కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 12/8 పేజీలు 19-20
  • కళ అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కళ అంటే ఏమిటి?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కళను నిర్వచించడం
  • కళ వెనుకనున్న చిత్రకారుడు
  • మన కాలంలో ఎంతో అనాదరణకు గురైన చిత్రకారుడు
    తేజరిల్లు!—1995
  • మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఘన చిత్రకారుడు యెహోవా!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మన చుట్టూ ఉన్న అందాన్నెలా చూడాలి
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 12/8 పేజీలు 19-20

కళ అంటే ఏమిటి?

స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

మీరు ఇంతవరకూ చూసిన దృశ్యాల్లో ఎంతో అందమైనది ఏది? అది ఉష్ణమండల సూర్యాస్తమయమా, మంచుతో కప్పబడిన పర్వత శిఖరమా, ఎడారిలో పూగుచ్ఛాల ప్రాంతమా, సంవత్సరంలోని శరదృతువులో అడవిలోవుండే విభిన్న రంగులా?

భూమి అందంచేత ఆకర్షితులమైన ఆ ప్రత్యేక క్షణమంటే మనలో చాలామందికి ఇష్టం. ఒకవేళ వీలైతే, పరదైసులాంటి ప్రాంతంలో మన సెలవులను గడపాలని మనం ఇష్టపడతాం, మరి జ్ఞాపకముంచుకోవలసిన ఈ దృశ్యాలను కెమేరాలో బంధిస్తాం.

పాడు చేయబడని ఈ వైభవాన్ని మళ్లీసారి మీరు తిలకించినప్పుడు, కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడుగుకోవడానికి ఇష్టపడవచ్చు. ఒక చిత్ర ప్రదర్శనశాలలో ఉన్న పెయింటింగ్‌లు అన్నింటిపై “అనామధేయమైనదని” వ్రాసి ఉంటే ఏదో కొరత ఉందని మీరు భావించరా? ఒక ఎగ్జిబిషన్‌లో ఉండిన పెయింటింగ్‌ యొక్క నాణ్యతను, అందాన్నిబట్టి మీరు ఎంతో ప్రభావితం చెందితే ఆ చిత్రకారుడెవరో మీరు తెలుసుకోవాలని ఇష్టపడరా? మనం పుడమి యొక్క అందమైన అద్భుతాలను తిలకించి సంతృప్తి చెందుతూ, వాటిని సృష్టించిన చిత్రకారున్ని ఉపేక్షిస్తామా?

నిజమే, ప్రకృతిలో కళ వంటిదేమీ లేదని—కళ కొరకు సృజనాత్మక నిపుణత మరి వివరణ అవసరమని భావించేవారు ఉన్నారు. అయితే, కళను గూర్చిన అలాంటి నిర్వచనం బహుశా మరీ సంకుచితంగా ఉంటుందేమో. అయితే కళ అంటే ఏమిటి?

కళను నిర్వచించడం

అందరినీ సంతృప్తిపరచే కళను గూర్చిన నిర్వచనం బహుశా లభించదేమో. అయితే వెబ్‌స్టర్స్‌ నైన్త్‌ న్యూ కాలేజియేట్‌ డిక్షనరీలో ఒక మంచి వివరణ కనుగొనబడుతుంది, అది “ప్రాముఖ్యంగా అందమైన సంగతుల ఉత్పత్తి విషయంలో నిపుణతను మరియు సృజనాత్మక ఊహను కృషి చేసి ఉపయోగించడమే,” కళ అని చెబుతుంది. దీని ఆధారంగా, ఒక చిత్రకారునికి నిపుణత మరియు సృజనాత్మక ఊహా ఉండాలని మనం చెప్పగలం. అతను ఈ రెండు కౌశలాలకు పని చెబితే, ఇతరులకు నచ్చేదాన్ని లేక ఆకర్షణీయంగా అనిపించే దాన్ని తాను ఉత్పన్నం చేయగలడు.

