ఇతరుల యెడల శ్రద్ధ చూపించండి—2వ భాగము
1 కారణ సహితంగా సాధ్యమైనంతవరకు, మన చుట్టుప్రక్కల నివసించే ప్రజలతో మంచి సంబంధము కలిగివుండడానికి మనమిష్టపడతాము. దీనికొరకు మనము వాళ్ల హక్కులను, భావాలను గౌరవించడం మరియు శ్రద్ధ కనబర్చడం అవసరము.
2 యెహోవాసాక్షులు సత్ప్రవర్తనకు పేరుపొందారు. ఇరుగుపొరుగున, పాఠశాలలోను, పనిచేసే స్థలంలోను, అలాగే మన సమావేశాల్లోను ఎన్నో అనుకూలమైన వ్యాఖ్యానాలను పొందడానికి మన సత్ప్రవర్తనా ప్రమాణాలు కారణమయ్యాయి.—జూన్ 15, 1989, కావలికోట (ఆంగ్లం), పుట 20ను చూడండి.
3 నిజమే, మంచి నడవడియందు, యథార్థత, శ్రద్ధ మరియు మంచి నైతికసూత్రాలవంటి చాలా విషయాలు ఇమిడివున్నాయి. మన రాజ్యమందిరం చుట్టుప్రక్కల ప్రాంతములో నివసిస్తున్న ప్రజలయందు గౌరవాన్ని కలిగివుండడంకూడ ఇమిడివుంది. మన పొరుగువారియెడల శ్రద్ధను చూపటంలో మనము విఫలమయితే, అది మన దైవిక ప్రవర్తనను ఇతర విషయాల్లోకూడా అలక్ష్యం చేసినట్లవుతుంది. పౌలు మనకు ఇలా హెచ్చరిక చేశాడు “సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.”—ఫిలి. 1:27.
4 అప్పుడప్పుడు, కొన్ని రాజ్యమందిరాల చుట్టు నివసించే ప్రజలు ఫిర్యాదులను చేయటం జరిగింది, ఎందుకంటే కూటాలకు హాజరయ్యే వాళ్లు తమపై తగిన శ్రద్ధను చూపనట్లుగా వాళ్లు భావించుటవలన అలా జరిగింది. సహోదర సహోదరీలు రాజ్యమందిరము ముందున్న కాలిబాటయందు గుమికూడి, దగ్గర గృహాల్లో నివసించే వారు వినగలిగేలా ఉత్సాహకరమైన సంభాషణలను కొనసాగించడాన్ని నివారించాలి. పిల్లలు రాజ్యమందిరము లోపలికి బయటకు పరుగెత్తటానికి అనుమతించకూడదు. ఆలోచనారహితంగా కారు తలుపులను దఢాలున మూయటం లేదా స్కూటరు హారన్లను మ్రోగించటంవలన ఇరుగు పొరుగువారికి భంగం కలగవచ్చు. ఇటువంటి ప్రవర్తన సంఘంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. అంతేకాకుండా, ఆ ప్రాంతములోవున్న అన్ని రాకపోకల నియమాలను మనం పాటించడమన్నది ప్రాముఖ్యమైనది.—రోమా. 13:1, 2, 5.
5 వాహనాలను నిలిపే విషయంలోకూడ అదే మాదిరి సమస్యలు ఇమిడివున్నట్లుగా నివేదించబడ్డాయి. కార్లను, స్కూటర్లను, లేదా సైకిళ్లనుకూడా ప్రైవేటు రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రదేశాల్లోను, గృహాలు లేదా దుకాణాల ప్రవేశద్వారంవద్ద ఆటంకం కలిగే విధంగా ఉంచకూడదు. సమీపంలో వ్యాపారస్థులు తమ వినియోగదార్లు వాహనాలను నిలుపుకొనేందుకు కేటాయించిన స్థలాల్లో అనుమతి లభించకపోతే వాటిని ఉపయోగించుకొనకూడదు. ఒకే రాజ్యమందిరాన్ని మూడు లేక నాలుగు సంఘాలు ఉపయోగించుకుంటున్నట్లయితే, కూటాలు దాదాపు వారంలో ప్రతిరోజు జరిగే పట్టికను కలిగివున్నట్లయితే, పెద్దల సభల మధ్యన సన్నిహిత సహకారం అవసరము.—కావలికోట, అక్టోబరు 1, 1988, 17వ పుట, 13వ పేరాను చూడండి.
6 “సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని బైబిలు ఆజ్ఞాపిస్తుంది, దానిలో బయటివారియెడల ఆసక్తి చూపడంకూడా ఇమిడివుంది. (1 కొరిం. 10:31-33) ‘ఇతరుల వ్యక్తిగత కార్యముల’ యెడల మనం దృష్టివుంచినట్లయితే, మనము ఆలోచనారహితంగా వాళ్ల ఆస్తిలో చొరబడము. (ఫిలి. 2:4) ప్రాంతీయ వ్యాపారుల వ్యాపార కార్యకలాపాల్లో కూడా మనం జోక్యం చేసుకోము.
7 సంఘంలోనున్న వారియెడల, బయటివారియెడల—ఇరు పక్షాల వారి యెడల ఆసక్తిని చూపించడం—మనము హృదయాల్లో భావిస్తున్న దాని బాహ్య వ్యక్తీకరణ. మనం చేసేది, చెప్పేది మనం ‘మనవలె మన పొరుగువారిని ప్రేమిస్తామని’ చూపించేలా ఉండాలి.—మత్త. 7:12; 22:39.