అర్థవంతమైన పునర్దర్శనాలద్వారా అభివృద్ధికి తోడ్పడండి
1 ఆసక్తి చూపించినవారికి సహాయం చేయడానికి, క్రమంగా పునర్దర్శనాలు చేసి, వారికి ఆత్మీయ ఆహారాన్ని తదేకంగా యివ్వడంలో కొనసాగడం చాలా ప్రాముఖ్యం. వారి ఆత్మీయ అభివృద్ధికి వారిని ప్రేరేపించడానికి మన సందర్శనాలు ఎక్కువగా తోడ్పడతాయి. (1 కొరిం. 3:6-9) అయితే, మన పునర్దర్శనాలు అర్థవంతంగా ఉండడానికి, ఆ వ్యక్తిని మనస్సులో ఉంచుకుని ముందుగానే సిద్ధపడాలి.
2 ఎవరికైతే మనం కరపత్రాన్ని యిచ్చామో, ఆ వ్యక్తిని తిరిగి దర్శించడం: ఒకవేళ మొదటి దర్శనంలో పనిరద్దీలోవున్న గృహస్థునికి శాంతియుతమైన నూతనలోకం అనే కరపత్రాన్ని మాత్రమే యిచ్చివుండవచ్చు.
క్రితం చర్చించిన విషయాన్ని క్లుప్తంగా సమీక్షించిన తర్వాత, మనం యీ విధంగా అడగవచ్చు:
“ఏ ప్రభుత్వం యీ మార్పులను తేగలదు? [అభిప్రాయం చెప్పనివ్వండి.] మీరు కూడా యిలాంటి పరిస్థితుల్లో జీవించడానికి సంతోషిస్తారనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితులను మనం వ్యక్తిగతంగా ఎలా అనుభవించగలం?” “హౌ ఇటీజ్ పాజిబుల్ ఫర్ యు” అనే ఉపశీర్షిక క్రిందవున్న వివరాలను చర్చించవచ్చు. ఈ దర్శనంలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో 30 వ అధ్యాయంలోని, “నిరంతరము జీవించుటకు నిశ్చయముగా మీరు ఏమి చేయవలెను” అనే విషయానికి శ్రద్ధను మళ్ళించగలరు. మనం మొదటి రెండు పేరాలు చర్చించిన తదుపరి “దేవుని గూర్చి నేర్చుకోవడం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?” అని అడగవచ్చు. ఈ పుస్తకాన్ని యిచ్చి, యీ ప్రశ్నకు జవాబివ్వడానికి, యీ అంశాన్ని గూర్చి మరెక్కువగా చర్చించడానికి మరొక సందర్శనానికి ఏర్పాట్లు చేయవచ్చు.
3 “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని ఎవరికిచ్చామో వారిని తిరిగి దర్శించినపుడు, మనమీ విధంగా చెప్పవచ్చు:
◼ “నేను క్రితం వచ్చినపుడు, మానవజాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గూర్చి, వాటి విషయమై దేవుడు చేసిన వాగ్దానాలను గూర్చి మనం చర్చించాం. దేవుడు యింత కాలం కష్టాలను ఎందుకు అనుమతించాడు అన్న ప్రశ్న వచ్చింది. మీరు తీసుకున్న పుస్తకంలోని 11 వ అధ్యాయంలో దానికి ఆసక్తికరమైన సమాధానం ఉంది.” అనుకూలమైతే గృహస్థున్ని తన పుస్తకం తీయమని చెప్పండి. కొన్ని పేరాలు చర్చించిన తర్వాత మనమీ విధంగా అడగవచ్చు: “దేవుని వాగ్దానాల నుండి ప్రయోజనం పొందాలంటే మనం ఏం చేయాలి?” నూట యిరవైఏడవ పేజీలోని, 15 వ అధ్యాయంలో “దేవుని ప్రభుత్వమందొక పౌరుడగుట” అన్న అంశాన్ని తర్వాతి సందర్శనం కొరకు నొక్కి చెప్పండి.
4 ఎవరికైతే పత్రికలనిచ్చామో వారిని తిరిగి దర్శించడం: గృహస్థునికి ఆసక్తివున్న ఒక ప్రత్యేక శీర్షికను మీరు ఎన్నుకున్నట్లయితే, మీరు తిరిగి దర్శించినపుడు, ముఖ్యమైన లేఖనాన్ని, అది చర్చించిన విషయాన్ని గూర్చి, మీ అభిప్రాయాన్ని నొక్కిచెబుతూ, ఆ అంశాన్ని చర్చించి ఆ శీర్షిక నుండి అదనపు సమాచారాన్ని చూపించండి. ఇంకా ఆసక్తి పెరుగుతున్నట్లయితే, ఆ పత్రిక యొక్క ప్రయోజనాలను గూర్చి చర్చించవచ్చు. అలాగే ఆ అంశాన్ని గూర్చే తరువాతి సంచికలో కూడ ఉంటే దానిపై శ్రద్ధను మళ్ళించవచ్చు. లేకపోతే, ఆ అంశాన్నిగూర్చి నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని విషయాలకు మనం వారి శ్రద్ధను మళ్ళించి, తరువాత మనం చేయబోయే సందర్శనంలో దాన్ని చర్చించడానికి ఏర్పాటు చేయండి.
5 అర్థవంతమైన పునర్దర్శనాలు చేయడంలో మనం చూపించే వ్యక్తిగత ఆసక్తి,, ప్రజలయెడల, యెహోవాయెడల మనకుగల ప్రేమను చూపిస్తుంది. (యోహాను 13:34, 35) క్రమంగా అర్థవంతమైన పునర్దర్శనాలు చేస్తూ, మన ప్రాంతంలో ఉన్నవారి ఆత్మీయ అభివృద్ధిని ప్రేరేపించడంలో కొనసాగుదాము.