కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 11/8 పేజీలు 19-21
  • నేను క్షమించరాని పాపం చేశానా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను క్షమించరాని పాపం చేశానా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన మనస్సాక్షి మనల్నెందుకు నొప్పిస్తుంది
  • దైవిక విచారం
  • స్వల్ప పాపాలనుబట్టి అపరాధ భావం
  • సహాయం మరియు ఓదార్పుకు ఆధారాలు
  • యెహోవా బహుగా క్షమించును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • క్షమించరాని పాపం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 11/8 పేజీలు 19-21

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేను క్షమించరాని పాపం చేశానా?

“నేనెన్నడును అంత క్రుంగినట్లు భావించలేదు. నాకింక ఆత్మాభిమానమే లేకుండా పోయిందని, దేవుడు నన్నింకెన్నడు క్షమించడని నేను భావించాను.”—మార్కో.a

“నేనెంతో నిరుత్సాహం చెందాను. అపరాధభావం నా హృదయాన్ని ఆవరించింది. నేను క్షమించరాని అపరాధాలను చేశానని తలంచాను.”—ఆల్‌బెర్టో.

“పాపము చేయనివాడు ఒకడును లేడు,” అని బైబిలు చెబుతుంది. (1 రాజులు 8:46) అయితే కొన్నిసార్లు ఒక యౌవనస్థుడు తాను చిన్న పొరపాటును చేయడంకన్న అధికంగా చేశానని భావించవచ్చు. మార్కో మరి ఆల్‌బెర్టోవలె, అతను నిర్దాక్షిణ్యమైన అపరాధ భావంచే పీడించబడవచ్చు. తాను చేసింది ఎంత నీచమైనది, ఎంత దుష్టమైనదంటే, దేవుడు తనను క్షమించడని అతను భావించవచ్చు.

ఇలాంటి భావాలు మిమ్మల్ని ముట్టడిస్తే అప్పుడేమిటి? ధైర్యంగా ఉండండి. మీ పరిస్థితి మరీ నిరాశాజనకమైనదేమి కాదు.

మన మనస్సాక్షి మనల్నెందుకు నొప్పిస్తుంది

మీరెప్పుడైనా అవివేకమైన తప్పు చేసినప్పుడు బాధపడటం సహజమే. “మనస్సాక్షి” అని బైబిలు పిలిచే సామర్థ్యంతో మనమందరం జన్మించాము. మనమేదైనా చెడ్డపని చేసినప్పుడు, సాధారణంగా మనల్ని అప్రమత్తులను చేసే అంతర్గత హెచ్చరికా సంకేతం, అది తప్పొప్పులను గుర్తించగల అంతరంగ జ్ఞానము. (రోమీయులు 2:14, 15) ఉదాహరణకు, రాజైన దావీదును పరిశీలించండి. ఆయన మరొక వ్యక్తి భార్యతో వ్యభిచరించాడు. తర్వాత, ఆమె భర్తయైన ఊరియా, కచ్చితంగా మరణించే ఏర్పాటు చేశాడు. (2 సమూయేలు 11:2-17) అది దావీదుపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది?

“దివారాత్రులు నీ [దేవుని] చెయ్యి నామీద బరువుగా నుండెను,” అని దావీదు ఒప్పుకున్నాడు. అవును, దైవిక అనంగీకారపు భారాన్ని ఆయన అనుభవించాడు. “నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. . . . దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నానని,” కూడా దావీదు చెప్పాడు. (కీర్తన 32:4; 38:3-6) దావీదు అనుకూల చర్య గైకొని, తన దోషాన్నిబట్టి పశ్చాత్తాపం చెందడానికి కదిలించబడేంతవరకు ఆయన మనస్సాక్షి ఆయన్ను బాధించకొనసాగింది.

అదేవిధంగా, మీరు క్రైస్తవ తలిదండ్రులచే బోధింపబడిన వారై, బైబిలు ప్రమాణాల నుండి వైదొలగినట్లైతే, మీరు నొచ్చుకుంటారు. ఈ పశ్చాత్తాప భావన సాధారణమైనది, ఆరోగ్యకరమైనది. తప్పిదం ఒక విడువలేని అలవాటు కాక ముందే, తనను తాను సరిచేసుకునేందుకు లేక సహాయాన్ని వెదికేందుకు అదొక వ్యక్తిని ప్రేరేపించగలదు. మరోవైపు, పాపంలో ఎడతెగక కొనసాగే వ్యక్తి తన మనస్సాక్షిని పాడుచేసుకుంటాడు. ఈలోగా, యిది మాడిన చర్మంలా మొద్దుబారిపోతుంది. (1 తిమోతి 4:2) అది నైతిక దుర్నీతికి దారి తీస్తుంది.—గలతీయులు 6:7, 8.

దైవిక విచారం

ఆశ్చర్యాన్ని కలిగించని రీతిలో, బైబిలు “మరణకరమైన పాపము,”ను గురించి మాట్లాడుతుంది. (1 యోహాను 5:16; మత్తయి 12:31 పోల్చండి.) అలాంటి పాపం కేవలం శారీరక బలహీనత మాత్రమే కాదు. అది బుద్ధిపూర్వకంగా, మూర్ఖంగా, మొండిగా చేసినది. ఆ తప్పుచేయడమే పాపం కాదుగానీ, ఆ పాపి హృదయ పరిస్థితి అలాంటి పాపాన్ని క్షమించరాని దానిగా చేస్తుంది.

అయితే, మీ చెడుప్రవర్తన విషయమై మీరు నొచ్చుకొని, దుఃఖపడుతున్నారన్న వాస్తవమే, మీరు క్షమించరాని పాపం చేయ లేదని సూచిస్తుంది. “దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయునని,” బైబిలు చెబుతుంది. (2 కొరింథీయులు 7:10) వాస్తవానికి, యాకోబు 4:8-10 నందు యివ్వబడిన ప్రోత్సాహాన్ని గమనించండి: “పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు [యెహోవా NW] దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.”

నిజమే, పొరపాటు ఎంతో గంభీరమైనది కావచ్చు. ఉదాహరణకు, యౌవనురాలైన జూలి, స్నేహితునితో ముద్దు పెట్టుకోడం, కౌగిలించుకోడంలో పాల్గొన్నది. “మొదట్లో నేనెంతో అపరాధం చేసినట్టు భావించానని,” ఆమె ఒప్పుకుంది, “కాని కాలం గడిచే కొలది, నేను దానికి అలవాటుపడ్డాను. ఇది నా మనస్సాక్షిని అంతగా ఇబ్బంది పెట్టలేదు.” కొంత కాలానికి, అపవిత్ర క్రియలు లైంగిక సంబంధానికి దారితీసేంతగా పెరిగిపోయాయి. “నేను నిస్సహాయురాలిగా భావించానని,” జూలి చెబుతుంది. “అది అనేకసార్లు జరిగేంతగా నా మనస్సాక్షి బలహీనమయ్యింది.”

అలాంటి పరిస్థితి నిరాశాజనకమైనదా? అలా కానవసరంలేదు. యూదా రాజుల్లో ఒకడైన, మనష్షే విషయమేమిటి? ఆయన అభిచారము, శిశు బలులతో సహా అతి గంభీరమైన పాపాలను చేశాడు. అయినా, ఆయన నిష్కపటమైన పశ్చాత్తాపాన్నిబట్టి దేవుడు ఆయనను క్షమించాడు. (2 దినవృత్తాంతములు 33:10-13) రాజైన దావీదు విషయమేమిటి? తన దుష్ట క్రియల విషయమై పశ్చాత్తాపం పొంది, యెహోవా “దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడని ఆయన తెలుసుకున్నాడు.—కీర్తన 86:5.

క్రైస్తవులకు నేడు యీ హామి ఉంది: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, అయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా,” చేయును. (1 యోహాను 1:9) ఒకరు తన పాపాలను ఎవరితో ఒప్పుకోవాలి? ప్రాముఖ్యంగా, యెహోవా దేవునితో. “ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి.” (కీర్తన 32:5; 62:8) కీర్తన 51లో దావీదు పశ్చాత్తాపంతో ఒప్పుకోడాన్ని గూర్చి చదవడం సహాయకరంగా ఉంటుందని మీరు భావించవచ్చు.

దానికి తోడు, గంభీరమైన పాపం చేసిన క్రైస్తవులు సంఘ పెద్దలతో మాట్లాడాలని కూడా బైబిలు ప్రోత్సహిస్తుంది. (యాకోబు 5:14, 15) నిర్మలమైన మనస్సాక్షిని తిరిగిపొందడానికి మరి దేవునితో మీ సంబంధాన్ని పునఃస్థాపించుకోడానికి వారి మనఃపూర్వక సలహా మరియు ప్రార్థనలు మీకు సహాయపడగలవు. దుర్భలతకు మరియు దుష్టత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు గ్రహించగలరు. మీరు చేసిన పొరపాటును తిరిగి చేయకుండా ఉండడానికి తగిన సహాయాన్ని మీరు పొందేలా కూడా వారు చేయగలరు. జూలి, తానే ధైర్యంతోకూడిన యీ చర్యను తీసుకొని, యిలా సలహానిస్తుంది: “‘నాకై నేనే సరిదిద్దుకోడానికి’ ప్రయత్నించాను, అది కొంతమేరకు పని చేసిందని కూడా తలంచాను. కాని ఒక సంవత్సరం తర్వాత నేనెంత పొరపడ్డానో నేను తెలుసుకున్నాను. పెద్దల సహాయం లేకుండా గంభీరమైన సమస్యలను మీరు తీర్మానించుకోలేరు.”

స్వల్ప పాపాలనుబట్టి అపరాధ భావం

కొన్నిసార్లు, ఒక యౌవనుడు “ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల.” (గలతీయులు 6:1) లేక ఆమె లేక అతను శారీరక బలహీనత తమను అధిగమించడాన్ని అనుమతిస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న యౌవనులు అమితమైన అపరాధ భావాలను, బహుశా తప్పిదానికి తగిన అపరాధ భావానికన్నా ఎక్కువే అనుభవించవచ్చు. దానివల్ల అనవసరమైన మనోవేదన కలుగుతుంది. అలాంటి నిర్దిష్టమైన అపరాధ భావాలు, ఆరోగ్యకరమైనదే కాని అపరిమితంగా సున్నితమైన మనస్సాక్షి మూలంగా అవి కలుగవచ్చు. (రోమీయులు 14:1, 2) మనం తప్పు చేసినప్పుడు “నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడని,” మనం జ్ఞాపకముంచుకోవాలి.—1 యోహాను 2:1, 2.

మనం మొదట్లో ప్రస్తావించిన యౌవన మార్కో విషయాన్ని మళ్లీ పరిశీలిద్దాం. ఈ యౌవన క్రైస్తవుడు తాను ఒక క్షమించరాని పాపం చేశాడని విశ్వసించాడు. అతను తనకు తానిలా చెప్పుకునేవాడు: ‘నాకు బైబిలు నియమాలు బాగా తెలుసు, అయినా నేను పాపం చేయడం మానలేకపోతున్నాను.’ అతని పాపమేమిటి? హస్తప్రయోగ సమస్య. ‘నేనా అలవాటును మానలేక పోతే, దేవుడు నన్నెలా క్షమించగలడు?’ అని మార్కో తర్కించేవాడు. స్వయం దుర్వినియోగం చేసుకునే తీవ్రమైన అలవాట్లుండిన ఆల్‌బెర్టో యిలా అన్నాడు: “నేను ఆ పాపం నుండి విడుదల పొందలేక పోయినందువల్ల అపరాధభావం నా అంతరంగమందు ఉండేది.”

హస్తప్రయోగం ఒక అపరిశుభ్రమైన అలవాటు. (2 కొరింథీయులు 7:1) అయితే, బైబిలు దాన్ని జారత్వమంతటి గంభీరమైన పాపాలతో చేర్చటంలేదు. వాస్తవానికి, అది దాన్ని ప్రస్తావించనే లేదు. కాబట్టి, హస్తప్రయోగం చేయడం క్షమించరానిదేమి కాదు. అది క్షమించడానికి తగనిదని దృష్టించడం వాస్తవానికి ప్రమాదకరం కావచ్చు; ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నించడంలో యిక ఎంతమాత్రం ప్రయోజనమేలేదని ఒక యౌవనుడు తర్కించవచ్చు! అయితే ఈ అలవాటుకు విరుద్ధంగా పోరాడడానికి ఒక క్రైస్తవుడు తీక్షణమైన ప్రయత్నాలు చేయాలని బైబిలు నియమాలు సూచిస్తున్నాయి.b (కొలొస్సయులు 3:5) “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని యెహోవాకు తెలుసు. (యాకోబు 3:2) పొరపాటు మళ్లీ జరిగితే, ఒక యౌవనుడు తాను దండనార్హుడనని భావించనవసరంలేదు.

ఇతర తప్పటడుగులు, తప్పిదాల విషయంలో కూడా అది వాస్తవమే. అధిక అపరాధ భావంవలన మనల్ని మనం శిక్షించుకోవాలని యెహోవా కోరడంలేదు. బదులుగా, ఆ సమస్యను సరిచేసుకోడానికి మనం చర్యలు గైకొన్నప్పుడు, ఆయన సంతోషిస్తాడు.—2 కొరింథీయులు 7:11; 1 యోహాను 3:19, 20.

సహాయం మరియు ఓదార్పుకు ఆధారాలు

అయినప్పటికి, అలా చేయడానికి మీకు వ్యక్తిగత సహాయం అవసరం కావచ్చు. దైవభయంగల తలిదండ్రులు సహాయాన్ని, మద్దతునివ్వడానికి తరుచుగా ఎంతో చేయగలరు. మరియు క్రైస్తవ సంఘం వేరే విధమైన మద్దతునిస్తుంది. మార్కో యిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నాకు వాస్తవంగా సహాయం చేసిన విషయమేమంటే ఒక పెద్దతో సంభాషించడమే. నా అంతరంగమందలి నా అతి వ్యక్తిగత ఆలోచనలను గురించి మాట్లాడాలంటే నాకు ధైర్యం కావలసి వచ్చింది. కాని ఆయన నాకు ధైర్యం చెప్పాడు, కాబట్టి నేనాయన సలహా అడిగాను.” ఆల్‌బెర్టో కూడ ఒక పెద్ద నుండి సలహాను కోరాడు. “ఆయన యిచ్చిన ప్రోత్సాహకరమైన సలహాను నేను మర్చిపోలేను. తాను యౌవనంలో ఉన్నప్పుడు, తనకు కూడా అదే సమస్య ఉండేదని ఆయన నాతో చెప్పాడు. నేను దాన్ని ఎన్నడూ నమ్మి ఉండేవాన్నికాదు. ఆయన నిజాయితీకి గొప్ప మెప్పుదలతో నేను ఆయన మాటలు వింటుండిపోయాను.” అలాంటి సహాయం మరియు మద్దతుతో, మార్కో మరియు ఆల్‌బెర్టోలు తమ సమస్యలను అధిగమించారు. వారిద్దరూ ప్రస్తుతం తమతమ సంఘాల్లో బాధ్యతగల స్థానాల్లో సేవ చేస్తున్నారు.

పట్టుదలతో ప్రార్థించడం మరో సహాయం. దావీదువలె మీరు “శుద్ధహృదయము”ను మరియు ‘స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని,’ ప్రార్థించవచ్చు. (కీర్తన 51:10) దేవుని వాక్యాన్ని చదవడం మరొక ఓదార్పుకరమైన మూలం. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలుకు కూడ అంతర్గత సంఘర్షణలు ఉండేవని తెలుసుకోడం ప్రోత్సాహకరంగా ఉంటుందని మీరు భావించవచ్చు. “మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని,” ఆయన అంగీకరించాడు. (రోమీయులు 7:21) తన చెడు భావాలను అదుపులో ఉంచుకోడంలో పౌలు సఫలుడయ్యాడు. మీరు కూడా కాగలరు. కీర్తనలు చదవడం, ప్రత్యేకంగా దేవుని క్షమాగుణంతో వ్యవహరిస్తున్న కీర్తనలు 25, 86, మరి 103 వంటివాటిని చదవడం మీకు ప్రాముఖ్యంగా ఓదార్పుకరంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు.

ఏమైనప్పటికీ, మిమ్మల్ని మీరు ఏకాంతపర్చుకోడాన్ని మానుకోండి, నైరాశ్యం మిమ్మల్ని శాసించడానికి అనుమతించకండి. (సామెతలు 18:1) యెహోవా యొక్క కరుణను మీరు పూర్తిగా ఉపయోగించుకోండి. యేసు విమోచనా క్రయధన బలినిబట్టి ఆయన మనలను ‘బహుగా క్షమిస్తాడని’, జ్ఞాపకముంచుకోండి. (యెషయా 55:7; మత్తయి 20:28) మీ దోషాలు చిన్నవని భావించకండి, అయితే దేవుడు మిమ్మల్ని క్షమించడనే ముగింపుకు కూడా రాకండి. మీ విశ్వాసాన్ని మరియు ఆయనను సేవించాలన్న మీ తీర్మానాన్ని బలపర్చుకోండి. (ఫిలిప్పీయులు 4:13) కొద్ది సమయంలో, మీకు మనశ్శాంతి మరియు మీరు క్షమింపబడ్డారని తెలిపే మిక్కుటమైన అంతరంగ ఆనందం మీకు కలుగుతుంది.—కీర్తన 32:1 పోల్చండి.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌, ఇన్స్‌. వారు ప్రచురించిన, యౌవనస్థులు అడిగే ప్రశ్నలు: ఆచరణాత్మక సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 25 మరియు 26 అధ్యాయాల్లో సహాయకరమైన సలహాలు యివ్వబడ్డాయి.

[20వ పేజీలోని చిత్రం]

యోగ్యతగల క్రైస్తవునితో సంగతులను మాట్లాడడం మీకు విషయాలను గురించి నూతన దృక్కోణాన్ని అందజేయగలదు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి