జ్ఞాపకార్థదినం—అతి ప్రాముఖ్యమైన ఓ సంఘటన!
1 మార్చి 23 ఆదివారం సూర్యాస్తమయం తర్వాత క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినాన్ని మనం జరుపుకుంటాము. (లూకా 22:19) ఇది నిజంగానే అతి ప్రాముఖ్యమైన సంఘటనే! మరణం వరకూ యెహోవా ఎడలగల తన యథార్థతను కాపాడుకోవడంద్వారా తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మానవులు పరిపూర్ణమైన దైవిక భక్తిని కల్గివుండడం సాధ్యమేనని యేసు నిరూపించాడు. ఆ విధంగా ఆయన యెహోవా సర్వాధిపత్య హక్కును ఉన్నతపర్చాడు. (హెబ్రీ. 5:8) అంతేకాకుండా, మానవులను విమోచించేందుకు అవసరమైన పరిపూర్ణ మానవ బలిని క్రీస్తు మరణం అందించింది. అది, విశ్వసించే వారు నిరంతర జీవితాన్ని పొందేలా సాధ్యం చేస్తోంది. (యోహా. 3:16) జ్ఞాపకార్థదినానికి హాజరు కావడం ద్వారా, యెహోవా మనకు కనపర్చిన ప్రేమ ఎడల అలాగే యేసు ఇచ్చిన బలి ఎడలగల మన మెప్పును మనం ప్రదర్శించవచ్చు.
2 1997 యెహోవాసాక్షుల క్యాలెండరులో సూచించినట్లుగా మార్చి 18-23 తేదీల్లో షెడ్యూల్ వేయబడిన బైబిలు పఠన కార్యక్రమాన్ని పాటించమని అందరూ ప్రోత్సహించబడుతున్నారు. అంతేకాక, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకంలోని 112-16 అధ్యాయాలను కుటుంబమంతా కలిసి చర్చించడం, మానవ చరిత్రలోనే అతి ప్రాముఖ్యమైన వారంపై మన శ్రద్ధనుంచేందుకు సహాయపడుతోంది.
3 ఈ జ్ఞాపకార్థదిన కాలంలో ప్రాంతీయ పరిచర్యలో మీరు గడిపే సమయాన్ని అధికంచేయగలరా? మార్చి నెలలో అయిదు వారాంతాలుంటాయి కనుక సహాయ పయినీరు సేవను చేసేందుకు అనేకమంది ప్రచారకులు దాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. అలాంటివారిలో మనం కూడా ఒకరం ఎందుకు కాకూడదు? జ్ఞాపకార్థదినానికి హాజరవ్వాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంలో మనమందరమూ భాగం వహించవచ్చు. అది ఆదివారం నాడు కనుక దానికి హాజరవ్వడం అనేకులకు సులభంగా ఉంటుంది. బైబిలు విద్యార్థులను ఆసక్తిగలవారినీ మనతో కూడా హాజరవ్వమని తప్పక ఆహ్వానించండి. సంవత్సరంలో ప్రత్యేకంగా ఆచరించాల్సిన ఒక రోజును గూర్చి జ్ఞానము పుస్తకంలోని 127వ పేజీనందు 18వ పేరా ప్రస్తావించినదాన్ని వారికి చెప్పండి.
4 1997లో జరిగే ఈ ప్రాముఖ్యమైన సంఘటన గూర్చి తలపోసుకుంటూ యేసు మరణం మన ఎడల కల్గివున్న భావాన్ని బట్టి ప్రగాఢమైన మెప్పును కల్గివుండండి. అన్ని ప్రాంతాల్లోని నమ్మకమైన క్రైస్తవులు జ్ఞాపకార్థదినాన్ని జరుపుకునే మార్చి 23 సాయంత్రం నాడు మీరు హాజరవ్వండి.