కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 3/8 పేజీలు 14-15
  • దేవుని క్షమాగుణం ఎంత పూర్ణమైనది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని క్షమాగుణం ఎంత పూర్ణమైనది?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భారమును దించుట
  • అప్పును కొట్టివేయుట
  • మరకను తొలగించుట
  • ఇతరులనుండి మద్దతు
  • “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • అపరాధ భావాలు—“నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము”
    యెహోవా దగ్గరకు తిరిగి రండి
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 3/8 పేజీలు 14-15

బైబిలు ఉద్దేశం

దేవుని క్షమాగుణం ఎంత పూర్ణమైనది?

“దేవుడు నా పాపములను ఎన్నటికి క్షమించడని నేను భావించాను. నేను చేసిన పనిని బట్టి ఆయనకు నేను ఇక అవసరమే లేదు.”—గ్లోరియా.

యెహోవా దేవుడు వారి పాపాలను క్షమిస్తాడని ఇతరులతో చెప్పడానికి గ్లోరియాకు ఇబ్బందే లేదు.a తాను చేసిన తప్పును గూర్చి తనంతట తానే ఆలోచించుకున్నప్పుడు, తాను దోషియని భావించింది. యెహోవానుండి క్షమాపణ లభించదని అనుకుంది.

తప్పుడు ప్రవర్తనను, తప్పుడు జీవిత విధానాన్ని గుర్తెరగడం మనస్సాక్షిని కలవరపెట్టగలదు. దావీదు తప్పు చేసిన తర్వాత యీ విధంగా వ్రాశాడు. “దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి . . . నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను.” (కీర్తన 32:3, 4; 51:3 పోల్చండి.) సంతోషకరమైన విషయమేమంటే, యెహోవా తప్పులను క్షమించడంలో ఆనందిస్తాడు. ఆయన “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు.”—కీర్తన 86:5; యెహెజ్కేలు 33:11.

అయినను, యెహోవా హృదయాలను చూస్తాడు. ఆయన క్షమాగుణం భావోద్రేకాల మీద ఆధారపడింది కాదు. (నిర్గమకాండము 34:7; 1 సమూయేలు 16:7) పాపి తన తప్పును హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, నిజమైన పశ్చాత్తాపాన్ని కనబర్చాలి, విరుద్ధమైనదిగాను, అసహ్యమైనదిగాను భావించి తన ప్రవర్తనను విడనాడాలి. (కీర్తన 32:5; రోమీయులు 12:9; 2 కొరింథీయులు 7:11) అప్పుడు మాత్రమే పాపి క్షమించబడగలడు, యెహోవా నుండి “విశ్రాంతి కాలములను” అనుభవించగలడు.—అపొస్తలుల కార్యములు 3:19.

కాని పశ్చాత్తాపపడిన తర్వాత కూడ, కొందరు ఇంకనూ దోషులుగా భావిస్తారు. వారు తమ పాపపు భారాన్ని శాశ్వతంగా మోయవలసిందేనా? తమ పాపములను గూర్చి పశ్చాత్తాపం చెందినవారికి, తమ పాపములను వదిలి పెట్టినప్పటికీ ఇంకనూ హృదయ భారంతోవున్న వారికి బైబిలులో ఎలాంటి ఓదార్పు లభిస్తుంది?—కీర్తన 94:19.

భారమును దించుట

తన పాపములను బట్టి అమితమైన దుఃఖంతో, దావీదు యెహోవాకు యిలా ప్రార్థించాడు: “నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.” (కీర్తన 25:18) ఇక్కడ దావీదు యెహోవాతో క్షమించడానికన్నా ఎక్కువగానే చేయమని కోరాడు. ఆయన యెహోవాతో తన పాపములను “క్షమించమని,” ఆయన వాటిని తొలగించాలని, వాటిని భరించాలని, వాటిని తీసివేయాలని అడిగాడు. పాపానికి తీవ్రమైన ఫలితాలున్నాయి, నిస్సంకోచంగా దావీదు విషయంలో, మనస్సాక్షి దెబ్బతినడం యిలాంటి ఫలితాల్లో ఒకటి.

యెహోవా తన ప్రజల పాపాలను తీసివేస్తాడని ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులకు గుర్తు చేయబడేది. పాప పరిహారార్థబలి దినంలో ప్రధాన యాజకుడు మేకపిల్ల తలమీద చేయిపెట్టి, ప్రజల పాపాలను ఒప్పుకుంటాడు, తర్వాత మేకను దూరంగా అరణ్య ప్రాంతంలోనికి పంపుతాడు. అక్కడున్న వ్యక్తి ఎవరైనా సరే, ఆ ప్రజల పాపాలు కొట్టివేయబడ్డాయని అనుకుంటాడు.—లేవీయకాండము 16:20-22.

కాబట్టి తమ పాపాలను గూర్చి పశ్చాత్తాపపడే వ్యక్తులు ఓదార్పునొందుతారు. పాపపరిహారార్థబలి దినము కొరకైన కార్యక్రమాలు అంతకంటె ఎక్కువైన పాపపరిహార ఏర్పాటును—యేసుక్రీస్తు యిచ్చిన విమోచన క్రయధన బలిని సూచించింది. యెషయా యేసును గూర్చి ప్రవచనాత్మకంగా యీ విధంగా వ్రాశాడు: “ఆయన అనేకుల పాపమును భరించెను.” (యెషయా 53:12) కాబట్టి, గతంలో చేసిన పాపాలు మనస్సాక్షిని భారం చేయనవసరం లేదు. అయితే యెహోవా ఈ పాపాలను కొంతకాలం తర్వాత గుర్తు చేసుకుంటాడా?

