కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/94 పేజీ 6
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1994
మన రాజ్య పరిచర్య—1994
km 1/94 పేజీ 6

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు జనవరి: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూరు 4.00 రూ. ల చందాకు అందించాలి. ఇది అందుబాటులో లేనిచోట, ప్రత్యేక అందింపులోని 192 పేజీల పాత పుస్తకాలను 6.00 రూ. లకు అందించవచ్చు. ఈ శ్రేణిలో ఈ క్రింది పుస్తకాలు మావద్ద ఇంకనూ అందుబాటులో ఉన్నాయి: ఇంగ్లీషు: డిడ్‌ మ్యాన్‌ గెట్‌ హియర్‌ బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌? మరియు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? గుజరాతి: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్‌ యువర్‌ కింగ్‌డమ్‌ కమ్‌” మరియు నిత్యజీవమునకు నడుపు సత్యము; హింది: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్‌ యువర్‌ కింగ్‌డమ్‌ కమ్‌;” కన్నడ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్‌ యువర్‌ కింగ్‌డమ్‌ కమ్‌” మరియు “థింగ్స్‌ ఇన్‌ విచ్‌ ఇట్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌ ఫర్‌ గాడ్‌ టు లై;” మరాఠి: “లెట్‌ యువర్‌ కింగ్‌డమ్‌ కమ్‌” మరియు లిజనింగ్‌ టు ది గ్రేట్‌ టీచర్‌; తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “లెట్‌ యువర్‌ కింగ్‌డమ్‌ కమ్‌;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం పెద్దసైజు 40.00 రూ. లకు, చిన్నసైజు 20.00 రూ. ల చందాకు అందించవచ్చు. మార్చి: క్వచ్ఛన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ (ఇది ఇంగ్లీషు, మలయాళము, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది) 20.00 రూ. ల చందాకు. ఇది అందుబాటులో లేనిచోట, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 40.00 రూ. ల చందాకు అందించవచ్చు. (చిన్నసైజు 20.00 రూ. లు) దానితోపాటు ప్రత్యేక అందింపులోని 192 పేజీల పాత పుస్తకాలు ఒక్కొక్కటి 6.00 రూ. లకు అందించవచ్చు. ఏప్రిల్‌, మే: కావలికోట పత్రిక ఒక సంవత్సరానికి చందా 60.00 రూ. లు. దీనికే ఆరు నెలలకుగాని, మాసపత్రికలకు ఒక సంవత్సరానికిగాని చందా 30.00 రూ. లు. (మాసపత్రికలకు ఆరునెలల చందా లేదు.)

గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డర్‌ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ ఆర్డర్‌లో (S-14) ఆర్డర్‌ చేయాలి.

◼ ఏప్రిల్‌, బహుశ మే నెలలో కూడ సహాయ పయినీర్‌ సేవ చేయడానికి సంఘంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృషి చేయాలని మేము ప్రోత్సహిస్తున్నాము. లేదా వారు ఏప్రిల్‌లో చేయలేకపోతే, ఆ తర్వాత మే నెలలో చేయవచ్చు. అదనంగాచేయు ఈ సేవను గూర్చి ఎదురుచూస్తూ, ఏప్రిల్‌, మే నెలల్లో ఎక్కువ పత్రికలు కావాలనుకుంటున్న సంఘాలు తమ ప్రత్యేక ఆర్డర్లను జనవరి 30, 1994 కు ముందుగానే పంపాలి.

◼ ఈ సంవత్సరం మార్చి 26 వ తేదీ శనివారంనాడు సూర్యాస్తమయం తర్వాత ఆచరించబోయే జ్ఞాపకార్థదినానికి సంబంధించి సంఘాలు అనుకూలమైన ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రతీ సంఘం స్వంతంగా జ్ఞాపకార్థదిన ఆచరణను ఆచరించాలని కోరుకోవడం సమంజమేగాని, అలా చేయడం ఎల్లప్పుడూ సాధ్యంకాకపోవచ్చు. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని అనేక సంఘాలు ఉపయోగించుకొనేచోట, ఆ సాయంకాలం కొరకు ఒకటి లేదా ఎక్కువ సంఘాలు వేరే సదుపాయాన్ని పొందడం మంచిది. జ్ఞాపకార్థ దినాచరణ మరీ ఆలస్యంగా ఆరంభించకూడదు, ఎందుకంటే క్రొత్తగా ఆసక్తి చూపినవారు హాజరవ్వడానికి అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకటికంటే ఎక్కువ సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగిస్తున్నట్లైతే, కూటములను వెంటవెంటనే పెట్టకూడదు, ఎందుకంటే ఆచరణ ముందుగాని లేదా తర్వాతగాని సందర్శకులను ఆహ్వానించడానికి, కొందరికి ఆత్మీయ సహాయాన్ని చేయుటలో కొనసాగే ఏర్పాట్లను చేయడానికి, లేదా అక్కడ హాజరైన వారందరినీ సాధారణంగా ప్రోత్సహించడానికి, వారిచే ప్రోత్సహింపబడడానికి సమయం ఉండదు. అన్ని విషయాలను బాగా పరిశీలించిన తర్వాత, హాజరైన వారందరూ ఆ కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి బాగా సహాయపడే ఎటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందో సంఘపెద్దలు నిర్ణయించాలి.

