కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 10/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఇది కేవలం తాత్కాలికమే!’—మూత్రపిండాల వ్యాధితో నా జీవితం
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 10/8 పేజీ 30

మా పాఠకుల నుండి

జంతు కథలు జంతువుల్ని గురించి మీరు ప్రచురించే శీర్షికల్ని చదవడానికి నేను ఇష్టపడతాను. ప్లాటిపస్‌ గురించి నేనెన్నడూ విననందున, “తికమకపెట్టే ప్లాటిపస్‌” అనే శీర్షిక (జనవరి 8, 1997) నన్ను ఆశ్చర్యచకితున్ని చేసింది! అదే సంచికలో, జంతువులకూ మానవులకూ మధ్య ఉండే అద్భుతమైన స్నేహాన్ని గూర్చిన “ఈ కుడూ మరిచిపోలేదు” అనే శీర్షిక కూడా నా హృదయాన్ని హత్తుకొంది. జంతువుల ఎడల మానవులు ప్రేమా గౌరవాల్ని చూపడం ఎంత బాగుంటుందో కదా!

ఎఫ్‌. ఎ., బ్రెజిల్‌

గుండెపోటు మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడంతోపాటూ మా భౌతిక క్షేమాన్ని గురించి శ్రద్ధ తీసుకునే సంస్థకు చెందినందుకు నేను కృతజ్ఞురాల్ని. “గుండెపోటు—ఏమి చేయవచ్చు?” (జనవరి 8, 1997) అనే శీర్షికల పరంపర హృద్రోగ లక్షణాల్ని ఎలా గుర్తించవచ్చో మాకు తెలియజేసింది. మా మామగారిలో ఈ లక్షణాలు కన్పించినప్పుడు, ఆయన పరిస్థితి విషమించిందని మేము గ్రహించి, ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. ఆయనకు గుండెపోటు వచ్చింది; అయితే హాస్పిటల్‌లో 24 రోజులు ఉన్న తర్వాత, ఆయనకు ప్రమాదం తప్పింది.

ఇ. ఎస్‌., బ్రెజిల్‌

మా నాన్నగారు 1995లో ఏరిటిక్‌ ఎన్యూరిజమ్‌ మూలంగా చనిపోయారు. కాబట్టి నేను ఈ సంచికను మొదట చూసినప్పుడు, దాన్ని చదవడానికి నాకు ధైర్యం చాల్లేదు. అయినప్పటికీ, దాన్ని నేను ఓ నెల తర్వాత చదివాను. ఈ శీర్షికలు నాకు ఓదార్పునిచ్చాయి, హృద్రోగం కుటుంబానికి తేగలిగే బాధను ఇతరులు కూడా అనుభవించారని తెల్సుకున్నాను.

ఎస్‌. జె., కెనడా

గత జూలైలో ఇంటింటి ప్రకటనా పనిలో ఉండగా, నా భర్త కుదించుకుపోయాడు, హాస్పిటల్‌కు పరుగెత్తాల్సి వచ్చింది. సంతోషదాయకంగా, ఆయన బ్రతికి బయటపడ్డారు. మీ శీర్షికలు మా కోసం సరైన సమయానికి వచ్చాయి. “కుటుంబాలకు మద్దతు అవసరం” అనే సెక్షన్‌ను చూడడం మమ్మల్ని ఆనందబాష్పాలు రాల్చేలా చేసింది. ఎందుకంటే మాకు కావాల్సింది కచ్చితంగా అదే.

ఎమ్‌. ఎ., జపాన్‌

గత ఆదివారం నా ఎడమ అరచేతిలో ఎడతెగకుండా నొప్పి వస్తున్నట్లు, చేతివ్రేళ్ల కొనల్లో తిమ్మిరి పుడుతున్నట్లు అన్పించింది. నేను దాన్ని కేవలం సామాన్యమైన పోటూ, నొప్పిగానే తలంచాను. గుండెపోటుపై మీరు ప్రచురించిన శీర్షికల్ని నేను చదివినప్పుడు, ఆ రోగ లక్షణాలతో బాధపడుతున్నానని నేను దృఢంగా అనుకున్నాను! నేను హాస్పిటల్‌ ఎమర్జెన్సీ గదికి వెళ్లాను. నా గుండెలోని ముఖ్య దమనుల్లో ఒకటి మూసుకుపోయినట్టు డాక్టర్లు కనుగొన్నారు. వాళ్లు ఆ మరుసటి రోజు శస్త్ర చికిత్స చేశారు. మీ శీర్షికలు గనుక రాయబడకపోతే, ఈ కృతజ్ఞతా ఉత్తరాన్ని రాయడానికి బహుశా నేను ఇక్కడ ఉండకపోయే వాడినేమో!

ఎన్‌. ఎస్‌., అమెరికా

“గుండెపోటు లక్షణాలు” అనే బాక్స్‌ని నేను ప్రత్యేకంగా మెచ్చుకుంటాను. మీరు మా సమస్యల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారనీ, వాటిని తాళుకోడానికి మాకేమి అవసరమో వాటిని ఇస్తారని నేను గ్రహించేలా అది చేసింది.

ఎమ్‌. బి., సెనెగల్‌

మా నాన్నగారికి గుండెపోటు వచ్చినప్పటి నుండీ, మా ఇంట్లో జీవితం చెప్పుకోదగినంతగా మారిపోయింది. ఈ క్లిష్టమైన గడియల్లో, ఆ శీర్షికలు మాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయని రుజువయ్యింది.

పి. జి., ఇటలీ

లూయీ పాశ్చర్‌ నా వయస్సు పన్నెండేళ్లు. “లూయీ పాశ్చర్‌—అతని పరిశోధన రుజువు చేసిన విషయం” అనే శీర్షికను నేను మెచ్చుకుంటున్నానని మీకు తెలియజేయాలని అనుకున్నాను. (జనవరి 8, 1997) నా సైన్సు తరగతిలో మేము ఆయన్ని గురించి చదువుతున్నాం. స్కూల్లో రిపోర్టును తయారుచేస్తున్నప్పుడు నేను ఈ శీర్షికను ఉపయోగించి, నా గ్రేడులకు అదనంగా పది పాయింట్లు పొందాను!

ఎ. పి., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి