార్గాల్లోను, యెహోవాను ప్రీతిపర్చే సేవలోను నడిపించాలంటే, దానికి తప్పకుండా శిక్షణ అవసరము. (కీర్త. 19:7, 8; రోమా. 2:15) దేవుని వాక్యానికి అనుగుణంగా లోక ప్రజలు తమ ఆలోచనా సరళిని మార్చుకోలేదు, అందుచేత వారు ఏది తప్పో, ఏది ఒప్పో అనే విషయంలో గలిబిలిగలవారై అనిశ్చయంగా ఉన్నారు. తమ స్వంత దృష్టికి సరైన దానిని చేయవలెనని ప్రతి ఒక్కరు పట్టుపట్టడంవల్ల నైతిక, ఆచార సంబంధ విషయాలపై వాద్వివాదాలు చెలరేగుతాయి. తమ స్వంత జీవన విధానాన్ని నిర్ణయించుకోవడానికి అనేకులు పూర్తి స్వేచ్ఛను కోరతారు. నిజమైన జ్ఞానానికిగల మూలమైనవానిని ఆలకించడానికి వారు తిరస్కరిస్తారు. (కీర్త. 111:10; యిర్మి. 8:9; దాని. 2:21) అయితే దైవిక బోధ మన కొరకు అటువంటి వివాదాంశాలను పరిష్కరించింది, మరి మనమాయన చేత బోధింపబడుచున్నందున దేవుని గృహస్థులుగా మనం ఐక్యంగానే మిగిలి ఉంటాము. మన పరిచర్యలో తొందరకల్గి ఉంటూ, మంచి మనస్సాక్షితో భవిష్యత్తును నమ్మకంగా ఎదుర్కొంటాము.
4 “గాలికి కొట్టుకొనిపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును” నిరోధించేందుకు మనకు దైవిక బోధ సహాయపడుతుంది. (ఎఫె. 4:14) తప్పుపట్టేవారిగాను, సంశయించేవారిగాను ప్రజలను తయారుచేసి, స్వంతంగా తీర్మానాలు చేసేలా ప్రోత్సహించి, నైతిక పతనానికి నడిపే తత్వశాస్త్ర అధ్యయనంతో మనం మనస్సులో ముద్రింపబడ్డవారంకాదు. యెహోవా చేత బోధింపబడడానికి మనం ఉల్లసిస్తాం, తద్వారా అనేకమంది అనుభవిస్తున్న దుఃఖాన్ని, హృదయవేదనను మనం పొందము. ‘“ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని మన వెనుకనుండి చెప్పిన శబ్దము వలే’ యెహోవా నియమాలు, జ్ఞప్తికి తేబడిన సలహాలు ఉంటాయి.—యెష. 30:21.
5 మన కూటములు, పరిచర్య: హెబ్రీయులు 10:23-25 వచనాలను మనం దేవుని నుండి వచ్చిన ఆజ్ఞగా దృష్టిస్తాము. సంఘ కూటాల్లో మనం యెహోవా చేత బోధించబడతాము. కూటాలకు ఎల్లవేళలా హజరవ్వడం మనకొక అలవాటుగా ఉన్నదా లేక కూటాలకు హజరవ్వడాన్ని మనం తక్కువ ప్రాముఖ్యత గలదిగా దృష్టిస్తున్నామా? కలసి సమకూడుట మన ఆరాధనలో ఒక భాగమనే విషయాన్ని గుర్తుంచుకోండి. దానిని మనం ఒక ఎంపికగా చూడకూడదు. మన కొరకు యెహోవా సిద్ధపర్చిన ఆత్మీయ పోషణా కార్యక్రమంలో ఏ భాగమును పోగొట్టుకొనడానికి ప్రయత్నించకూడదు.
6 మోషే దేవునికిట్లు ప్రార్థించాడు: “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.” (కీర్త. 90:12) మన ప్రార్థన కూడా ఇదేనా? అమూల్యమైన ప్రతి దినాన్ని మనం గుణగ్రహిస్తున్నామా? అలా చేసినట్లయితే, అప్పుడు మన మహిమాన్విత బోధకుడైన, యెహోవాను మహిమపర్చునట్లు, యోగ్యమైన రీతిలో ప్రతిదినము వెచ్చించుట ద్వారా మనం “జ్ఞానహృదయమును పొందుదుము”. దానిని చేయడానికి దైవికబోధ మనకు సహాయపడుతుంది.