దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
1999 సెప్టెంబరు 6 నుంచి డిసెంబరు 20 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. తన పరిపాలనా విధానం ఎల్లప్పుడూ సరైనదని నిరూపించుకునేందుకు యెహోవా, స్వతంత్ర మానవ పరిపాలనను అనుమతించాడు. (ద్వితీ. 32:4; యోబు 34:10-12; యిర్మీ. 10:23) [w97 2/15 5వ పేజీ, 3వ పేరా]
2. అన్ని విధాలైన ఫిర్యాదులనూ దేవుడు ఖండిస్తాడని బైబిలు సూచిస్తోంది. [w97 12/1 30వ పేజీ, 3-4 పేరాలు]
3. శిరస్సత్వాన్ని గూర్చిన దైవిక సూత్రాలనూ మంచి క్రమాన్నీ, గుర్తించడం ద్వారా తల్లిదండ్రులు వివాహితులైన తమ పిల్లలతో సంబంధాల్ని సరియైన స్థానంలో ఉంచుతారు. (ఆది. 2:24; 1 కొరిం. 11:3; 14:33, 40) [fy 164వ పేజీ, 6వ పేరా]
4. ప్రజల అనారోగ్యాన్నిబట్టి, పేదరికాన్నిబట్టి మాత్రమే యేసు కదిలించబడ్డాడని మార్కు 6:31-34 వచనాలు చూపుతున్నాయి. [w97 12/15 29వ పేజీ, 1వ పేరా]
5. వేరే గొఱ్ఱెల తరగతికి చెందిన ఒక క్రైస్తవుడు, యేసు మరణ జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరుకాలేకపోయినట్లైతే, సంఖ్యాకాండము 9:10, 11 వచనాల్లో ఉన్న సూత్రానికి అనుగుణంగా అతడు ఒక నెల తర్వాత దాన్ని ఆచరించాలి. (యోహా. 10:16) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E93 2/1 31వ పేజీ, 9వ పేరా.]
6. క్రైస్తవ తాతామామ్మలు, బైబిలు సత్యాల్ని తమ పిల్లల్లో నాటాల్సిన తల్లిదండ్రుల బాధ్యతను తాము తీసేసుకోరు గానీ, వాళ్లు ఒక బిడ్డ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దోహదపడటంలో ఒక పూరక పాత్రను నిర్వర్తించగలరు. (ద్వితీ. 6:7; 2 తిమో. 1:5; 3:14, 15) [fy 168వ పేజీ, 15వ పేరా]
7. దొంగతనాన్ని కొన్ని పరిస్థితుల్లో మన్నించవచ్చు లేక సమర్థించవచ్చు అని సామెతలు 6:30 చూపిస్తుంది. [g97 12/8 13వ పేజీ, 2వ పేరా]
8. 1530లో, హెబ్రీలేఖనాల ఆంగ్లానువాదంలో యెహోవా అనే దేవుని పేరును ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి విలియమ్ టిండేల్. [w97 9/15 28వ పేజీ, 3వ పేరా]
9. నేటి సూచనార్థక ఆశ్రయపురము, రక్త పవిత్రతను గూర్చి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినందుకు వచ్చే మరణం నుంచి మనల్ని కాపాడటానికి ఆయన చేసిన ఏర్పాటు. (సంఖ్యా. 35:11) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 11/15 17వ పేజీ, 8వ పేరా.]
10. “దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది” అని దుష్ట పరిసయ్యులతో యేసు పలికిన మాటలకు రాజ్యము ఆ దుర్మార్గుల దుష్ట హృదయాల్లో ఉందని భావం. (లూకా 17:21) [kl 91వ పేజీ, 6వ పేరా]
క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:
11. పెంతెకొస్తు పండుగ కాలంలో ప్రధాన యాజకుడు అర్పించే రెండు పులిసిన రొట్టెలు దేనికి చిత్రీకరణగా ఉన్నాయి? (లేవీ. 23:15-17) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w98 3/1 13వ పేజీ, 21వ పేరా.]
12. క్రైస్తవ సునాదకాలం ఎప్పుడు ఆరంభమైంది, ఆ కాలంలో అది ఎటువంటి స్వాతంత్ర్యాన్ని తెచ్చింది? (లేవీ. 25:10) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 5/15 24వ పేజీ, 14వ పేరా.]
13. దుష్టత్వాన్ని, బాధను యెహోవా అనుమతించడం మూలంగా ఏ మూడు విషయాలు రుజువుపర్చబడ్డాయి? [kl 77, 78 పేజీలు, 18-20 పేరాలు]
14. తాను అసూయాపరుడ్నికానని చూపించడంలో మోషే ఏ విధంగా ఒక చక్కని మాదిరియై ఉన్నాడు? (సంఖ్యా. 11:29) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 9/15 18వ పేజీ, 11వ పేరా.]
15. చూడటం అన్నివేళలా నమ్మడానికి నడిపించదని కోరహు, దాతాను, అబీరాముల విషయం ఎలా ఉదహరిస్తోంది? [w97 3/15 4వ పేజీ, 2వ పేరా]
16. మత్తయి 15:3-6, 1 తిమోతి 5:4లలో వృద్ధులైన తల్లిదండ్రుల్ని సన్మానించడాన్ని గూర్చిన ఏ రెండు అంశాలు ఉన్నతపర్చబడ్డాయి? [fy 173-5 పేజీలు, 2-5 పేరాలు]
17. సంఖ్యాకాండము 26:64, 65 వచనాల్లో ఏ ప్రాముఖ్యమైన పాఠం ఉన్నతపర్చబడింది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి g95 9/8 10-11 పేజీలు, 5-8 పేరాలు.]
18. యెహోవాకు చేసుకున్న సమర్పణ అంటే ఏమిటో గుణగ్రహించేందుకు ఫీనెహాసు మాదిరి మనకు ఎలా సహాయపడుతుంది. (సంఖ్యా. 25:11) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 3/1 16వ పేజీ, 12-13 పేరాలు.]
19. సూచనార్థక ఆశ్రయపురములో ఉండే వారు ఎలా ఆ ఆశ్రయపుర “సరిహద్దును దాటి” వెళ్లవచ్చు? (సంఖ్యా. 35:26) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w95 11/15 20వ పేజీ, 20వ పేరా.]
20. బైబిలు అనువాదానికి సైనాయ్‌టికస్ కోడెక్స్ ఏ విధంగా ఒక సమయానుకూలమైన ప్రయోజనకారి? [w97 10/15 11వ పేజీ, 2వ పేరా]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. తాను మాత్రమే __________ మరియు ఆయన చట్టాలకు __________ సర్వ సృష్టి యొక్క శాంతి సంతోషాల కొరకు ప్రాముఖ్యమనే ప్రధానమైన సత్యాన్ని శాశ్వతంగా స్థాపించేందుకు యెహోవా చెడును అనుమతించాడు. (కీర్త. 1:1-3; సామె. 3:5, 6; ప్రసం. 8:9) [w97 2/15 5వ పేజీ, 4వ పేరా]
22. __________ యెహోవా __________ గల దేవుడని కూడా మనకు బోధిస్తుంది. [kl 66వ పేజీ 14వ పేరా]
23. కీర్తన 144:15 బి వచనానికి అనుగుణంగా, నిజమైన సంతోషం అనేది నిజమైన __________పై మరియు యెహోవాతోనున్న మంచి __________పై ఆధారపడిన హృదయ పరిస్థితి. [w97 3/15 23వ పేజీ, 7వ పేరా]
24. హెబ్రీ భాషలో నుంచి సామాన్య గ్రీకులోనికి అనువదించబడిన బైబిలు దాదాపు సా.శ.పూ. 150కల్లా పూర్తయ్యింది, అది __________ అని పిలువబడింది; దాదాపు సా.శ. 400కల్లా పూర్తైన లాటిన్ భాషలోకి జెరోమ్ అనువదించిన బైబిలు __________ అని పిలువబడింది. [w97 8/15 9వ పేజీ, 1వపేరా; 10వ పేజీ, 4వ పేరా]
25. దేవుని జ్ఞాపకంలో ఉన్న మృతులందరికీ, మానవజాతి యొక్క __________ నుండి విడుదల పొందే ఉత్తరాపేక్ష ఉంది. [kl 88వ పేజీ, 18వ పేరా]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. (పర్ణశాలల పండుగనాడు; ప్రాయశ్చిత్త దినమున; పస్కాదినాన) సంవత్సరానికి ఒకసారి, యెహోవాను ఆరాధించే పరదేశులతో సహా ఇశ్రాయేలు జనాంగమంతా (ఏ పనీ చేయకుండా; పదియవంతు చెల్లించి; ప్రథమ ఫలాల అర్పణలను అర్పించి) ఉపవాసం ఉండాలి. (లేవీ. 16:29, 30) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w96 7/1 10వ పేజీ, 10వ పేరా.]
27. మూల భాషల్లో ఉన్న విశిష్టలక్షణాల్నీ, తత్సంబంధిత తలంపులనూ మరింత దగ్గరగా పాఠకుడు పరిశీలించేలా (సాధ్యమైనంత అక్షరార్థంగా ఉండే; మూల భాషల్లోని భావాన్ని తెలియజేసే; ఫలానా సిద్ధాంత అవగాహనకు అనుగుణంగా ఉండే) ఒక అనువాదాన్ని తయారుచేయడమనేది న్యూ వరల్డ్ బైబిల్ ట్రాన్స్‌లేషన్ కమిటీ లక్ష్యాల్లో ఒకటైవుంది. [w97 10/15 11వ పేజీ, 5వ పేరా]
28. హెబ్రీయులు 13:19వ వచనం ప్రకారంగా, తోటి విశ్వాసుల పట్టుదలతో కూడిన ప్రార్థనలు (దేవుడు అనుమతించినదాన్ని; దేవుడు చర్య తీసుకునే సమయాన్ని; దేవుడు విషయాలను మలిచే విధానాన్ని) మార్చగలవు. [w97 4/15 6వ పేజీ, 1వ పేరా]
29. ఇశ్రాయేలీయుల ‘బట్టల అంచుల కుచ్చుమీద ఉన్న నీలిసూత్రము’ (పవిత్రపర్చబడిన అలంకరణగా; నమ్రతకు సూచనగా; యెహోవా ప్రజగా లోకము నుంచి వేరుపర్చబడ్డారనడానికి దృశ్య జ్ఞాపికగా) ఉండాలి. (సంఖ్యా. 15:38) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E83 10/15 20వ పేజీ, 16వ పేరా.]
30. (యేసు యొక్క అపొస్తలుల ఎంపికతో; క్రీస్తు బలి మరణంతో; క్రీస్తు పరలోకానికి ఆరోహణమవ్వడంతో) దేవుని మెస్సీయ రాజ్యానికి పునాది వేయబడింది. [kl 93వ పేజీ, 10వ పేరా]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
సంఖ్యా. 16:41, 49; మత్త. 19:9; లూకా 2:36-38; కొలొ. 2:8; 3:14
31. సన్యాసవాదం, ప్రత్యేక రకమైన పవిత్రతకూ లేక నిజమైన అపార జ్ఞానానికి నడిపించదు. [g97 11/8 29వ పేజీ, 3వ పేరా]
32. మళ్లీ వివాహం చేసుకోగల సాధ్యతతో విడాకులు తీసుకోవటానికి ఉన్న ఏకైక లేఖనాధారం జారత్వమే. [fy 158-9 పేజీలు, 15వ పేరా]
33. దైవపరిపాలనా కార్యకలాపాల్లో బాగా చురుకుగా ఉండటం, జీవితపు చివరి సంవత్సరాల్లో కూడా అలా ఉండటం, వివాహజతను కోల్పోవటం వల్ల కలిగే బాధను తట్టుకోవడానికి ఒకరికి సహాయపడగలదు. [fy 170-1 పేజీలు, 21వ పేరా]
34. తన నియమిత సేవకుల ద్వారా యెహోవా న్యాయం తీర్చే విధానంలో తప్పు ఎన్నడం, విపత్కరమైన పర్యవసానాల్ని తీసుకురాగలదు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w96 6/15 21వ పేజీ, 13వ పేరా.]
35. నిస్వార్థమైన ప్రేమ దంపతులను దగ్గరకు తెస్తుంది, తమ ఇరువురికి, తమ పిల్లలకు ఏది మంచిదో అది చేయడాన్ని వారు ఇష్టపడేలా చేస్తుంది. [fy 187వ పేజీ, 11వ పేరా]