కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/96 పేజీలు 2-7
  • ప్రకటనలు, సాహిత్య ప్రతిపాదనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు, సాహిత్య ప్రతిపాదనలు
  • మన రాజ్య పరిచర్య—1996
మన రాజ్య పరిచర్య—1996
km 12/96 పేజీలు 2-7

ప్రకటనలు, సాహిత్య ప్రతిపాదనలు

◼ డిశంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ఇవ్వండి. ప్రత్యామ్నాయంగా, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ. 45.00 చందాకు ప్రతిపాదించవచ్చు. జనవరి: 192 పేజీల పాత పుస్తకాల ప్రత్యేక ప్రతిపాదన ఒక్కొక్కటి రూ. 10.00 చందాకు ఇవ్వండి. ఈ కోవకు చెందిన ఈ క్రింది పుస్తకాలు ఇప్పటికీ మా దగ్గర లభ్యమౌతున్నాయి: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, మానవుడు పరిణామం ద్వారా వచ్చాడా లేక సృష్టి ద్వారా వచ్చాడా?; కన్నడ: “దేవుడు అబద్ధమాడలేని విషయాలు,” “నీ రాజ్యము వచ్చుగాక;” గుజరాతీ: నిత్యజీవమునకు నడుపు సత్యము, నిన్ను సంతోషపరచు సువార్త, “నీ రాజ్యము వచ్చుగాక;” తమిళం మరియు హిందీ: “నీ రాజ్యము వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?; మరాఠీ: గొప్ప బోధకుని వినడం, “నీ రాజ్యము వచ్చుగాక.” ఎక్కువగా బెంగాలీ లేదా నేపాలీ చదవాలని ఇష్టపడేవారికి 32 పేజీల బ్రోషూర్‌లలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. పంజాబీ ఎక్కువగా ఇష్టపడేవారికి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని, మలయాళం ఇష్టపడేవారికి నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. చివరి ఈ రెండు పుస్తకాలు ప్రత్యేక వెలకు ఇవ్వవలసినవి కావని దయచేసి గమనించండి. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) లేదా నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము రూ. 20.00 చందాకు. పంజాబీ చదవడానికి ఇష్టపడేవారికి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా, 192 పేజీల ప్రత్యేక ప్రతిపాదనా పాత పుస్తకాలలో దేనినైనా రూ. 10.00 చందాకు ప్రతిపాదించవచ్చు.

గమనిక: కుటుంబము మరియు నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలను ఉపయోగిస్తూ ఉండాలని మేము సంఘాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నాము. ప్రతి అనువైన సందర్భంలోనూ వాటిని అందించేందుకుగాను ప్రచారకులు సంవత్సరం పొడుగునా వాటిని తమవద్ద ఉంచుకోమని వారిని ప్రోత్సహించవచ్చు. పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటికొరకైనా ఇంకా రిక్వెస్టు చేయని సంఘాలు, ఈసారి తమ లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లలో (S-AB-14) రిక్వెస్ట్‌ చేయవచ్చు.

◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వేరొకరు సంఘ లెక్కలను డిశంబరు 1న లేక సాధ్యమైనంత త్వరగా ఆడిట్‌ చేయాలి. ఇది జరిగిన తరువాత సంఘానికి తెలపండి.

◼ 1997వ సంవత్సరం జ్ఞాపకార్థదినం మార్చి 23, ఆదివారం నాడు సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. హాలు బుక్‌ చేసుకోవల్సిన అవసరమున్న చోట సహోదరులు ఏర్పాట్లు చేసేందుకు ఈ జ్ఞాపిక ఇవ్వడం జరుగుతోంది.

◼ జనవరితో ప్రారంభిస్తూ ప్రాంతీయ పైవిచారణకర్తలు “మన దేవుడైన యెహోవాకు సాటియైనవారెవరు?” అన్న బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు. గురువారం (లేక శుక్రవారం) నాటి వారి మొదటి సేవా ప్రసంగాంశం: “సువార్త ప్రకటించడంలో పూర్తిగా నిమగ్నమై ఉండండి” మరియు అదే రోజు సంఘమంతా కలిసి జరుపుకునే పుస్తక పఠనం తర్వాత ఇచ్చే రెండవ సేవా ప్రసంగం: “సన్మార్గం, దుర్మార్గం—మీరు దేన్ని వెంబడిస్తారు?” ఈ ప్రసంగాలు రెండూ 25 నిమిషాల పాటు ఉంటాయి, దానితో గురువారం (లేక శుక్రవారం) కూటాలు మొత్తం ఒక గంట 50 నిమిషాలపాటు ఉంటుంది. ‘మీరు నేర్చుకున్న విషయాల్లో కొనసాగుట’ అనే చర్చ ఇక ఉండదు.

◼ 1997 వార్షిక వచనం: “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.”—కీర్తన 143:10. సంఘాలు తమ వార్షిక వచనమున్న బోర్డును సిద్ధం చేసి పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే వారు దాన్ని 1997 జనవరి 1న లేక ఆ తర్వాత వీలున్నంత త్వరగా పెట్టేందుకు వీలుంటుంది.

◼ కలకత్తాలో జరగబోయే జిల్లా సమావేశం 1997 జనవరి 3-5 తేదీలకు మార్చబడింది.

◼1997లో సంఘాలు సేవా ఫారమ్‌లను ఉపయోగించేందుకు ప్రతి సంఘానికీ సరిపడ పంపించడం జరిగింది. సంఘ సెక్రటరీ ఎవరెవరికి ఏయే ఫారమ్‌లను పంచిపెట్టాలి అన్న విషయంలో సహాయపడేందుకుగాను ఆ ఫారమ్‌లతో ఓ చెక్‌లిస్ట్‌ కూడా జతచేయడం జరిగింది. ఈ ఫారమ్‌లు వేటికొరకైతే ఉన్నాయో వాటికి కొరకే ఉపయోగించాలి కానీ వాటిని వృథాచేయకూడదు. సంవత్సరం పొడుగునా మీ సంఘానికి ఈ ఫారమ్‌లు సరిపోతాయో లేదో దయచేసి చూడండి. ఇంకా ఫారమ్‌లు కావల్సివస్తే, వెంటనే ఆర్డరు చేయాలి. దయచేసి, 1997 డిశంబరు వరకు సరిపడా మాత్రమే ఆర్డరు చేయండి.

ఈ ఫారమ్‌లతో, వాచ్‌టవర్‌ ప్రచురణల లిస్ట్‌ యొక్క నాలుగు ప్రతులున్నాయి. ఒకటి సెక్రటరీ వద్ద ఉండాలి. మరి మిగిలినవి సాహిత్యాలు, పత్రికలు, అక్కౌంట్స్‌ చూసుకునే సహోదరులకు ఇవ్వాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి