వర్షాకాలం మళ్ళీ వచ్చింది!
1 వర్షాకాలం వేసవి వేడి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది, అయితే అది ప్రయాణంలోను మరియు పరిచర్యలో భాగం వహించడంలోను సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. అయితే, మన ముఖ్య విషయాల పట్టికలో దైవ పరిపాలనా కార్యక్రమాలు మొదట ఉండాలని మనం గుర్తుంచుకోవలసిన అవసరముంది. మనం ప్రాంతీయ పరిచర్యలో క్రమమైన భాగం వహించాలని, వెంటనే దానిని సంఘానికి నివేదించాలని కోరుకుంటాం. ఇందుకు మంచి గొడుగు లేదా రెయిన్ కోటు మరియు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ వంటి వాటితో వర్షాకాలంలో పరిచర్యకు మనం చక్కగా సిద్ధపడవలసిన అవసరముంది. మనం అన్ని సమయాల్లోను సముచితమైన కొన్ని రకాల పుస్తకాలను తీసుకు వెళ్తే, అనియత సాక్ష్యమివ్వడానికి సందర్భం దొరికినప్పుడు మనం ఏదైనా ఒకటి అందించగలుగుతాము.
2 పాఠశాలకు తిరిగివెళ్ళే యౌవనస్థులు ప్రాంతీయ పరిచర్యలో క్రమంగా కొనసాగడంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరముంది. బైబిలు పఠన భాగం, కూటాల్లో ప్రతి వారం చర్చించబడే విషయాలను సిద్ధపడడంతో సహా వ్యక్తిగత పఠన పట్టికను అనుసరించడానికి ప్రయత్నించవలసిన అవసరం మనకందరికీ ఉంది. వర్షాకాలంలోని నెలలు మన దినచర్యలో మార్పులు తెచ్చినప్పటికీ, మనం ‘మరింత ముఖ్యమైన ఆత్మీయ విషయాలతో’ కొనసాగాలని కోరుకుంటాము.—ఫిలి. 1:10.