నిపుణత మరియు ఊహా వ్యక్తీకరణలు మానవ కళాకృత్యాలకే పరిమితమా? లేక మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచంలో కూడా అవి గోచరమౌతున్నాయా?

కాలిఫోర్నియాలోని ఎత్తైన ఎర్రకలప చెట్లు, పసిఫిక్‌ సముద్రంలోని విస్తారమైన పగడపు దిబ్బలు, వర్షారణ్యాల శక్తివంతమైన జలపాతాలు, ఆఫ్రికాలోని సవానానందలి మహత్తరమైన జంతువులు కూడా భిన్నమైన మార్గాల్లో మానవజాతి కొరకు “మోనా లీసా” అనే కళాఖండం కంటే ఎక్కువ విలువైనవి. ఆ కారణం చేతనే, యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) రెడ్‌వుడ్‌ నేషనల్‌ పార్క్‌, అమెరికా; ఇగ్వాసు జలపాతాలు, అర్జెంటీనా/బ్రెజిల్‌; ద గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌, ఆస్ట్రేలియా; మరియు సెరెంజెట్టి నేషనల్‌ పార్క్‌, టాంజానియాలను, మానవుని “ప్రపంచ సంపదలో” ఒక భాగంగా పేర్కొన్నది.

ఈ ప్రకృతి సంపదను మానవనిర్మిత జ్ఞాపక చిహ్నాల ప్రక్కన ఇమిడ్చారు. ఎందుకు? ఏయే వాటికైతే “అసాధారణమైన విశ్వవ్యాప్త విలువ” ఉందో వాటిని పరిరక్షించాలన్నదే వాటి సంకల్పం. ఆ అందం ఇండియాలోని తాజ్‌మహల్‌దైనా లేక అమెరికాలోని ద గ్రాండ్‌ కెన్యాన్‌దైనా, అది భవిష్యత్‌ తరాల కొరకు కాపాడబడవలసి ఉందని యునెస్కో తర్కిస్తుంది.

సృజనాత్మక నైపుణ్యాలను చూసేందుకు మీరు నేషనల్‌ పార్క్‌కు తరలి వెళ్లాల్సిన అవసరంలేదు. ఒక మహనీయమైన ఉదాహరణ మన స్వంత శరీరమే. మానవ ఆకృతి అద్భుతమైన కళాఖండమని ప్రాచీన గ్రీకు శిల్పకారులు దృష్టించారు, మరి దాన్ని వీలైనంత పరిపూర్ణంగా రూపించేందుకు కృషి చేశారు. శరీరం యొక్క పనిని గూర్చి తెలిసిన ప్రస్తుత విషయాలతో, దాన్ని సృష్టించేందుకు మరి రూపించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని మనం మరింత ఎక్కువ గుణగ్రహించగలం.

సృజనాత్మక ఊహను గురించిన సంగతేమిటి? పురివిప్పిన ఒక నెమలి ఈకలపైనున్న అపూర్వ రంగులను, ఒక గులాబీ అలవోకగా విచ్చుకోడాన్ని, లేక మెరిసే తేనెపిట్ట చేసే శరవేగంతో కూడిన విహంగ నృత్యాన్ని చూడండి. అలాంటి కళాఖండాలను ఒక కాన్వాస్‌పై అద్దకముందే లేక కెమేరాలో బంధించక ముందే అవి కళాఖండాలు అయ్యాయి. టక్కా లిల్లీ యొక్క లేత వంగరంగు ఈనెలను చూసి ఆసక్తికలిగిన ఒక నేషనల్‌ జియోగ్రాఫిక్‌ రచయిత, దాని అవసరత ఏమిటని ఒక యౌవన వైజ్ఞానికున్ని అడిగాడు. ఆయనిలా క్లుప్తంగా జవాబిచ్చాడు: “అవి దేవుని ఊహను బయల్పర్చుతాయి.”

