మాటలోను ప్రవర్తనలోను మాదిరిగా ఉండండి
1 మాటలోను ప్రవర్తనలోను మాదిరిగా అవ్వాలని తిమోతికి అపొస్తలుడైన పౌలు బోధించాడు. (1 తిమో. 4:12) మనం కూడా మాదిరికరమైన మాటలను ప్రవర్తనను కనబరచాలి, మరి ముఖ్యంగా పరిచర్యలో నిమగ్నమై ఉన్నప్పుడు అలా ఉండాలి, అలా చేయడం మనం కలిసేవారి హృదయాలను మనం చేరుకుంటామా లేదా అని నిర్ణయించవచ్చు.
2 మర్యాద, పరిగణన, దయ, నమ్రత, ఔచిత్యం వంటి సభ్యతలోని అన్ని అంశాలను మనం కనబరచవలసిన అవసరం ఉంది. ఈ గుణాలను ప్రతిబింబించడం ద్వారా, ఇతరుల భావాలను మన చర్యలు ఎలా ప్రభావితం చేస్తాయి అని మనం ఎరిగియున్నామని మనం చూపిస్తాము. ఆహారపు రుచిని పెంచేందుకు ఉపయోగించబడే మసాలాతో పరిచర్యలో చూపే సభ్యతను పోల్చవచ్చు. అది లేకపోతే పోషకాహారం అరుచికరంగాను, ఆకలిని చంపే విధంగాను ఉంటుంది. ఇతరులతో మన వ్యవహారాల్లో సభ్యతను చూపించకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది.—కొలొ. 4:6.
3 మాటలో మాదిరిగా ఉండండి: స్నేహపూర్వకమైన మందహాసం, ఆప్యాయతతో కూడిన పలకరింపు అనేవి మనం సువార్తను అందించడంలోని ముఖ్య కారకాలు. మనం మన ఉపోద్ఘాతాన్ని ఆప్యాయత మరియు యథార్థతలతో జతచేర్చినప్పుడు మనం గృహస్థుని ఎడల నిజంగా శ్రద్ధగలవారమని మనమాయనకు తెలియచేసినవారమౌతాము. ఆయన మాట్లాడేటప్పుడు, జాగ్రత్తగా ఆలకించి, ఆయన అభిప్రాయానికి అర్హమైన గౌరవాన్ని చూపించండి. మీరు మాట్లాడేటప్పుడు ఔచిత్యంతోను దయాపూర్వకంగాను మాట్లాడండి.—అపొ. 6:8 పోల్చండి.
4 స్నేహపూర్వకంగా ఉండని, పోట్లాడే వ్యక్తులను మనం అప్పుడప్పుడు కలుస్తుంటాము. మనమెలా ప్రతిస్పందించాలి? ‘సాత్వికమును ప్రగాఢమైన గౌరవమును’ కనబరచే విధంగా మాట్లాడాలని పేతురు మనకు బోధించాడు. (1 పేతు. 3:15; రోమా. 12:17, 18) రాజ్య వర్తమానాన్ని ఒక గృహస్థుడు ధిక్కారంగా ఎదిరించినట్లైతే మనం కేవలం ‘పాదధూళి దులిపివేయాలి’ అని యేసు చెప్పాడు. (మత్త. 10:14) అలాంటి పరిస్థితుల్లో మాదిరికరమైన ప్రవర్తనను మనం కనబరచడం చివరికి వ్యతిరేకిస్తున్న వ్యక్తి హృదయాన్ని మృదులపరచవచ్చు.
5 ప్రవర్తనలో మాదిరిగా ఉండండి: రద్దీగా ఉన్న వీధుల్లోను బహిరంగ స్థలాల్లోను ప్రకటించేందుకు మనం పరిగణన కలవారమై ఉండాలి, మనం బిగ్గరగా మాట్లాడకూడదు, లేక బలవంతపెట్టకూడదు, పాదచారుల రాకపోకలకు అలా విఘ్నం కలుగకుండా ఉండాలి. ఆసక్తిగల వ్యక్తుల ఇండ్లలో ఉన్నప్పుడు మనం సముచితమైన మర్యాదతో ఉంటూ దయగల అతిథులుగా ప్రవర్తిస్తూ, వారి ఆతిథ్యానికి మెప్పు చూపించి తీరాలి. మనతోపాటు వచ్చే పిల్లలెవరైనా గృహస్థుని ఎడల, ఆయన వస్తువుల ఎడల గౌరవం చూపించాలి, మర్యాదగలవారై ఉండాలి, మరియు మనం సంభాషించేటప్పుడు అవధానమిచ్చేవారై ఉండాలి. పిల్లలు అదుపులేని వారైతే అది ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది.—సామె. 29:15.
6 మనం దేవుని వాక్య పరిచారకులమని మన వ్యక్తిగత ముస్తాబు ఇతరులకు స్పష్టం చేయాలి. మన వస్త్రధారణలోను, కేశాలంకరణలోను మనం శ్రద్ధలేనివారిగాను, నిర్లక్ష్యంగాను లేదా మరీ అమిత ఆకర్షణీయంగాను లేదా మరీ వింతగాను ఉండకూడదు. మనమెల్లప్పుడూ సువార్తకు తగినట్లుగా కనిపించాలి. (ఫిలిప్పీయులు 1:27 పోల్చండి.) మనమెలా కనిపిస్తామనేదానికి, మన ఉపకరణాలకూ జాగ్రత్తగా అవధానమివ్వడం ద్వారా మనం ఇతరులు అభ్యంతరపడడానికి లేదా మన పరిచర్యలో తప్పు పట్టడానికి కారణాన్నివ్వము. (2 కొరిం. 6:3, 4) మన మాదిరికరమైన మాటలు మరియు ప్రవర్తన రాజ్యవర్తమానానికి ఆకర్షణీయమైన గుణాన్ని చేకూర్చి, యెహోవాకు ఘనతను తెస్తాయి.—1 పేతు. 2:12.