◼ జ్ఞాపకార్థ దిన సందర్భంగా 1994 వ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 10 ఆదివారం ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఇవ్వబడుతుంది. “మతం మానవ సమాజాన్ని విఫలంచేస్తుందా?” అనే అంశంపై ప్రసంగమీయబడుతుంది. ప్రసంగంయొక్క సంక్షిప్తప్రతి అందజేయబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ కాపరి సందర్శనం, ప్రాంతీయ సమావేశం, లేదా ప్రత్యేక సమావేశ దినం ఉన్న సంఘాలకు ఈ ప్రత్యేక బహిరంగ ప్రసంగం, తర్వాతి వారంలో ఉంటుంది. ఏ సంఘం కూడా ప్రత్యేక ప్రసంగాన్ని ఏప్రిల్‌ 10 కంటే ముందు ఏర్పాటు చేయకూడదు.

◼ ఒక సంవత్సరానికి సరిపడునన్ని సర్వీస్‌ ఫారాలు అన్ని సంఘాలకు పంపించబడ్డాయి. వాటితో పాటు చెక్‌లిస్ట్‌ కూడా పంపబడింది, తద్వారా సంఘ సెక్రటరీలు అవసరమైన సహోదరులకు సరియైన వాటిని అందజేస్తారు. స్టాకులో వున్న ఫారాలు చెక్‌లిస్ట్‌లోని తారీఖులకంటే ముందు ముద్రించినవైతే వాటిని పూర్తిగా నాశనంచేయాలి; దయచేసి పాత ఫారాలను ఉపయోగించవద్దు. ఆ సంవత్సరమంతటిలోను అదనపు ఫారాలు అవసరమైనట్లైతే, వీటిని లిటరేచర్‌ ఆర్డర్‌ ఫారమ్‌నుపయోగించి (S-14) ఆర్డర్‌ చేయవచ్చు, కాని డిశంబరు 1994 వరకు సరిపోయేలా మాత్రమే దయచేసి ఆర్డరు చేయండి.

◼ ఇటీవల ఇండియా మధ్యభాగంలో సంభవించిన భూకంపంవల్ల మన సహోదరులపై ఎటువంటి ప్రభావం ఉందోనని మీలో అనేకమంది చింతను వ్యక్తం చేశారు. దాని ప్రభావానికి లోనైన ప్రాంతాల్లో నివసిస్తున్న సాక్షుల క్షేమాన్ని గూర్చి అనేక ఉత్తరాలను మేము అందుకున్నాం, మరి అలా తెలుసుకోవడంద్వారా, మద్దతునివ్వడం ద్వారా కూడ మీ ఆసక్తిని ప్రదర్శించగా కార్యరూపం దాల్చిన క్రైస్తవ ప్రేమను చూడటం చాలా సంతోషకరంగా ఉంది. సహోదరులకు తీవ్రనష్టం అంటే భౌతికంగా గాయపడటంగాని లేదా ఆస్తిపాస్తులకు తీవ్రంగా నష్టం జరిగినట్లుగాని మాకు ఎలాంటి రిపోర్టులూ అందలేదని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. లోనావ్లాలో వున్న మాతోపాటు, అనేక ప్రాంతాల్లోని సహోదరుల కుటుంబాలు భూకంపానికి సంబంధించిన ప్రకంపనాలకు గురయ్యారు, అతి తక్కువ మొత్తంలో మాత్రమే నష్టం వాటిల్లింది, కాని సాక్షుల గృహాలకు లేదా వారికి ఏవిధమైన తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆధారాలేమీ మేము కనుగొనలేదు. మీ ప్రేమపూర్వక శ్రద్ధకై మేము కృతజ్ఞత తెల్పుచున్నాము, ఆలాగే మనం చివరిదినాల్లో జీవిస్తున్నామని తెల్పే సూచనలో భాగమైన అంత్యకాలంలోని ఈ భూకంపాలలో మనం సహేతుకమైన పరిమాణంలో క్షేమంగా యెహోవా సేవలో ముందుకు కొనసాగగలమని ప్రార్థిస్తున్నాము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి