కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/96 పేజీ 2
  • మార్చిలోని సేవాకూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చిలోని సేవాకూటాలు
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఉపశీర్షికలు
  • మార్చి 4తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 11తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 18తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 25తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1996
km 3/96 పేజీ 2

మార్చిలోని సేవాకూటాలు

మార్చి 4తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (22)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపికచేయబడిన ప్రకటనలు. మార్చి ఒకటి నుండి అమలులోకి వచ్చే పత్రికల, చందాల క్రొత్త ధరలను గూర్చి ప్రేక్షకులకు గుర్తు చేయండి.

15 నిమి: జ్ఞానము అనే క్రొత్త పుస్తకాన్ని ఉపయోగించడానికి సిద్ధపడండి. మన రాజ్య పరిచర్య ఈ సంచిక యొక్క మొదటి పేజీలోని పై శీర్షిక నుండి ప్రశ్నా జవాబుల చర్చ. పరిచర్యలో తాము ఆ పుస్తకాన్ని ప్రభావవంతంగా ఉపయోగించగల్గేలా దాని విషయసూచికను పూర్తిగా ఎరిగినవారై ఉండాలని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: “సత్య దేవుని గూర్చిన జ్ఞానం జీవానికి నడిపిస్తుంది.” సలహా ఇవ్వబడిన అందింపులను పునఃసమీక్షించండి. ఒకటి లేక రెండు ప్రదర్శనలు ఉండాలి.

పాట 78 (112) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 11తో ప్రారంభమయ్యే వారం

పాట 164 (73)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్ట్‌.

20 నిమి:“1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి—భాగం 3.” పాఠశాల అధ్యక్షుడిచ్చే ప్రసంగం. తమ పేర్లను నమోదు చేసుకొని, నమ్మకంగా తమ అసైన్‌మెంట్‌లను నెరవేర్చగలవారందరూ అలా చేయాలని ప్రోత్సహించండి. “ప్రతి లేఖనము” (ఆంగ్లం) అనే పుస్తకం 325-6 పేజీలు, పేరాలు 27-8లో కనుగొనబడినట్లుగా బైబిలు పేర్లను ఉచ్చరించే నియమాలను స్పష్టంగా వివరించండి. అలాగే ఆంగ్లంలో “ch” (సిహెచ్‌) అనే అక్షరాల కలిసి పేర్లలో వచ్చినప్పుడు (Rachelలో మాత్రం మెల్లగా పలకబడుతుంది) “k” (కె) లా గట్టిగా ఉచ్చరించబడుతుంది. ప్రేక్షకులు తమ బైబిళ్ళను చూస్తుండగా సొసైటీ ఆడియోకేసెట్ల నుండి లూకా 3:23-38 వరకున్న భాగాన్ని ప్లే చేయడం ద్వారా నియమాలను వివరించండి.

15 నిమి: కుటుంబమంతా కలిసి పనులను చేయండి. సెప్టెంబరు 1, 1993, కావలికోట, 16-19 పేజీల ఆధారంగా, తండ్రి తన కుటుంబంతో అనియతంగా మాట్లాడతాడు. కుటుంబ పఠనం మరియు సువార్త పని మీద శ్రద్ధను కేంద్రీకరించండి. ఆధునిక కుటుంబాలు కలిసి సమయాన్ని గడపకపోవడం వల్ల, ఆచరణాత్మకమైన ఒకే విషయాల్లో ఆసక్తి లేనందువల్ల విడిపోతున్నాయి. కలిసి దేవుని వాక్యాన్ని పఠించడం, పరిచర్యలో పాల్గొనడం క్రైస్తవ కుటుంబానికి ఓ ఆశీర్వాదం. ఈ విషయాలను తండ్రి సరిగ్గా సంస్థీకరించవలసిన అవసరతను తల్లి సహకరించవలసిన అవసరతను నొక్కి చెప్పండి. పిల్లలు తలిదండ్రులతో కలిసి సన్నిహితంగా పనిచేస్తూ ఆత్మీయ కార్యక్రమాల్లో శ్రద్ధతీసుకోవాలి. కుటుంబం ఐక్యతగలదౌతుంది, లౌకిక విషయాలవైపుకు పెరుగుతున్న ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి బలపరచబడుతుంది.

పాట 211 (66) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 18తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (4)

10 నిమి: స్థానిక ప్రకటనలు. తమ బైబిలు పఠనాల్లో అభివృద్దిని సాధిస్తున్న క్రొత్తవారు బాప్తిస్మం పొందని ప్రచారకులవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడానికి పఠనాలను నిర్వహించేవారు ప్రోత్సహించాలి. తమ పిల్లలు ప్రచారకులు కావడానికి తలిదండ్రులు కూడా సహాయపడగలరు. మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం 97-100 పేజీల్లో సిఫారసు చేయబడిన పద్ధతిని పునఃసమీక్షించండి. సంఘంలోని బాప్తిస్మం పొందిన ప్రచారకులనందరినీ ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీరింగ్‌ చేయమని ప్రోత్సహించండి.

15 నిమి: యెహోవాసాక్షుల 1996 వార్షిక పుస్తకం (ఆంగ్లం)లోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించండి. 3-5 నుండి 33 వరకున్న పేజీల్లో ఇవ్వబడిన మన ప్రపంచవ్యాప్త కార్యక్రమాన్ని గూర్చిన కొన్ని ఆసక్తికరమైన విశేషతలను ఒక కుటుంబంలోనివారు చర్చిస్తారు. ప్రతిరోజూ ప్రతిదినము లేఖనములను పరిశీలించుటలో ఇవ్వబడిన బైబిలు లేఖనాన్ని పరిశీలించిన తర్వాత వార్షిక పుస్తకంలోని కొన్ని పేజీలను కలిసి చదవడానికి ప్రయత్నిద్దామని వారు ఒప్పుకుంటారు.

20 నిమి: “నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించేందుకు ఇతరులకు సహాయపడండి.” పునర్దర్శనాల్లో ఉపయోగించడానికి ఇవ్వబడిన అందింపులను పునఃసమీక్షించండి. ఒకటి లేక రెండు ప్రదర్శనలను చేర్చండి. పఠనాలను ఆరంభించే లక్ష్యాన్ని నొక్కి చెప్పండి.

పాట 130 (58) మరియు ముగింపు ప్రార్థన.

మార్చి 25తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (28)

15 నిమి: స్థానిక ప్రకటనలు. “జ్ఞాపకార్థ దిన జ్ఞాపికలు”ను పునఃసమీక్షించండి. హాజరవ్వడమెందుకు ప్రాముఖ్యమో వివరించండి. (ఫిబ్రవరి 15, 1985, కావలికోట (ఆంగ్లం) 18-20 పేజీలు చూడండి.) హాజరవ్వడానికి వృద్ధులకు, బలహీనులకు, క్రొత్తవారికి సహాయపడే ప్రణాళికలను పునఃసమీక్షించుకోండి. రానున్న ఈ వారంలో ప్రాంతీయ సేవను విస్తృతం చేసే ఏర్పాట్లను చర్చించండి. అలాగే, సెప్టెంబరు 22, 1995 తేజరిల్లు! (ఆంగ్లం) 32వ పేజీలోని “అపరిచితులకు ఆతిథ్యం చూపించబడేచోట” అనే శీర్షికను కూడా పునఃసమీక్షించండి.

15 నిమి: “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం.” ప్రేక్షకులతో చర్చించండి. తరువాతి సమావేశం తేదీ తెలిసినట్లయితే ప్రకటించండి. అందరూ హాజరు కావాలని, క్రొత్తవారు బాప్తిస్మం పొందే యోగ్యతను పొందేందుకు కృషి చేయాలని ప్రోత్సహించండి.

15 నిమి:“సిద్ధపాటు–సాఫల్యానికి కీలకం.” ప్రశ్నా జవాబులు. మనం ఏప్రిల్‌, మే నెలల్లో కావలికోట, తేజరిల్లు!లకు చందాలను ప్రతిపాదిస్తామని పేర్కొనండి. అదనపు ప్రతుల కోసం ఆర్డర్లు చేయడం ద్వారా, చందా ఫారాలను పొందడం ద్వారా, పత్రికా దిన కార్యక్రమం కోసం సంఘ ఏర్పాట్లకు మద్దతునివ్వడానికి పథకాలను వేయడం ద్వారా ఇప్పుడే సిద్ధపాట్లను చేసుకోండి.

పాట 7 (105) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి