ప్రకటనా పని మనలను వ్యత్యాసంగా ఉంచుతుంది
1 “ఇతర మతాల నుండి యెహోవాసాక్షులను ఏది వ్యత్యాసంగా ఉంచుతుంది?” అని చాలామంది అడుగుతారు. మీరేమని సమాధానమిస్తారు? మన బైబిలు ఆధారిత నమ్మకాలలో కొన్నింటిని మీరు వివరించవచ్చు. ఇతర మతాల నుండి మనలను వ్యత్యాసంగా ఉంచే బహిరంగ పరిచర్య గురించి నొక్కి తెల్పే విషయమై మీరెప్పుడైనా ఆలోచించారా?—మత్త. 24:14; 28:19, 20.
2 నేడు, తమ నమ్మకాలను ఇతరులతో పంచుకొనేందుకు ప్రేరేపించబడే మత విశ్వాసంగల ప్రజలు చాలా తక్కువ. లోకనాయకుల చట్టాలను అనుసరిస్తే సరిపోతుందనీ, నైతికంగా మర్యాదకరమైన జీవితాలను అనుసరిస్తే సరిపోతుందనీ, ఇతరులకు మంచి చేస్తే చాలుననీ బహుశా వాళ్ళు అనుకుంటారు. అయితే, రక్షణ పొందడం గురించి బైబిలు ఏమి చెప్తుందనే దాని గురించి ఇతరులకు తెలియజేయడం తమ బాధ్యత కాదని వారు భావిస్తారు. మనం ఎలా వ్యత్యాసంగా ఉన్నాము?
3 మన ఉత్సాహపూరితమైన పరిచర్య ఇతర మతాల కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసంగా నిలబడుతుంది. తొలి క్రైస్తవులను అనుసరిస్తూ, 100 సంవత్సరాల కంటే ఎక్కువగా, ఆధునిక దిన సాక్షులు సువార్తను శ్రద్ధాపూర్వకంగా భూదిగంతాల వరకూ ప్రకటిస్తున్నారు. ప్రకటించడంలోని మన లక్ష్యం, తమ జీవితాలను యెహోవా చిత్తానికి అనుగుణ్యంగా మలచుకొనేలా సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయపడడమే.—1 తిమో. 2:4; 2 పేతు. 3:9.
4 మీకు ఎటువంటి పేరు ఉంది? దేవుని వాక్యాన్ని ఉత్సాహవంతంగా ప్రకటించే వారని మీకు మంచి పేరు ఉందా? (అపొ. 17:2, 3; 18:25) మీ ప్రకటనా పనిని బట్టి మీ పొరుగువారు మీ మతానికి వారి మతానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని వెంటనే గమనించగలరా? తన నిరీక్షణను ఇతరులతో ఉత్సాహంగా పంచుకునే వ్యక్తి అని మీ గురించి అనుకుంటారా? మీరు పరిచర్యలో క్రమంగా భాగం వహిస్తున్నారా? మన పేరును బట్టి మాత్రమే కాక, ఆ పేరు ఏ పనిని గురించి చెబుతుందో దాన్ని చేయటం ద్వారా కూడా—అంటే యెహోవాను గురించి సాక్ష్యమివ్వడం ద్వారా కూడా మనల్ని మనం వ్యత్యాసమైనవారిగా చేసుకుంటాము అని గుర్తుంచుకోండి.—యెష. 43:10.
5 దేవుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమ మనం ప్రకటనా పనిలో పాల్గొనేలా మనల్ని ప్రేరేపిస్తుంది. (మత్త. 22:37-39) అందుకే మనం, యేసు వలే, అపొస్తలుల వలే ఇతరులతో రాజ్య సందేశాన్ని పంచుకోవడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొందాం. ఆలకించేందుకు ఇష్టపడే వారికి సువార్తను ప్రకటించేందుకు ఉత్సాహవంతంగా కొనసాగుదుము గాక. అలా చేయడం, “దేవునికి సేవ చేసేవారికీ, చేయనివారికీ మధ్య వ్యత్యాసమేమిటో . . . గుర్తిం[చడానికి]” యథార్థహృదయులైన ప్రజలకు సహాయపడుతుంది.—మలా. 3:18, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.