కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g 10/15 పేజీలు 8-13
  • క్షమాపణ ఎలా అడగాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్షమాపణ ఎలా అడగాలి?
  • తేజరిల్లు!—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్య
  • ఏమి చేయవచ్చు
  • నేను సారీ ఎందుకు చెప్పాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • మీరు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • క్షమాపణ చెప్పడం ఎందుకంత కష్టం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
తేజరిల్లు!—2015
g 10/15 పేజీలు 8-13
కోపంగా మొహం పక్కకు తిప్పుకున్న భార్యతో మాట్లాడుతున్న భర్త

కుటుంబం కోసం | భార్యాభర్తలు

క్షమాపణ ఎలా అడగాలి?

సమస్య

మీ ఇద్దరికి ఇప్పుడే గొడవైంది. ‘గొడవ మొదలుపెట్టింది నేను కాదు కాబట్టి నేనెందుకు సారీ చెప్పాలి?’ అని మీరు అనుకోవచ్చు.

గొడవ ఆగిపోయినా, పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. క్షమించమని అడుగుదాం అనుకుంటారు కానీ “సారీ” అనే చిన్న మాట చెప్పలేకపోతారు.

ఎందుకు ఇలా జరుగుతుంది

గర్వం. ‘నా భార్యకు కొన్నిసార్లు “సారీ” చెప్పడానికి నా “ఈగో లేదా అహం” అడ్డువస్తుంది’ అని రాజీవ్‌a అంటున్నాడు. గొడవకు కొంతవరకు నేను కూడా కారణమే అని ఒప్పుకోవడానికి గర్వం ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది.

చూసే విధానం. “గొడవకు కారణం నేనే అయితే క్షమించమని అడుగుతాను” అని మీరనవచ్చు. ‘తప్పంతా నాదే అయితే నా భర్తకు “సారీ” చెప్పడం అంత కష్టంగా అనిపించదు. కానీ మేమిద్దరం అనకూడని మాటలు అన్నప్పుడు, ఇద్దరం తప్పు చేశాం కాబట్టి నేనే ఎందుకు సారీ చెప్పాలి?’ అని శ్రీజ అంటుంది.

గొడవకు పూర్తిగా మీ భార్య/భర్తే కారణం అని మీకు అనిపిస్తే, మీరు క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు అని మీరు అనుకుంటుండవచ్చు. “మీరు తప్పు చేయలేదని బలంగా అనిపించినప్పుడు క్షమించమని అడిగితే తప్పును ఒప్పుకున్నట్లు అవుతుంది” అని సాగర్‌ అంటున్నాడు.

పెరిగిన విధానం. బహుశా చిన్నప్పటి నుండి మీ ఇంట్లో ఎవరు సారీ చెప్పుకునేవాళ్లు కాదేమో. దానివల్ల చేసిన తప్పులను ఒప్పుకోవడం మీరు నేర్చుకోకపోయి ఉండవచ్చు. చిన్నప్పుడు నేర్చుకోలేదు కాబట్టి, ఇప్పుడు పెద్దయ్యాక మనస్ఫూర్తిగా సారీ చెప్పే అలవాటు మీకు ఉండకపోవచ్చు.

ఏమి చేయవచ్చు

బకెట్లతో నీళ్లు పోస్తూ మంటలను ఆర్పుతున్న భార్యాభర్త

క్షమాపణ, మంటల్లా రగులుతున్న గొడవల్ని ఆర్పేస్తుంది.

మీ భార్య/భర్త గురించి ఆలోచించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి క్షమించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడిగినప్పుడు మీకు కాస్త ఊరటగా ఉంటుంది. మీరు కూడా క్షమించమని అడిగినప్పుడు మీ భార్య/భర్తకు అలానే అనిపిస్తుంది. మీ తప్పు లేదని మీకు అనిపించినా, మీ మాటల వల్ల లేదా మీరు చేసిన పనుల వల్ల బహుశా మీ భార్య/భర్తకు బాధ కలిగి ఉండవచ్చు. కాబట్టి మీరు క్షమించమని అడిగితే మీ భార్య/భర్తకు బాధ తగ్గుతుంది.—మంచి సలహా: లూకా 6:31.

మీ వివాహబంధం గురించి ఆలోచించండి. క్షమించమని అడిగితే ఓడిపోయినట్లు కాదుగానీ మీ మధ్య ఉన్న బంధాన్ని ఇంకా బలపర్చుకున్నట్లని గుర్తుంచుకోండి. ఎందుకంటే, బలమైన పట్టణాన్ని ఓడించడం కన్నా బాధను మనసులో పెట్టుకున్నవాళ్లను శాంతపర్చడం చాలా కష్టమని ఒక గ్రంథం చెప్తుంది. (సామెతలు 18:19) నిజమే, అలాంటి పరిస్థితిలో మళ్లీ ప్రేమగా ఉండడం కష్టమే కాదు, కొన్నిసార్లు అసాధ్యం కూడా. కానీ, మీరు సారీ చెప్తే మీ మధ్య దూరం పెరగకుండా చూసుకున్నట్లు అవుతుంది. అంటే మీరు మీకంటే మీ వివాహ బంధానికి ఎక్కువ విలువిస్తున్నారు.—మంచి సలహా: ఫిలిప్పీయులు 2:3.

క్షమించమని అడగడానికి ఆలస్యం చేయకండి. నిజమే, తప్పు పూర్తిగా మీది కానప్పుడు క్షమించమని అడగడం కష్టమే. కానీ, తప్పు అవతలి వాళ్లదైనంత మాత్రాన మీరు ఇష్టమొచ్చినట్లు ఉండాలనేమీ లేదు. సమయం గడుస్తుండగా మర్చిపోతారులే అనుకుని సారీ చెప్పకుండా ఉండకండి. మీరు క్షమించమని అడిగితే మీ భార్య/భర్త కూడా సారీ చెప్పడానికి ముందుకు వస్తారు. క్షమాపణ అడుగుతూ ఉంటే మెల్లమెల్లగా అలా అడగడం మీకు కష్టం అనిపించదు.—మంచి సలహా: మత్తయి 5:25.

మీ మాటల్లో చూపించండి. సమర్థించుకున్నట్లు మాట్లాడితే క్షమాపణ అడిగినట్లు కాదు. కొంచెం వెటకారంగా “నువ్వు ఇంత బాధపడతావని నేను అనుకోలేదే” అని అంటే అసలు అది క్షమాపణే కాదు. మీరు చేసిన దాన్ని ఒప్పుకోండి, మీ భార్య/భర్తకు కలిగిన బాధ అర్థం చేసుకోండి. చెప్పాల్సిన అవసరం లేదని మీకు అనిపించినా సారీ చెప్పండి.

నిజాలు ఒప్పుకోండి. మీరూ తప్పులు చేస్తారని వినయంగా ఒప్పుకోండి. మనందరం తప్పులు చేస్తాం. మీ తప్పేమీ లేదని మీకు అనిపించినా, మీరు కేవలం మీ వైపు నుండి మాత్రమే ఆలోచిస్తుండవచ్చు, పూర్తి వివరాలు మీకు తెలియకపోవచ్చు. “వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును” అని దేవుని వాక్యంలో ఉంది. (సామెతలు 18:17) మీ గురించి, మీ లోపాల గురించి మీకు పూర్తిగా తెలిసుంటే సారీ చెప్పడం మీకు కష్టంగా ఉండదు. ◼ (g15-E 09)

a కొన్ని పేర్లను మార్చాం.

ముఖ్యమైన మాటలు

  • “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.”—లూకా 6:31.

  • ‘వినయమైన మనస్సుగలవారై ఒకనినొకడు తనకంటె యోగ్యుడని ఎంచండి.’ —ఫిలిప్పీయులు 2:3.

  • “త్వరగా . . . సమాధానపడుము.” —మత్తయి 5:25.

జేస, అలెగ్జాడ్రా

జేసన్‌, అలెగ్జాండ్రా

‘పెద్దపెద్ద ఆటంకాలున్న దారిలో ముందుకు వెళ్లని ప్రయాణంలా ఉన్న మీ వివాహ జీవితాన్ని, “క్షమించు” అనే మాట చిన్న ఆటంకాలతో ముందుకు సాగే ప్రయాణంలా మారుస్తుంది. క్షమించమని అడిగినప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూపించుకునే అవకాశం మీకు దొరుకుతుంది.’

క, జూలియా

కయ్‌, జూలియా

“క్షమాపణ ఉద్దేశం మళ్లీ శాంతి, సంతోషాలు తీసుకురావడమే కానీ ఎవరిది తప్పు, ఎవరిది కాదు అని చెప్పడం కాదు. మీ భార్య/భర్త దేనివల్లనైనా బాధపడితే, వాళ్ల బాధను తగ్గించడానికి మీరు చేయగలిగినదంతా చేయండి.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి