ఇతరుల ప్రయోజనార్థమై ఆసక్తిగల వారినందరినీ మళ్ళీ సందర్శించండి
1 మనం ఒకరిని మళ్ళీ సందర్శించాలా వద్దా అని నిర్ణయించేందుకు మనకు సహాయపడే కీలకాంశమేది? ఆసక్తి! రాజ్యవర్తమానంలో ఎవరైనా కొంత ఆసక్తి చూపించినప్పుడెల్లా, ఆ వ్యక్తి ప్రయోజనార్థమై మనం చేయగలిగినదేదైనా చేయాలని మనం కోరుకుంటాం. కనుక ఆ వ్యక్తికున్న ఆసక్తిని రేకెత్తించాలని గృహ బైబిలు పఠనాన్ని ఆరంభించాలనే లక్ష్యంతో మనం పునర్దర్శనాలను చేస్తాము. మనం సాహిత్యాన్ని అందివ్వనిచోట కూడా మన లక్ష్యం ఇదే. దీనినెలా చేయవచ్చు?
2 క్రితంసారి మీ సంభాషణ నేడు అంతటా వ్యాపించి ఉన్న వివాహ సమస్యలను గూర్చి అయినట్లయితే, “నిరంతరము జీవించగలరు” అనే పుస్తకాన్ని ఇచ్చినట్లయితే, మీరు మీ సంభాషణను ఈ విధంగా ఆరంభించవచ్చు:
◼ “నేను మొదటిసారి వచ్చినప్పుడు వివాహాన్ని గూర్చి, మరింత సంతోషాన్ని కనుగొనేందుకు మనకు సహాయపడే ఆచరణాత్మక బైబిలు సలహాను గూర్చి మనం మాట్లాడుకున్నాం. మంచి కుటుంబాల్లో కూడా తరచూ సమస్యలు తలెత్తుతుంటాయన్నది నిజం కాదా? [జవాబు చెప్పనివ్వండి.] కుటుంబ బంధాల్లోని సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు సహాయపడే చక్కని ఉపదేశాన్ని బైబిలు మనకిస్తుంది. బైబిలును కలిసి పఠించడం ద్వారా కుటుంబం ఆశీర్వదించబడగలదు.” పేజీ 246కు త్రిప్పి, 23వ పేరాను చర్చించండి. యోహాను 17:3 చదివి, కుటుంబంలో బైబిలును పఠించనారంభించేందుకు సహాయపడడంలో మీరు తోడ్పడుతారని చెప్పండి.
3 మీరు పిల్లలను గూర్చి మరి వారికి తర్ఫీదునివ్వవలసిన అవసరతను గూర్చి మాట్లాడినట్లయితే, మీరు ఈ విధంగా చర్చను కొనసాగించవచ్చు:
◼ “పిల్లలకు అవసరమైన ఆత్మీయ తర్ఫీదును గూర్చి, తలిదండ్రులు వారికెలా సహాయపడవచ్చనే విషయాన్ని గూర్చి మనం క్రితంసారి మాట్లాడుకున్నాము. నేను మాట్లాడిన చాలామంది తలిదండ్రులు నేటి అనేక మంది యౌవనస్థుల చెడు ప్రవర్తనను గురించి దిగులుపడుతున్నారు. . . . గురించి మీరేమనకుంటారు? [మీ సమాజంలో తరచూ గమనించబడిన యౌవనుల దుష్ప్రవర్తనకు ఒక ఉదాహరణను పేర్కొనండి. జవాబు చెప్పనివ్వండి.] బైబిలులో ఇవ్వబడిన కొన్ని ఆచరణాత్మక సలహాలను మీకు చూపించనివ్వండి.” నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో 246వ పేజీలోని 22వ పేరాలోని ముఖ్య విషయాన్ని చర్చించి, ఎఫెసీయులు 6:4 చదవండి. చాలా మంది పిల్లలు నిజంగా క్రమశిక్షణను మరియు మార్గనిర్దేశాన్ని కోరుకుంటారని చెప్పండి. తలిదండ్రులు దానిని ఇవ్వడంలో శ్రద్ధగలవారైనప్పుడు, పిల్లలు మరింత సంతోషంగాను తమ నడవడిలో మరింత మర్యాద గలవారుగాను ఉంటారు. మన పిల్లలతో మనం బైబిలును ఎలా పఠిస్తామో వివరించండి.
4 సంభాషణా విషయం భూపరదైసు అయినట్లయితే ఆసక్తిని రేకెత్తించేందుకు మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “దేవుడు భూమిని పరదైసుగా చేసినప్పుడు, అది ఎలా ఉంటుందో చూపించే కొన్ని చిత్రాలను మనం ఈ పుస్తకంలో చూశాము. మనం వాటిని మన ప్రియమైనవారితో ఆనందించకపోతే మనకు దానివల్ల ఏ ఆనందమూ లేదు. మీరు ఒప్పుకోరా?” జవాబు చెప్పనివ్వండి. తరువాత నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలో 162వ పేజీకి త్రిప్పండి. ప్రకటన 21:3, 4 చదివి మన ప్రియమైనవారు ఎల్లప్పుడూ మనతో ఎలా ఉండగలరు అనే దానిని గూర్చి వివరించండి. అనుకూలంగా ప్రతిస్పందిస్తే, మరణించినవారు తిరిగి జీవిస్తారు అని చూపించడానికి యోహాను 5:28, 29 చదవండి. పుస్తకం ముఖ పత్రాన్ని చూపించి, ఈ విధంగా చెప్పండి: “ఇది నిజంగా సత్యం—మనం పరదైసు భూమిపై నిరంతరము జీవించగలం!” అది సమీపించినదని మనకెలా తెలుసో చర్చించేందుకు మరొక దర్శనానికి ఏర్పాటు చేయండి.
5 రాజ్య వర్తమానం నుండి ఆసక్తిగల వ్యక్తులు ప్రయోజనం పొందేందుకు సహాయపడడమే పునర్దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆత్మీయ విషయాల కొరకైన తమ ఆకలిని పెంచేందుకు అనేకులకు ప్రేరణ అవసరం. బైబిలును ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సాహిత్యం వాళ్ళకెలా సహాయం చేస్తుందో నొక్కిచెప్పి, అందులోని ఆచరణాత్మక విలువను గూర్చిన ప్రత్యేక అంశాల వైపుకు వారి శ్రద్ధను మళ్ళించండి. ఈ లక్ష్యాలను నెరవేర్చే పునర్దర్శనాలు ఇతరులు తమకు తాము సాధ్యమైనంత మంచి మార్గంలో ప్రయోజనం పొందేందుకు సహాయపడతాయి.