ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరి: క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ప్రతిపాదిత పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 8.00 చందాకు ప్రతిపాదించవచ్చు. మా దగ్గర లభ్యమౌతున్న ఈ కోవకు చెందిన పుస్తకాలు క్రింద ఇవ్వబడ్డాయి: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మానవుడు పరిణామం ద్వారా వచ్చాడా లేక సృష్టిద్వారా వచ్చాడా? కన్నడ: “దేవుడు అబద్ధమాడలేని విషయాలు” మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” గుజరాతీ: నిత్యజీవమునకు నడుపు సత్యము, నిన్ను సంతోషపరచు సువార్త, “నీ రాజ్యము వచ్చుగాక;” తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము; మరాఠీ: గొప్ప బోధకుని వినడం మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” హిందీ: నిన్ను సంతోషపరచు సువార్త మరియు “నీ రాజ్యము వచ్చుగాక.” నేపాలీ చదివేవారికి జీవితమును అనుభవించుము! అనే బ్రోషూర్‌ను, పంజాబీ లేదా బెంగాలీ తెలిసినవారికి మన సమస్యలు లేదా ఇదిగో! . . . సమస్తము అనే బ్రోషూర్‌లను అందించాలి. మలయాళానికి ప్రాధాన్యతనిచ్చేవారికి నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని రూ. 15.00కు ఇవ్వవచ్చు. ఈ పుస్తకం ప్రత్యేక వెలకు ఇవ్వవలసింది కాదని దయచేసి గమనించండి.
ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 (పెద్ద సైజు 40.00) చందాకు. ప్రత్యామ్నాయంగా, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం రూ. 15.00 చందాకు. ఈ పుస్తకపు తెలుగు ప్రతిని రూ. 8.00 ప్రత్యేక ధరకు ప్రతిపాదించ వచ్చునని దయచేసి గుర్తించండి.
మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం రూ. 15.00 చందాకు. ఇది సంఘంలో ఇంకా లభ్యం కానట్లైతే, అప్పుడు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు, రూ. 40.00) చందాకు ఇవ్వవచ్చు.
ఏప్రిల్ మరియు మే: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రిక సంచికకు ఒక సంవత్సర చందా రూ 70.00. మాసపత్రికకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికకు ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికకు ఆరునెలల చందా లేదు.
గమనిక: ఫిబ్రవరి నెలలో సూచించబడిన ప్రతిపాదనలో ఓ మార్పు ఉంది. సంఘాలన్నీ సరిపడినన్ని సరఫరాను పొందాలని, నిరంతరము జీవించగలరు మరియు కుటుంబ జీవితము పుస్తకాల్ని బాగా ఉపయోగించాలని మేము ప్రోత్సహిస్తున్నాం. సంవత్సరమంతా అన్నివేళల్లో ఈ పుస్తక ప్రతుల్ని ప్రచారకులు తమతో ఉంచుకొని, సముచితమైన ప్రతి సందర్భంలోనూ వాటిని ప్రతిపాదించగలరు. పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-AB-14) నందు రిక్వెస్ట్ చేయాలి.
◼ ఈ సంవత్సరం ఏప్రిల్ 2, గురువారమున సూర్యాస్తమయం తర్వాత జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు తగిన ఏర్పాట్లను సంఘాలు చేయాలి. ప్రతీ సంఘం జ్ఞాపకార్థ ఆచరణను దేనికదే జరుపుకోవడం కోరదగినదే అయినా, ఇది అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా అనేక సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగిస్తున్న చోట, బహుశా ఒకటి లేక అనేక సంఘాలు ఆ సాయంత్రం కొరకు ఉపయోగించడానికి మరో సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్న ప్రజలు హజరవ్వడానికి అసౌకర్యంగా ఉండేటట్టు జ్ఞాపకార్థ ఆచరణను మరీ ఆలస్యంగా ప్రారంభించకూడదు. అంతేగాకుండా, సందర్శకుల్ని పలకరించడానికి, కొంతమందికి ఆత్మీయ సహాయాన్ని ఇవ్వడాన్ని కొనసాగించడం కొరకు ఏర్పాట్లను చేయడానికి లేక పరస్పరం ప్రోత్సహించుకోవడానికి ఆచరణకు ముందు, తర్వాత సమయం లేకుండా సడలింపులేని పట్టికను వేయకూడదు. అన్ని కారకాంశాల్ని బాగా పరిశీలించిన మీదట జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేవారు ఆ ఆచరణ నుండి పూర్తిగా ప్రయోజనం పొందేందుకు ఏ ఏర్పాట్లు బాగా సహాయపడ్తాయో పెద్దలు నిర్ణయించాలి.
◼ 1996 సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలం కొరకైన ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఏప్రిల్ 21, ఆదివారం ఇవ్వబడ్తుంది. ప్రసంగాంశం “వక్ర జనాంగం మధ్య నిందారహితులుగా ఉండడం.” ప్రసంగ సంక్షిప్త ప్రతి ఇవ్వబడ్తుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ కాపరి సందర్శనం, ప్రాంతీయ సమావేశం లేక ప్రత్యేక దిన సమావేశం ఉన్న సంఘాల్లో ఆ తరువాతి వారంలో ఈ ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడ్తుంది. ఏప్రిల్ 21కి ముందు ఏ సంఘంలోనూ ఈ ప్రత్యేక ప్రసంగం ఇవ్వకూడదు.