ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరు: కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకానికి రూ. 20.00 చందా. అక్టోబరు: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, విడి పత్రికలను ఒక్కొక్కదాన్ని రూ. 4.00కు ప్రతిపాదించాలి. చందాలను కట్టించేటప్పుడు, పంజాబీ మరియు ఉర్దూ (ఈ భాషల్లో మాసపత్రిక) తప్ప మిగిలిన అన్ని భారతీయ భాషల్లోను నేపాలి భాషలోను కావలికోట పక్షపత్రికయని దయచేసి గుర్తుంచుకోండి. తేజరిల్లు! ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో పక్షపత్రిక, అయితే కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలి, మరాఠీ మరియు హిందీ భాషల్లో మాసపత్రిక. తేజరిల్లు! యొక్క త్రైమాస పంపిణీ పత్రికలు పంజాబీ మరియు ఉర్దూ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి కానీ ఈ రెండు భాషల్లోను వ్యక్తిగత చందాలు అందుబాటులో లేవు. నెలలోని తరువాతి భాగం మొదలుకొని రాజ్య సువార్త నెం. 35 పంచిపెట్టబడుతుంది. నవంబరు: రాజ్య సువార్త నెం. 35 పంచిపెట్టబడటం కొనసాగుతుంటుంది. తమ సంఘ నియమిత ప్రాంతంలో ఉన్నప్రతి గృహంలోని లేక నివాసిత స్థలంలోని గృహస్థులకు రాజ్య సువార్త నెం. 35 అందించడం ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తి చేసిన సంఘాలు జ్ఞానం పుస్తకాన్ని రూ. 20.00కి ప్రతిపాదించవచ్చు. డిసెంబరు: ఈ క్రింది పుస్తకాల్లో దేన్నైనా ఒక్కొక్కటీ రూ. 45.00కు అందజేయాలి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవిచగలరు (చిన్న సైజు రూ. 25.00), నా బైబిలు కథల పుస్తకం (చిన్న సైజు రూ. 30.00) లేదా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా, జూలై కొరకైన మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ధరకని చెప్పబడిన ఏ పుస్తకాన్నైనా రూ. 2.50కు ప్రతిపాదించవచ్చు.
గమనిక: పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాలలో వేటినైనా ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారంపై (S-AB-14) రిక్వెస్ట్ చేయాలి.
◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వేరొకరు సంఘ లెక్కలను సెప్టెంబరు 1న లేక సాధ్యమైనంత త్వరగా ఆడిట్ చేయాలి. ఇది జరిగిన తరువాత సంఘానికి తెలపండి.
◼ బహిష్కరింపబడిన లేక సహవాసం మానుకొని తిరిగి చేర్చుకొనబడటానికి ఇష్టతచూపేవారికి సంబంధించి ఏప్రిల్ 15, 1991 కావలికోట (ఆంగ్లం) 21-3 పేజీల్లో ఇవ్వబడిన సలహాలను అనుసరించాలని పెద్దలు గుర్తుచేయబడుచున్నారు.
◼ ప్రచారకులందరు ఆగస్టు నెల ప్రాంతీయ సేవా రిపోర్టులను ఆగస్టు 31 ఆదివారంకల్లా ఇవ్వమని ప్రోత్సహించండి. సకాలంలో మేము వార్షిక రిపోర్టును సంకలనం చేసుకొనేందుకు వీలుగా కనీసం సెప్టెంబరు 3 బుధవారం నాటికి సంఘ రిపోర్టును (S-1) సిద్ధం చేసి, పోస్టు చేయ్యాలని సంఘ సెక్రటరీలు కోరబడుతున్నారు.
◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ స్వీకరించదు. సాహిత్యాల కొరకు సంఘంచేసే నెలసరి రిక్వెస్ట్‌లను సొసైటీకి పంపించడానికి ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావాల్సిన సాహిత్యాల్ని రప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల్ని పర్యవేక్షిస్తున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్ రిక్వెస్ట్ సాహిత్యాలో దయచేసి గుర్తుంచుకోండి.
