ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? అక్టోబరు: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరకు మరోసారి వెళ్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. నవంబరు, డిసెంబరు: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని ఉపయోగించండి: కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, కృంగినవారికి ఓదార్పు, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఆసక్తి ఉంటే, బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండి గానీ దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఏదైనా ఒకదాని నుండి గానీ బైబిలు అధ్యయనం చేసి చూపించండి. జనవరి, ఫిబ్రవరి: ఈ 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?. ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరకు మరోసారి వెళ్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి.