రాజ్యాన్ని గూర్చి ప్రకటించండి
1 హెబ్రీయులు 10:23లో ‘మన నిరీక్షణ విషయమై మనం బహిరంగంగా ప్రకటించినదానిని నిశ్చలంగా పట్టుకోవాలి’ అని మనం ప్రేరేపించబడుతున్నాం. మరి మన నిరీక్షణ అనేది దేవుని రాజ్యంపై కేంద్రీకరించబడి ఉంది. సకల జనములకూ రాజ్యసువార్త ప్రకటించబడాలని యేసు ప్రత్యేకంగా ఆజ్ఞాపించాడు. (మార్కు 13:10) మనం మన పరిచర్యలో నిమగ్నమై ఉన్నప్పుడు మనం దీనిని మనస్సులో ఉంచుకోవాలి.
2 మనం ప్రజలను కలిసినప్పుడు, మనం వారికి ఆసక్తిగల లేక వారికి సంబంధించిన దానిని గూర్చి సంభాషించనారంభించాలని ప్రయత్నిస్తాము. ఇరుగు పొరుగున జరిగే నేరాలు, యౌవనస్థుల సమస్యలు, జీవనోపాధిని కల్పించుకోవడాన్ని గూర్చిన చింత లేదా ప్రపంచ కార్యాల్లోని క్లిష్టపరిస్థితి వంటి వారికి తెలిసిన విషయాలను మనం సాధారణంగా పేర్కొంటాం. చాలా మంది ప్రజల మనస్సులు ఈ “ఐహిక విచారముల”పై కేంద్రీకరించబడి ఉంటాయి గనుక, మనం శ్రద్ధగలవారమని, అర్థం చేసుకునేవారమని మనం చూపించినప్పుడు, ప్రజలు తరచూ తమ మనస్సులో ఉన్నదేమిటో వ్యక్తం చేస్తారు. (లూకా 21:34) మన నిరీక్షణను పంచుకునే మార్గాన్ని ఇది మన కొరకు తెరవవచ్చు.
3 అయితే, మనం జాగ్రత్తగా లేనట్లైతే, రాజ్య వర్తమానాన్ని బోధించాలన్న మన సందర్శన ఉద్దేశాన్ని నెరవేర్చుకోలేని విధంగా మన సంభాషణ ప్రతికూల విషయాలపై కొనసాగగలదు. మరింత విపత్తును తీసుకువచ్చే చెడు పరిస్థితుల వైపుకు అవధానాన్ని మనం మళ్ళించినప్పటికీ, మానవజాతి సమస్యలనన్నింటినీ చివరకు పరిష్కరించగల రాజ్యం వైపుకు శ్రద్ధ మళ్ళించాలన్నదే మన లక్ష్యం. ప్రజలు వినవలసిన ఎంతో అవసరమున్న, నిజంగా ఎంతో అద్భుతమైన నిరీక్షణే మనకుంది. “వ్యవహరించడానికి కష్టంగావున్న ఈ సమయాల” కొన్ని అంశాలను మనం మొదట్లో చర్చించినప్పటికీ మనం మన ప్రముఖ వర్తమానమైన “నిత్యసువార్త” పై వెంటనే శ్రద్ధ కేంద్రీకరించాలి. ఈ విధంగా మనం మన పరిచర్యను పూర్తిగా నెరవేరుస్తాము.—2 తిమో. 3:1, NW; 4:5; ప్రక. 14:6.