క్రమంగా కూటాలకు హాజరు కావడం—మనం స్థిరంగా నిలబడడానికి ఎంతో ఆవశ్యకం
1 “విశ్వాసవిషయమున స్వస్థు”లుగా ఉండాలని అపొస్తలుడైన పౌలు కోరుతున్నాడు. (తీతు 1:9, 13) సంఘ కూటాల్లో మనం హితకరమైన తలంపులను పరిశీలిస్తాము, “అపవాది తంత్రములకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడ”గలిగేలా మనమెలా ఆత్మీయ కవచాన్ని సంపూర్ణంగా ధరించుకుని ఉండాలనే విషయంలో మనం బోధించబడుతున్నాం.—ఎఫె. 6:11, NW; ఫిలి. 4:8.
2 కూటాలు మనకవసరమైనవాటిని అందిస్తాయి: మనం స్థిరంగా నిలబడేందుకు కూటాలకు క్రమంగా హాజరు కావడం ఎంతో ఆవశ్యకం. (1 కొరి. 16:13) కూటాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అలాగే సంఘం కొరకు దాని అవసరతల కొరకు ఆయనను వేడుకోవడానికి ప్రార్థనలు చేయబడతాయి. (ఫిలి. 4:6, 7) రాజ్య గీతాలను పాడడం మనకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది, మనం యెహోవాను ఆరాధిస్తుండగా మన భావాలను అనుభూతులను వ్యక్తపరచడానికి మనలను సమర్థులను చేస్తుంది. (ఎఫె. 5:19, 20) రాజ్యమందిరం వద్ద కూటాలకు ముందు ఆ తర్వాత మన సహవాసం మనలను ప్రోత్సాహపరుస్తుంది, బలపరుస్తుంది, మనకు నూతన ఉల్లాసాన్ని కలిగిస్తుంది.—1 థెస్స. 5:11.
3 గత ఏప్రిల్లో “అబద్ధమతాంతం సమీపించింది” అనే ప్రత్యేక ప్రసంగం మహా బబులోను నుండి బయటకు వచ్చేందుకు సత్వరంగా చర్యను గైకొనవలసిన అగత్యాన్ని గూర్చి సత్యాన్ని ప్రేమించేవారి మనస్సులపై చెరగని ముద్రను వేసింది. (ప్రక. 18:4) కావలికోటలోని నీతిమంతుల మార్గాన్ని తేజోవంతం చేసే మెరుపులను గూర్చిన మూడు పఠన శీర్షికలు ఉండడం జూన్ జూలై నెలల్లో ఎంత ప్రోత్సాహకరంగా ఉండెనో! (సామె. 4:8) ఆ కూటాలకు వెళ్ళడాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఉన్నట్లయితే మనం దేనిని కోల్పోయి ఉండేవారమో తలంచండి.
4 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అనేది మొత్తం సంఘం యొక్క కొనసాగుతున్న విద్యాబోధన కొరకైన ఒక ఏర్పాటని మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరించబడియున్నాము అనే పుస్తకం 72వ పేజీలో చెబుతుంది. ప్రస్తుతం ఆంగ్ల భాషా పట్టిక ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉపయోగిస్తూ, సంస్థ యొక్క ఆధునిక చరిత్రతో మనకు చక్కని పరిచయం ఏర్పడేందుకు సహాయం చేస్తుంది. మనం ఈ విద్యాభ్యాసాన్ని పొందే అవకాశాన్ని కోల్పోలేము.
5 పరిచర్యలో మరింత ఫలవంతంగా ఉండేందుకు మన సేవా కూటం మనలను సన్నద్ధం చేస్తుంది. రాజ్య వార్త నెం. 34ను విస్తృతంగా పంచిపెట్టేందుకు మనం ఉపదేశాలను పొందిన కూటం ద్వారానే అది ఉదాహరించబడింది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాల్లో కనిపిస్తున్నట్లే ఈ పనిపైని యెహోవా ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. (2 కొరింథీయులు 9:6, 7 పోల్చండి.) కూటాలకు క్రమంగా హాజరైనవారు ప్రచారకార్యక్రమానికి ఇవ్వబడిన మద్దతును ప్రేరేపించడానికి ప్రోత్సహించబడి, సహాయం చేయబడ్డారు.
6 సంఘ పుస్తక పఠనంలో, ప్రకటన ముగింపు అనే పుస్తకం సహాయంతో దేవుని వాక్యం నుండి మనం నేర్చుకున్న విషయాల్లో మన అత్యవసర భావాన్ని అధికం చేశాయి. ప్రపంచ తెరపై సంఘటనలు అతి వేగంగా కదులుతుండగా, మనం ప్రకటనలోని లోతైన ప్రవచనాల నెరవేర్పును అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
7 క్రమంగా కూటాలకు హాజరయ్యేందుకు ప్రాధాన్యతనివ్వండి: అనేక దేశాల్లోని మన సహోదరులు శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ, ప్రతివారం తాము కలుసుకోవడం తమకు ఎంత ప్రాముఖ్యమో గుర్తించారు. ఉదాహరణకు, బురుండి, రువాండా, లైబీరియా, బోస్నియా, మరియు హెర్జెగోవినా దేశాల్లోని కూటాలకు క్రొత్తవారు ఎంత ఎక్కువ మంది వస్తున్నారంటే, ప్రచారకుల సంఖ్యకన్నా హాజరు రెండు లేదా మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఒకే ఆత్మలో స్థిరులుగా ఉండేందుకు యెహోవా సహోదరులకు ఈ విధంగా తోడ్పడుతాడు.—ఫిలి. 1:27; హెబ్రీ. 10:23-25.
8 కూటాలకు క్రమంగా హాజరు కావడాన్ని నిర్లక్ష్యం చేసేవారెవరైనా ఉంటే, ఈ ధోరణిని సరిదిద్దుకునేందుకు చర్యలను ఇప్పుడు గైకొనాలి. (ప్రసం. 4:9-12) స్థిరులుగా నిలబడేందుకు, క్రమంగా కూటాలకు హాజరైనప్పుడు లభిస్తున్నట్లు, పరిపక్వత గలవారితో మనకు సహవాసం అవసరం.—రోమా. 1:11.