మీ పిల్లలు ప్రచారకులా?
1 మన సంఘాలతో సహవసిస్తూ యెహోవాను స్తుతించేవారౌతున్న ఎందరో పిల్లలయెడల మనకు ఆసక్తివుంది. మీ పిల్లలకు కూడ అలాంటి కోరిక వుందా? అట్లయితే, అభ్యుదయమైన, ఆచరణ యోగ్యమైన శిక్షణను వెంటనే ప్రారంభించవలసిన అవసరముంది. మంచి అలవాట్లు నేర్చుకుని, వాటిని పొందడానికి చిన్నతనమే సరైన సమయం.
2 ఇంట్లో మీ పిల్లల ప్రవర్తన, అలవాట్లు ఎలావున్నాయి? పిల్లలు తమ తలిదండ్రులకు విధేయులైతే, సంఘంలోని వ్యక్తులపట్ల, తమ పాఠశాల ఉపాధ్యాయులపట్ల కూడ వారు గౌరవాన్ని ప్రదర్శిస్తారు. మీ పిల్లలు తమ వస్తువులనూ గదినీ శుభ్రంగా ఉంచుకొని, వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటున్నారా? ఈ విషయంలో వారికి మంచి అలవాట్లువుంటే ప్రాంతీయ సేవలో వున్నప్పుడు, యితరుల వస్తువులపట్ల, వారి ఆస్తులపట్ల గౌరవాన్ని కనుపర్చి, యెహోవా దేవునికి ప్రాతినిధ్యం వహించే ప్రచారకులవలె మాదిరికరంగా నడుచుకుంటారు.
3 మీ పిల్లలు సువార్త ప్రకటించడానికి ఉత్సాహపడుతున్నప్పుడు, ఆలస్యం చేయకుండ, వెంటనే వారిని దైవపరిపాలనా పాఠశాలలో భాగం వహించడానికి ప్రోత్సహించండి. దైవపరిపాలనా పాఠశాలలో భాగం వహించడానికి వయస్సుతో నిమిత్తం లేదు, గానీ మంచి అలవాట్లు, ప్రచారకుడు కావాలన్న కోరికతో కూడిన మాదిరికరమైన ప్రవర్తన వారికి అవసరం. పాఠశాల అధ్యక్షుడు కేవలం పిల్లవాడు బైబిలును ఎలా చదువుతాడు లేక ఎలా మాట్లాడతాడు అన్న వాటిపైనే ఆసక్తిని కల్గివుండడు. అయితే ప్రారంభంనుండి, ప్రచారకుడు కావాలనే గమ్యాన్ని గూర్చి తలిదండ్రులతోను పిల్లవానితోను మాట్లాడటం మంచిది.
4 మీతో పాటు మీ పిల్లలను సేవకు తీసుకు వెళ్లినప్పుడు, పరిచర్యలో వారి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే ధ్యేయంతో వారితో కలిసి సిద్ధపడుతూ, అభ్యసిస్తూ సమిష్టిగా సేవాగమ్యాన్ని పెట్టుకోండి. మీ పిల్లల సామర్థ్యాన్నిబట్టి, పరిచర్యలోని పరిస్థితులనుబట్టి యింటివారు చెప్పేవాటిని వినడం, లేఖనాలను చదివేటప్పుడు భావగర్భితంగా చదవటం, కరపత్రాలనుండి సరళమైన సాక్ష్యాన్నివ్వటం వంటి నిర్దిష్ట గమ్యాలను చేరడానికి వారికి సహాయపడండి. అంతేకాక, యింటింటి సేవలో కలిసే ప్రజలందరి యెడల వ్యక్తిగత శ్రద్ధను కనుపర్చునట్లు మీ పిల్లలకు మీరు నేర్పించవచ్చు. స్నేహభావాన్ని, అనురాగాన్ని, సాత్వికాన్ని ప్రదర్శించే ప్రాముఖ్యతను గూర్చి మీరు వారికి చెబితే, ఎవరైనా వారిని మొండిగా తిరస్కరించినప్పుడు నిరుత్సాహపడకుండా ఉండడానికి అది సహాయపడుతుంది. మీ పిల్లలు వారాంత సేవలో పాల్గొంటే, కేవలం తమ తలిదండ్రులతోనే పనిచేసే కంటే, అనుభవజ్ఞులైన ఇతర ప్రచారకులతో, పెద్దలతో కూడ పనిచేస్తే, మరింత శ్రేష్ఠమైన శిక్షణను పొందగలరు.—1 కొరిం. 4:17.
5 మీ పిల్లలు తమ ఆలోచనలను స్వంత మాటల్లో వ్యక్తపర్చగల్గితే అది మరింత ప్రభావవంతమై, యింటివారి హృదయాన్ని కదిలించగలదు. వారు అనుభవం పొందేకొలది, పరిపక్వతగల క్రైస్తవులుగాను చురుకైన, ఉత్సాహపూరిత ప్రచారకులయ్యేందుకు ప్రోత్సహించండి. (1 కొరిం. 14:20) కేవలం ఒక ప్రచారకునిగా కొనసాగడమే కాకుండ, పునర్దర్శనాలు చేసి గృహ బైబిలు పఠనాలు నిర్వహించే లక్ష్యాన్ని కలిగియుండవచ్చు. దానికి తోడు, యెహోవా సంస్థతో హత్తుకుని పనిచేసే ఆనందాన్ని చవిచూడటానికి వారికి సహాయపడండి. నోటీసు బోర్డు, సేవా కూటంలోని ప్రకటనలకు అవధానమిచ్చి సంఘంతో ఎలా సహకరించాలో నేర్పండి. సహోదరులు అప్పగించే ఏ పనినైనా యిష్టపూర్వకంగా చేయడానికి ప్రోత్సహించడం కూడా మంచిదే.
6 మీ పిల్లలు యెహోవాను స్తుతించే వారైన తర్వాత, వారు యింతవరకు సంపాదించిన మంచి పేరుకు కళంకం తెచ్చే ఎటువంటి నైతిక సమస్య తలెత్తకుండా జాగ్రత్తవహించండి. అంతేగాక దేవునియెడల తమ యథార్థతను నిలుపుకోడానికి ప్రోత్సహించండి.—2 తిమో. 2:22.