ప్రాకృతిక ప్రపంచంలో నైపుణ్యం మరియు సృజనాత్మక ఊహ వెల్లివిరియడమే కాకుండా, అవి మానవ చిత్రకారులకు ఎడతెగని స్ఫూర్తినిచ్చేందుకు కూడా మూలం అయ్యాయి. ప్రఖ్యాత ఫ్రెంచి చిత్రకారుడైన ఆగస్టే రోడిన్‌ ఇలా చెప్పాడు: “చిత్రకారుడు ప్రకృతి రహస్యాలను తనవద్ద కలిగివున్నవాడు. పూలు తమ మెడలను హుందాగా వంచడం ద్వారా, తమ విప్పారిన రంగుల విభిన్నత యొక్క ఏకత్వం ద్వారా ఆయనతో ముచ్చటిస్తాయి.”

ప్రకృతి సౌందర్యానికి సాటైన దాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు చిత్రకారులు తమ పరిమితులను గుర్తెరిగారు. ఇంతవరకూ ఉన్న వారిలో అతి గొప్ప చిత్రకారునిగా పరిగణింపబడిన మైకెలేంజిలో ఇలా అన్నాడు: “కళ యొక్క నిజమైన పని దైవీక పరిపూర్ణత యొక్క ఛాయను చూపడమే.”

వైజ్ఞానికులు అలాగే చిత్రకారులు ప్రాకృతిక ప్రపంచం యొక్క అందాన్నిబట్టి ప్రభావితులయ్యారు. దేవుని మనస్సు అనే తన పుస్తకంలో గణిత భౌతికశాస్త్ర పండితుడైన పౌల్‌ డేవిస్‌, “భావోద్రేకాలు లేని నాస్తికులు కూడా ప్రకృతిపట్ల, దాని లోతు, అందం మరియు భిన్నత్వం ఎడల మతపరమైన భయంవంటి కొంత గౌరవాన్ని, ఆసక్తిని కలిగి ఉంటారని” వివరించాడు. ఇది మనకేమి బోధించాలి?

కళ వెనుకనున్న చిత్రకారుడు

ఒక చిత్రకళా విద్యార్థి చిత్రకారుని కళను అర్థం చేసుకోడానికి, దాన్ని మెచ్చుకోడానికి ఆయన్ను గురించి తెలుసుకుంటాడు. చిత్రకారుని పని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని అతను లేక ఆమె గుర్తించడం జరుగుతుంది. ప్రకృతి కళ కూడా ప్రకృతిని పుట్టించిన వాని, అంటే అద్వితీయ దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. “ఆయన అదృశ్యలక్షణములు . . . సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (రోమీయులు 1:20) అంతేకాక, భూమిని చేసినవాడు ఎంత మాత్రం అనామధేయమైనవాడు కాదు. తన కాలంనాటి ఏథెన్సు తాత్వికులకు పౌలు చెప్పినట్లు, “[దేవుడు] మనలో ఎవనికిని దూరముగా ఉండువాడుకాడు.”—అపొస్తలుల కార్యములు 17:27.

దేవుని సృష్టిలోని కళాఖండం సంకల్పరహితంగా లేక ప్రమాదవశాత్తూ కలుగలేదు. మన జీవితాలను రంగులతో నింపడమే కాకుండా, అది మహాగొప్ప చిత్రకారుడు, విశ్వంలోని రూపకారుడు అయిన యెహోవా దేవుని నైపుణ్యాలను, ఊహను మరియు మహిమను బయల్పర్చుతుంది. ఆ మహాగొప్ప చిత్రకారున్ని ఎక్కువగా తెలుసుకోడానికి ఈ కళ మనకెలా సహాయం చేయగలదనే విషయాన్ని తదుపరి శీర్షికలో పరిగణిస్తాం.

[Picture Credit Line on page 19]

Musei Capitolini, Roma

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి