ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం పెద్దసైజు రూ. 40.00 చిన్నసైజు రూ. 20.00 చందాకు అందించవచ్చు. మార్చి: క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ (ఇది ఇంగ్లీషులోను, మలయాళంలోను, తమిళంలోను లభిస్తుంది) రూ. 20.00 చందాకు. ఇది అందుబాటులో లేనిచోట, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 40.00 చందాకు అందించవచ్చు. (చిన్నసైజు రూ. 20.00) దానితోపాటు ప్రత్యేక అందింపుగా 192 పేజీల పాత పుస్తకాలు ఒక్కొక్కటి రూ. 6.00 అందించవచ్చు. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక ఒక సంవత్సరానికి చందా రూ. 60.00. ఆరు నెలల చందా మరియు మాసపత్రికల సంవత్సర చందా రూ. 30.00. (మాసపత్రికలకు ఆరునెలల చందా లేదు.)
గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డర్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ ఆర్డర్ (S-14) ఫారంలో ఆర్డర్ చేయాలి.
◼ సెక్రటరీ, సేవా అధ్యక్షుడు క్రమ పయినీర్ల సేవను పునఃసమీక్షించాలి. ఎవరైనా గంటలు చేరుకోడానికి యిబ్బందిపడుతున్నట్లయితే సహాయం చేయడానికి పెద్దలు ఏర్పాట్లు చేయాలి. సలహాల కొరకు, అక్టోబరు 1, 1993, అక్టోబరు 1, 1992 లో సొసైటీ వ్రాసిన (S-201) లేఖలను పునఃసమీక్షించాలి. మన రాజ్య పరిచర్య అక్టోబరు 1986 ఇన్‌సర్ట్‌లోని 12-20 పేరాలు కూడా చూడండి.
◼ శనివారం, మార్చి 26, 1994 న జ్ఞాపకార్థ దినం ఆచరించబడుతుంది. ప్రసంగం ముందుగనే ప్రారంభించవచ్చు కాని, సూర్యాస్తమయం వరకు, జ్ఞాపకార్థ రొట్టెను, ద్రాక్షారసాన్ని అందించనారంభించ కూడదు. మీ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో అడిగి కనుక్కోండి. ప్రాంతీయ సేవకొరకైన కూటం తప్ప, ఆ రోజు మరే కూటము జరుగకూడదు. మామూలుగా మీ సంఘంలో కూటాలు శనివారం జరుగుతున్నట్లయితే, రాజ్యమందిరంలో వీలైనట్లు ఆ వారంలోని మరొక రోజుకి ఆ కూటాన్ని మార్చుకోవచ్చు.
◼ మార్చి, ఏప్రిల్‌లో సహాయ పయినీర్లుగా సేవ చేయదలుచుకున్న ప్రచారకులు దానికోసం పథకం వేసుకొని, ముందుగానే దరఖాస్తు యివ్వాలి. ప్రాంతీయ సేవకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి, కావలసినంత సాహిత్యం పొందడానికి యిది పెద్దలకు సహాయపడుతుంది. ఏప్రిల్‌లో ప్రచారకులందరు సహాయ పయినీర్లుగా సేవ చేయడానికి గట్టి ప్రయత్నం చేయాలని మేము ప్రోత్సాహిస్తున్నాము.
◼ బైబిలు పరిశోధన జరపడానికి అనుకూలంగా త్వరలోనే న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్—విత్ రెఫరెన్సెస్, ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్ యొక్క రెండు సంపుటిలు ఇంగ్లీషులో కంప్యూటర్ డిస్కెట్ల సెట్టులో అందుబాటులో ఉంచుతాం. అవి 5-1/4-అంగుళాల 1.2-మెగాబైట్లు లేదా 3-1/2 అంగుళాల 1.44-మెగాబైట్ల డిస్కెట్లలో లభ్యమౌతాయి. దీనికి, IBM PC-కంపాటిబుల్ కంప్యూటర్, DOS లో పనిచేస్తూ 512 కిలోబైట్ల జ్ఞాపకశక్తి ఉండాలి. హార్డ్ డిస్క్‌లో అవసరమైన 18 మెగాబైట్ల స్థలం కావాలి. ఇవి ఎల్లప్పుడూ స్టాక్‌లో ఉండవు, ఒకసారి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వాటిని తీసి ఉంచుతాం, కాబట్టి, యీ డిస్కెట్లను కావాలనుకునే వ్యక్తులు తమ సంఘంలోని సెక్రటరీకి వెంటనే ఆర్డరివ్వాలి. సెక్రటరీ మార్చి 1, 1994 కు ముందు లభించిన ఆర్డర్ల ప్రకారం ఎన్ని సెట్లు, ఏ సైజు డిస్కెట్లు కావాలో ఒక తెల్ల కాగితంలో వ్రాసి పంపాలి. మార్చి 1 తర్వాత పంపే ఆర్డర్లకు మేం అందించలేం. ముందు వచ్చిన ఈ ఆర్డర్ల ప్రకారం ఎన్ని సెట్లు కావాలని, వాటికి ఎంత ఖర్చవుతుందని వెంటనే నిర్ణయిస్తాం. వాటికి ఎంత చందా అవుతుందన్నది, మీ కచ్చితమైన ఆర్డర్ ఎప్పుడు పంపాలన్నది, తర్వాత మన రాజ్య పరిచర్యలో తెలుపబడుతుంది.
◼ అందుబాటులోవున్న క్రొత్త ప్రచురణలు:
ఇంగ్లీషు: జెహోవాస్ విట్‌నెసెస్—ప్రొక్లైమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్‌డమ్. ఏడు వందల యాబై పేజీలుగల యీ క్రొత్త పుస్తకం ‘దైవిక బోధ’ జిల్లా సమావేశంలో విడుదలైంది. ప్రచారకులకు, ప్రజలకు రూ. 120.00, పయినీర్లకు రూ. 90.00. బెంగాలి, ఇంగ్లీషు, గుజరాతి, హింది, కన్నడ, మరాఠి, తెలుగు: జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? ముప్పైరెండు పేజీల యీ బ్రోషూరు, గత సంవత్సరపు సమావేశంలో వెలువడింది. ప్రచారకులకు, ప్రజలకు రూ. 4.00, పయినీర్లకు రూ. 3.00. ఫ్రెంచ్: ఎ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్— విల్ ఇట్ కమ్? (కరపత్రం సంఖ్య. 17; విశేషంగా యూదుల కొరకు); జెహోవాస్ విట్‌నెసెస్—వాట్ డూ దే బిలీవ్? (కరపత్రం సంఖ్య. 18; విశేషంగా యూదుల కొరకు). హింది: చర్చనీయ బైబిలు అంశములు.
◼ మరలా లభ్యమగు ప్రచురణలు:
మలయాళం: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము; మరాఠి: దేర్ ఈజ్ మచ్ మోర్ టు లైఫ్!