◼ సాహిత్యమును రిక్వెస్ట్ చేసేటప్పుడు, సంస్థ యొక్క CD-ROM అనేది ప్రచారకుల ఉపయోగానికి మాత్రమే అని దృష్టిలో ఉంచుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న కొంత సమాచారము బయటి ప్రజల కొరకు కాదు.
◼ మే 1997 మన రాజ్య పరిచర్య “ప్రశ్నా భాగము” పరిచర్యలో వ్యతిరేక లింగవ్యక్తులతో కలిసి పనిచేయడం గురించి మనం జాగ్రత్త కలిగి వుండాలని సిఫారసు చేసింది. అందరూ ఈ విషయంలో సరైన వివేచనను ఉపయోగించడానికి మంచి కారణాలున్నాయి. ప్రయాణకాపరులు లేక ఇతర సహోదరులు ప్రాంతీయ సేవలో సహోదరీలతో కలిసి పని చేయకూడదని దీని అర్థం కాదు. బదులుగా, తమ బంధువుకాని ఒకే వ్యక్తితో వ్యతిరేక లింగవ్యక్తుల్లో ఎవరితోనైనా క్రమంగా కలిసి ఒంటరిగా సమయం గడపడం మనకు జ్ఞానయుక్తం కాదు అనే ఉద్దేశం వ్యక్తపరచబడింది.
◼ మే 22న, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పట్టణంలో శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు, అక్కడున్న సంఘంలోని 19 ప్రచారకులలో ఏ ఒక్కరు గాయపడలేదని తెలుసుకొని మీరు సంతోషిస్తారు. సంఘ పైవిచారణకర్త ఇంటి పక్కన ఉన్న భవనమంతా కూలిపోయినా ఆయన ఇంటి గోడపై పగులు ఏర్పడి మెట్లు మాత్రమే పాడయ్యాయి, కాని ఎవ్వరూ గాయపడలేదు. ఒక పెద్ద చర్చి రెండుగా మధ్యకు విడిపోవడంతో పాటు వివిధ మతసంబంధమైన భవనాలు పాడైపోయాయి, అయితే సాక్షులు కూటాలు జరుపుకొనే స్థలానికి మాత్రం ఏమీ కాలేదు. మన ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోని సభ్యులను మీరు బహుశా ఎప్పుడూ కలుసుకొని ఉండకపోయినప్పటికినీ ఈ విషయంలో వారిని గురించి మీరు వాకబు చేసినందుకు మెచ్చుకుంటున్నాము. ఎందుకంటే మీరు అలా చేయడం వారి ఎడల మీకున్న సహోదర ప్రేమను మరియు శ్రద్ధను ప్రతిబింబిస్తుంది.
◼ పనాజి, గోవాలో జరిగే జిల్లా సమావేశం 1997, నవంబరు 21-23కు తిరిగి పట్టిక వేయబడింది.
◼ ఈ సంవత్సరం కేరళలో మూడు సమావేశాలు జరుగుతాయి, కనుక ఒక్కోదానికి కేటాయించబడిన సర్క్యూట్లు ఈ క్రింద చూపబడ్డాయి:
కట్టప్పన (డిసెం. 12-14): హైరేంజెస్‌లో ఉన్న KE-5 సర్క్యూట్‌లోని అన్ని సంఘాలు మరియు KE-7 సర్క్యూట్‌లోని సంఘాలు.
ఎర్ణాకుళం (డిసెం. 26-28): KE-3, KE-4, KE-6 మరియు KE-8 సర్క్యూట్లలోని అన్ని సంఘాలూ అలాగే హైరేంజెస్‌లో లేని KE-7 సర్క్యూట్‌లోని సంఘాలు.
కోయిక్కోడ్ (జన. 2-4, 1998): KE-1 మరియు KE-2 సర్క్యూట్ల్‌లోని అన్ని సంఘాలు.
◼ లభ్యమౌతున్న క్రొత్త ప్రచురణలు:
నా బైబిలు కథల పుస్తకము (చిన్న సైజు)—తెలుగు
◼ స్టాకులో లేని ప్రచురణలు:
నిజమైన శాంతిభద్రతలు—ఏ మూలం నుండి?—తమిళం
మానవుడు పరిణామం ద్వారా వచ్చాడా లేక సృష్టి ద్వారా వచ్చాడా?—ఆంగ్లం