ప్రకటనలు
◼ అందించవలసిన సాహిత్యాలు జనవరి: ప్రత్యేక అందింపుగా 192-పుటల పాత పుస్తకాలను ఒక్కొక్కటి రూ. 8.00 చందాకు అందించాలి. ఈ కోవకు చెందిన మా దగ్గర లభ్యమయ్యే పుస్తకాల పట్టిక కొరకు దయచేసి డిశంబరు 1994 మన రాజ్య పరిచర్యను చూడండి. నేపాలీ, పంజాబి లేదా బెంగాలి తెలిసిన వారికి మన సమస్యలు లేదా వేరే బ్రోషూర్‌ను అందించవచ్చు. మలయాళంలో మీ యౌవనమును—పరిపూర్ణముగా ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00. చందాకు అందించవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందించకూడదని దయచేసి గమనించండి. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకానికి రూ. 45.00 చందా (చిన్న సైజు రూ. 25.00). ఈ పుస్తకాన్ని అందించిన తర్వాత, పునర్దర్శనాలు చేసి, బైబిలు పఠనాలు ఆరంభించడానికి ప్రయత్నాలు చేయాలి. మార్చి: యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు అనే పుస్తకానికి రూ. 25.00 చందా. (ఈ పుస్తకం ఆంగ్లంలోను, మలయాళంలోను, తమిళంలోను లభ్యమవుతుంది.) ఇతర భాషల్లో 192-పుటల ఏ క్రొత్త పుస్తకాన్నైనా రూ. 15.00 సాధారణ చందాకు అందించవచ్చు. ఏప్రిల్, మే: కావలికోట లేదా జరిల్లు! పత్రికల చందాలు.
◼ ఈ సంవత్సరం, ఏప్రిల్ 14, శుక్రవారము, సూర్యాస్తమయం తర్వాత, జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడానికి సంఘాలు సౌకర్యమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి సంఘం తానుగా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడం కోరదగినదే కాని, ఇది ఎల్లవేళలా సాధ్యం కాకపోవచ్చు. సామాన్యంగా, ఒకే రాజ్యమందిరాన్ని అనేక సంఘాలు ఉపయోగించే చోట, బహుశా ఒకటి లేదా రెండు సంఘాలు ఆ సాయంకాలానికి వేరే సౌకర్యాన్ని సంపాదించుకోగలవు. జ్ఞాపకార్థ ఆచరణను మరీ ఆలస్యంగా ఆరంభించకూడదు, ఆసక్తి గల క్రొత్తవారు హాజరవడానికి అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాక, వచ్చినవారిని ఆచరణకు ముందు లేక దాని తర్వాత కూడా పలకరించడానికి, కొందరికి ఆత్మీయ సహాయాన్ని ఎడతెగక అందించడానికి ఏర్పాట్లు చేయడానికి, లేదా పరస్పర ప్రోత్సాహాన్ని అనుభవించడానికి సమయం లేని విధంగా పట్టిక వేసుకోకూడదు. పెద్దలు అన్ని విషయాలను బాగా ఆలోచించిన తర్వాత, హాజరయ్యే అందరూ ఆ ఆచరణ నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి సహాయపడే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాలి.
◼ ప్రాంతీయ కాపరులు జనవరి నుండి ఇచ్చే క్రొత్త బహిరంగ ప్రసంగ అంశము “యెహోవాను ఎందుకు ఆశ్రయించాలి.”
◼ “పైశాచిక ఆచారాలను గూర్చిన బైబిలు అభిప్రాయము” అనే పేరుగల క్రొత్త బహిరంగ ప్రసంగ సంక్షిప్త ప్రతిని సొసైటీ తయారు చేసింది. దీనికి 95వ ప్రసంగం అని పేరు పెట్టబడుతుంది. దాని రెండు ప్రతులు అన్ని సంఘాలకు పంపబడతాయి. ఈ ప్రసంగం ప్రత్యేకమైన విధంగా అందించబడదు. అయితే సంఘాలు ఉపయోగించే ఎప్పటికీ ఉండే సంక్షిప్త ప్రతుల పరంపరలో అది భాగంగా ఉంటుంది. వారు తమ స్థానిక పరిస్థితులకు తగిన సమయంలో ప్రసంగమిచ్చే విధంగా పట్టిక వేసుకోవచ్చు.
◼ ఆదివారము, ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాల్లో ఒక ప్రత్యేక బహిరంగ ప్రసంగం యివ్వబడుతుంది. ప్రసంగ విషయం “అబద్ధమత అంతం సమీపించింది.” సంఘాలన్నింటికి 96వదిగా పిలువబడే ప్రసంగ సంక్షిప్త ప్రతులు రెండు ఇవ్వబడతాయి. అది భవిష్యత్తులో సంఘాలు ఉపయోగించే సంక్షిప్త ప్రతుల శాశ్వత పరంపరల భాగమవుతుంది. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే అందరినీ తప్పకుండా ఆహ్వానించండి. ఎవరితోనైతే గృహ బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయో ఆ లక్షలకొలది విద్యార్థులకు సహాయపడడానికి ప్రత్యేక ప్రయత్నం చేయబడుతుంది. ఆ రోజు కూటం తర్వాత యివ్వబడే సమాచారం, ఒక ప్రత్యేక కరపత్రాన్ని అందించడంలో పాల్గొనేలా నిరీక్షించేందుకు వారిని, మన సహోదరులనందరిని పురికొల్పుతుంది. అది వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను, అలాగే దేవుని వాక్యానికి అనుగుణంగా దృఢ నిశ్చయంతో ప్రవర్తించవలసిన అవసరతను సూచిస్తుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ కాపరి సందర్శనం, ప్రాంతీయ సమావేశం, లేదా ప్రత్యేక దిన సమావేశం ఉన్న సంఘాలకు, తరువాతి వారంలో యీ ప్రత్యేక ప్రసంగం యివ్వబడుతుంది. ఏప్రిల్ 23కు ముందు ఏ సంఘంలోను ప్రత్యేక ప్రసంగం యివ్వకూడదు.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
ఆంగ్లం: కావలికోట ప్రచురణల విషయ సూచిక 1991-1993 (పయినీర్లకు రూ. 11.00, ప్రచారకులకు రూ. 18.00). యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ అనే వీడియో క్యాసెట్టు ఇండియాలో డూప్లికేటు చేయబడింది, దాని స్టాకు పరిమితంగా లభ్యమవుతుంది. దీనికొరకు మామూలు సాహిత్య ఆర్డరు (S-AB-14) ఫారములో ఆర్డరు చేయవచ్చు. పయినీరుకు ఒక క్యాసెట్టు వెల రూ. 150.00, ప్రచారకునికి వెల రూ. 200.00.
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
ఆంగ్లం: యుద్ధం లేని లోకం ఎప్పుడైనా ఉంటుందా? (యూదుల కొరకైన బ్రోషూర్); రెఫరెన్సులతో కూడిన—పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము (పెద్ద అచ్చు పత్రికలు, Rbi8).