అప్పును కొట్టివేయుట

తన మాదిరి ప్రార్థనలో, యేసు యిలా అన్నాడు: “మా ఋణములు క్షమించుము.” (మత్తయి 6:12) ఇక్కడ భాషాంతరం చేసిన “క్షమించు” అనే గ్రీకు పదం “పోనిమ్ము” అనే అర్థమున్న క్రియాపద రూపం. కాబట్టి, పాపాలను క్షమించడానికి ఋణాన్ని వదిలిపెట్టడంతోను, రద్దు చేయడంతోను సారూప్యముంది.—మత్తయి 18:23-35 పోల్చండి.

పేతురు యీ విషయాన్ని మరింత విపులీకరించాడు: “మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సునొంది తిరుగుడి.” (అపొస్తలుల కార్యములు 3:20) “తుడిచివేయుట” అంటే నశింపజేయుట, లేదా కొట్టివేయుట అని అర్థం. ఇది వ్రాసిపెట్టినదాన్ని, తుడిచివేయుటను, పాత అప్పులు రద్దుచేయుటను సూచిస్తుంది.—కొలొస్సయులు 2:13, 14 పోల్చండి.

కాబట్టి, పశ్చాత్తాపపడ్డవారు, దేవుడు తానే రద్దు చేసిన అప్పు చెల్లించమని అడుగుతాడని భయపడనవసరం లేదు. ఆయన యిలా అంటున్నాడు: “నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.” (యెషయా 43:25; రోమీయులు 4:7, 8) పశ్చాత్తాపపడిన పాపికి ఇది ఏ భావాన్నిస్తుంది?

మరకను తొలగించుట

యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా అన్నాడు: “మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.”—యెషయా 1:18.

ఒక వస్త్రములో బాగా కన్పించే మరకను తొలిగించడానికి చేసే ప్రయత్నాలు తరచూ నిష్ఫలమౌతాయి. మరక పోయినప్పటికీ అది మసగ్గా కన్పిస్తూనే ఉంటుంది. పాపములు రక్తవర్ణమువలె ఉన్నప్పటికీ యెహోవా దేవుడు వాటిని హిమములా తెల్లగా మిఱుమిట్లుగొలిపేలా చేయగలడనేది ఎంత ఓదార్పునిస్తుందో.—కీర్తన 51:7 పోల్చండి.

కావున, పశ్చాత్తాపపడే పాపి శేష జీవితమంతా ఆ మరకను కల్గివుండాల్సిన అవసరముంటుందని భావించనవసరం లేదు. పశ్చాత్తాపపడినవాడు శాశ్వతంగా అవమానంతో జీవించేవిధంగా, యెహోవా ఆయన పాపములను నామమాత్రంగా క్షమించడు.—అపొస్తలుల కార్యములు 22:16 పోల్చండి.

ఇతరులనుండి మద్దతు

యెహోవా భారాన్ని దించుతున్నప్పటికీ, ఋణాన్ని కొట్టివేస్తున్నప్పటికి, పాపపు మరకనంతా తీసివేస్తున్నప్పటికీ, పశ్చాత్తాపపడినవాడు కొన్నిసార్లు, అనుతాపంతో కలతచెందవచ్చు. దేవుని వలన క్షమించబడినప్పటికీ, “అత్యధికమైన దుఃఖములో మునిగిపోయే” [“అమితమైన దుఃఖంతో నిరాశపడే,” టియివి] అవకాశమున్న పశ్చాత్తాపపడిన కొరింథు సంఘంలోని ఒక పాపినిగూర్చి అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—2 కొరింథీయులు 2:7.

ఈ వ్యక్తికి సహాయమెలా లభించగలదు? పౌలు యిలా కొనసాగిస్తున్నాడు: “వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (2 కొరింథీయులు 2:8) పౌలు ఉపయోగించిన “స్థిరపరుచుట” అనేది “చెల్లదగినదిగా చేయుట” అనే చట్టబద్ధమైన పదం. అవును, యెహోవానుండి క్షమాపణ పొందిన పశ్చాత్తాపపడ్డ పాపులకు తోటిక్రైస్తవుల అంగీకారం, మద్దతు కూడ అవసరమే.

దీనికి కొంత సమయం పడుతుందనుట వాస్తవమే. పశ్చాత్తాపపడ్డవాడు తన పాపపు నిందను మరిచి పోవాలి, నమ్మదగిన నీతియుక్తమైన జీవితాన్ని పెంపొందించుకోవాలి. గతంలో తాను చేసిన తప్పువలన వ్యక్తిగతంగా బాధించబడినవారి భావాలను తప్పక సహించాలి. అదే సమయంలో, దావీదులాగే, యెహోవా పరిపూర్ణమైన క్షమాగుణంలో అతడు నమ్మకం కల్గివుండవచ్చు: “పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు.”—కీర్తన 103:12. (g93 12/8)

[అధస్సూచీలు]

a అసలు పేరు మార్చబడింది.

[Picture Credit Line on page 14]

Return of the Prodigal Son by Rembrandt: Scala/Art Resource, N.Y.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి