నిరంతరము జీవించగలరు పుస్తకంతో బైబిలు పఠనాలను ప్రారంభించుట
1 సత్యం కొరకు ఆకలిదప్పులుగలవారి వద్దకు తిరిగి వెళ్లి, వారికి సహాయపడడానికి ప్రేమ మనలను ప్రోత్సహించాలి. (మత్త. 5:6) మనం ఆసక్తిని కనుగొన్నట్లైతే, ఆ ఆసక్తి కోల్పోకుండా ఉండాలనుకుంటే దాన్ని గుర్తించి, అట్టి ఆసక్తిని పెంపొందించాలి. విజయానికి సిద్ధపాటు కీలకమైవుంది.
2 బైబిలు పఠనాలను ప్రారంభించడమే మన గురియైవుండాలి. (మత్త. 28:20) నిరంతరము జీవించగలరు పుస్తకము యొక్క మొట్టమొదటి ప్రచురణలలో ఈ పరిచయ వ్యాఖ్యానాలు వున్నాయి: “యౌవనులు లేదా వృద్ధులు, వాళ్ల విద్యాస్థాయి ఏదైనప్పటికి, ప్రతి ఒక్కరితోను పఠనం చేయడానికి యిది నిజంగా ఒక అద్భుతమైన పుస్తకం.” క్రొత్త ప్రచారకులు కూడా భాగంవహించేలా చేస్తూ, సులభంగా పఠనాలు నిర్వహించే విధంగా యిది వ్రాయబడింది. పునర్దర్శనాలు చేయడంలోగల మన ప్రభావశీలతపైనే క్రొత్త పఠనాలను ప్రారంభించడంలో విజయం సాధించడమనేది ఆధారపడివుంటుంది.
3 మనమెలా పఠనాలను ప్రారంభించగలం?: మనం పునర్దర్శించడానికి వెళ్లినప్పుడు, మన తొలి సందర్శనలో ప్రస్తావించిన ఏదొక విషయంతో లేదా ప్రశ్నతో మన చర్చను ముడిపెట్టడం సాధారణంగా మంచిది. బహుశ మీరు మరణించినవారి స్థితిని గూర్చి చర్చించి, “మరణించిన మన ప్రియమైనవారికి ఏ నిరీక్షణ కలదు?” అనే ప్రశ్నను విడిచిపెట్టి ఉండవచ్చు. పునరుత్థానమనేది నిర్హేతుకమైన నిరీక్షణ కాదని వివరించండి; యిప్పటికే పునరుత్థానం జరిగిన అనేక ఉదాహరణలు బైబిలులో లిఖించబడ్డాయి. పేజీలు 167-9లో వున్న దృష్టాంతాలను పునర్విమర్శించండి. తర్వాత 166 పేజీనందలి 1, 2 పేరాలలో చెప్పబడినదాన్ని చర్చించండి. ఒకవేళ ఆసక్తి వున్నట్లైతే, యింకా చర్చించడానికి మరలా వస్తానని చెప్పండి.
4 పిల్లలను పెంచడంలో అనుభవించు సమస్యలు పెరుగుతుండడాన్ని బట్టి చింతను వ్యక్తం చేసిన ఒక తల్లి లేదా తండ్రితో మీరు బహుశా మాట్లాడియుండవచ్చు. మీరు బహుశ, మీ స్వంత మాటలతో, ఈక్రింది విధంగానైనా చెప్పవచ్చు:
◼ “తల్లిదండ్రులందరూ తమ పిల్లల శ్రేయస్సును కోరుతారు. అర్థవంతమైన, ఉద్దేశంతో కూడిన సంతృప్తికరమైన జీవితాన్ని పొందే విషయంలో తర్ఫీదునివ్వడానికి సహాయపడే ఉపదేశం బైబిలులో వుంది. ఆ కారణాన్నిబట్టే, కుటుంబాలు కలిసి బైబిలు పఠనం చేయాలని మేము దృఢంగా చెబుతున్నాము. [పేజీ 246 లోని 23వ పేరాను సూచించండి.] సంపాదించిన జ్ఞానం కుటుంబమంతటికీ నిత్య ఆశీర్వాదాలను తీసుకురాగలదు.” యోహాను 17:3 చదవండి. ఆ కుటుంబానికి తమ పఠనాన్ని ఎలా ప్రారంభించాలో చూపడానికి, పునర్దర్శించుటలో గల మీ యిష్టతను వ్యక్తంచేయండి.
5 మీరొకవేళ యౌవన లేదా క్రొత్త ప్రచారకులైయుండి పరదైసు నిరీక్షణగూర్చి తొలి సందర్శనలోనే మాట్లాడినట్లైతే, ఆ పుస్తకాన్ని 3వ పేజీకి తెరచి, కేవలం ఈక్రింది విధంగా మాట్లాడండి:
◼ “దేవుని చిత్తం చేసేవారు సంతోష సమాధానాలుగల ఈలాంటి లోకంలో జీవించడానికి ఎదురుచూడవచ్చని బైబిలు వాగ్దానం చేస్తుంది. ఆ ఆశీర్వాదాలను పొందడానికి మనమేమి చేయాలనే విషయాన్ని ఈ పుస్తకం చూపెడుతుంది.” మన పఠన విధానాన్ని క్లుప్తంగా వివరించి, దాన్ని ప్రదర్శిస్తానని చెప్పండి.
6 యేసు శిష్యులుగా, ప్రజలకు సహాయపడాల్సిన బాధ్యత మనకుంది. (రోమా. 10:14) సాహిత్యాన్ని అందించినా లేదా కేవలం మంచిగా సంభాషించినా, ఆ ఆసక్తిని పెంపొందించే బాధ్యత మనకుంది. (మత్త. 9:37, 38) అప్పగించబడిన ఈ పనిని మనం సక్రమంగా నెరవేర్చితే, ఫలితంగా వచ్చే ఆశీర్వాదాలను అందరూ పంచుకోవచ్చును.—1 తిమో. 4:16.