దేవుని వాక్యం శక్తి గలది
1 బైబిలు, లక్షలాదిమంది ప్రజల జీవితాలను ఎంతో ఎక్కువగా ప్రభావితం చేసింది. మానవుడు చెప్పగలిగేదానికన్నా అది చెబుతున్నదే ఎక్కువగా పురికొల్పునిస్తుంది. (హెబ్రీ. 4:12) అది మన కొరకు ఏం చేసిందో చూద్దాం. నిజంగా, దాని విలువ సరిపోల్చలేనిది.
2 యెహోవాసాక్షులు అగ్రగణ్యులైన బైబిలు విద్యార్థులు, మరియు దాని పక్షాన వాదించేవారు. మనం దూరదర్శిని చూడడానికన్నా, యితర వినోదాల్లో మునగడంకన్నా బైబిలు చదవడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, మన క్రమమైన దైవపరిపాలనా పట్టికలోని ముఖ్య భాగంగా దీన్ని దృష్టించాలి.
3 దాన్ని క్రమమైన అలవాటుగా చేసుకోండి: క్రమంగా బైబిలు చదవడం శక్తిమంతమైన ప్రభావాన్ని చూపగలదని యెహోవా ప్రజలు గ్రహించారు. బ్రూక్లిన్‌లోని మన కర్మాగార భవనంపై ఉన్న లిఖిత ఫలకం ఎన్నో సంవత్సరాలుగా బాటసారిని “ప్రతిరోజు దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును చదవండి,” అని ఉద్బోధిస్తూ ఉంది. బేతేలు కుటుంబంలోని కొత్త సభ్యులు తమ బేతేలు సేవలోని మొదటి సంవత్సరంలో బైబిలును పూర్తిగా చదవవలసిన అవసరత ఉంది.
4 మీకు రద్దీగల పట్టిక ఉన్నప్పటికీ, దైవపరిపాలనా పాఠశాల పట్టికలో సూచించబడిన వారపు బైబిలు పఠన భాగాన్ని చదువుతున్నారా? ఇలా చేయడం మీకు కష్టంగా ఉన్నట్లయితే నవంబరులో దానిని మెరుగుపర్చుకోడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఈ నెల మొత్తంలో బైబిలు పఠనం కీర్తనలు 63-77 వరకే, అంటే వారానికి రెండు పేజీలు చదవవలసి ఉంది. ప్రతిరోజు, బహుశా, ఉదయాన్నే లేదా రాత్రి పండుకునే ముందు కొంత చదువుకోవాలని కొందరు నిర్ణయించుకున్నారు. ఎలాగైనా, మీరది చేయండి, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం ద్వారా వచ్చే మంచి ప్రయోజనాలను మీరు పొందాలన్నదే ప్రధానమైన విషయం.
5 నవంబరులో బైబిలును అందించండి: అనేకమంది ప్రజలు బైబిలును గౌరవిస్తారు, అలాగే మనం దాని నుండి చదివినప్పుడు వినడానికి యిష్టపడతారు. నవంబరులో మనం ఎక్కువగా నూతనలోక అనువాదము మరియు బిలు—దేవుని వాక్యమా లేదా మానవునిదా? అనే రెండు పుస్తకాలను అందిస్తాము. ఇది యథార్థహృదయులకు దేవుని వాక్యపు విలువను తెలపడానికి ఎక్కువ అవకాశాన్నిస్తుంది. అలా చేయడంలో ఉత్సాహంగలవారై ఉండండి.
6 నూతనలోక అనువాదము పొందాలి అనే ఆసక్తిని ప్రజలలో రేకెత్తించేలా దాని విశిష్టమైన అంశాలపై ఆలోచనాపూర్వకంగా వ్యాఖ్యానాలను తయారు చేసుకోండి. దాని ఆచరణాత్మక విలువను ఉన్నతపర్చి, దానిని బిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే పుస్తకంతో ముడిపెట్టండి. బైబిలు పఠనంలో దాని విలువను చూపిస్తూ, 92-పేజీల బైబిలు పదాల విషయసూచిక లేదా “అనుబంధాన్ని” లేదా “బైబిలు పుస్తకాల పట్టిక”ను మీరు చూపించవచ్చు. సులభంగా అర్థం చేసుకోడానికి వీలుగా నూతనలోక అనువాదము ఆధునిక ఆంగ్లంలో ఉందని సూచించండి. నూతనలోక అనువాదము యెహోవా అను దైవిక నామాన్ని 7,210 సార్లు ఉపయోగించిందని చెప్పండి.
7 గృహస్థునికి ఆంగ్లం తెలియకపోతే లేదా నూతనలోక అనువాదమును తిరస్కరిస్తే ఒక బ్రోషూర్‌ను లేదా 192-పేజీల పుస్తకాన్ని మీరు అందించవచ్చు. ఆ ప్రచురణయందున్న సువార్త మరియు మార్గనిర్దేశము ఆచరణాత్మకమైనవి, ఎందుకంటే అవి దేవుని వాక్యం నుండి తీయబడ్డాయి అన్న నిజాన్ని ఉన్నతపర్చాలని నిశ్చయపర్చుకోండి.
8 అవును, బైబిలు దేవుని వాక్యమే. మనం దాన్ని చదివినట్లయితే, దాన్ని నమ్మినట్లయితే, దాని ఉపదేశాన్ని మన జీవితాల్లో అన్వయించుకున్నట్లయితే, మనం గొప్ప ప్రయోజనాలను పొందుతాము. మనకు మార్గనిర్దేశాన్ని, నిరీక్షణను యివ్వడానికి అది వ్రాయబడింది. (రోమా. 15:4) మనం ప్రతి దినం దాన్ని పరిశీలించి, యితరులకు బోధించడానికి దాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండడం ప్రధానము.