కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g17 No. 1 పేజీలు 4-6
  • మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
  • తేజరిల్లు!—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చెడు నుండి వచ్చాయి
  • మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?
    యువత అడిగే ప్రశ్నలు
  • చెడ్డదూతలతో పోరాడడానికి యెహోవా సహాయం తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • దుష్టాత్మలను ఎదిరించండి
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • మంత్రతంత్రాలు ఎందుకు తప్పు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
తేజరిల్లు!—2017
g17 No. 1 పేజీలు 4-6
దయ్యాల సినిమాల కోసం ఒక జంట టీ.వీలో ఎడ్వర్టైస్మెంట్‌లు చూస్తున్నారు

టీవీల్లో, సినిమాల్లో, మిగతా ప్రసార మాధ్యమాల్లో దయ్యాల కథలను, పాత్రలను చాలా ఆకర్షణీయంగా చూపిస్తున్నారు కానీ వాటివల్ల వచ్చే ప్రమాదాలు మనకు తెలిసి ఉండాలి

పత్రిక ముఖ్యాంశం | దయ్యాల వెనుక ఎవరు ఉన్నారు?

మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?

దయ్యాలను, మానవాతీత శక్తులను, మంత్రవిద్యకు సంబంధించిన వేటినైనా చాలామంది సందేహిస్తారు లేదా నమ్మరు, అలాంటి వాటిని కల్పితాలుగా లేదా సినిమా రచయితలు ఆసక్తికరంగా రాసిన కథలుగా చూస్తారు. కానీ బైబిల్‌ మాత్రం అలా చూడట్లేదు. చాలా ఖచ్చితంగా, స్పష్టంగా బైబిల్‌ వీటి గురించి హెచ్చరిస్తుంది. ఉదాహరణకు, ద్వితీయోపదేశకాండము 18:10-13⁠లో, “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.” ఎందుకని? బైబిల్లో ఇంకా ఇలా ఉంది: “వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. . . . నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.”

బైబిల్‌ అన్నిరకాల మాయమంత్రాలను ఎందుకు బలంగా ఖండిస్తుంది?

చెడు నుండి వచ్చాయి

దేవుడు భూమిని చేయడానికి చాలాకాలం క్రితమే ఆయన ఎన్నో కోట్ల ఆత్మ ప్రాణుల్ని లేదా దేవదూతల్ని చేశాడు. (యోబు 38:4, 7; ప్రకటన 5:11) ఈ దూతల్లో ప్రతి ఒక్కరికి దేవుడు స్వేచ్ఛగా నిర్ణయించుకునే హృదయాన్ని ఇచ్చాడు. అంటే మంచి చేయాలో చెడు చేయాలో నిర్ణయించుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ వాళ్లలో కొంతమంది దేవునికి ఎదురు తిరగాలని నిర్ణయించుకున్నారు. భూమి మీద సమస్యలు సృష్టించడానికి పరలోకంలో వాళ్లకున్న స్థానాన్ని వదిలేసి వచ్చారు. దాని ఫలితంగా భూమి అంతా ‘బలాత్కారముతో నిండిపోయింది.’—ఆదికాండము 6:2-5, 11; యూదా 6.

ఆ చెడ్డ దూతలు చాలా ప్రభావాన్ని చూపిస్తూ లక్షలమందిని తప్పుదారి పట్టిస్తున్నారని బైబిల్‌ చెప్తుంది. (ప్రకటన 12:9) భవిష్యత్తును తెలుసుకోవాలని మనుషుల్లో సహజంగా ఉండే కోరికను కూడా ఈ మానవాతీత శక్తులు బాగా వాడుకుంటారు.—1 సమూయేలు 28:5, 7; 1 తిమోతి 4:1.

కొన్ని మానవాతీత శక్తులు లేదా చెడ్డ దూతలు మనుషులకు సహాయం చేస్తున్నట్లు అనిపించవచ్చు. (2 కొరింథీయులు 11:14) కానీ నిజానికి ఆ చెడ్డ దూతలు దేవుని గురించిన సత్యాన్ని మనుషులకు తెలీకుండా వాళ్ల మనసులకు గుడ్డితనం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.—2 కొరింథీయులు 4:4.

ఒకామె దయ్యాల పుస్తకాన్ని చదువుతుంది

“టీనేజ్‌ అమ్మాయిలకు మంత్రతంత్రాల మీద నమ్మకం పెరగడానికి కారణం ఈ మధ్యకాలంలో టీవీల్లో, సినిమాల్లో, పుస్తకాల్లో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే మాంత్రికురాళ్లు అయ్యి ఉండవచ్చు.”—గాలప్‌ యూత్‌ సర్వే, 2014

కాబట్టి బైబిల్‌ ప్రకారం దయ్యాలతో సంబంధాలు పెట్టుకోవడం ఎలాంటి ప్రమాదం లేని ఒక సరదా కాదు. అందుకే యేసు శిష్యులు అవ్వాలనుకున్న కొంతమంది అలాంటి పనులు గురించి నిజాన్ని తెలుసుకున్నప్పుడు చాలా డబ్బు నష్టపోయినా, మంత్రతంత్రాలకు సంబంధించిన “తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అందరిముందు వాటిని కాల్చేశారు.”—అపొస్తలుల కార్యాలు 19:19.

ఇప్పుడు కూడా చాలామంది దయ్యాలకు సంబంధించిన వినోదంతో, పనులతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఉదాహరణకు షుభాంగిa 12 సంవత్సరాలు వయసు నుండి జరగబోయే కొన్ని విషయాలను లేదా ప్రమాదాలను కనిపెట్టగలిగేది. టారొ కార్డులు లేదా జ్యోతిష్యం కార్డులను స్కూల్లో ఫ్రెండ్స్‌కు చదివి చెప్పేది. ఆమె చెప్పినవి జరిగేవి కాబట్టి మాయమంత్రాల మీద ఆమెకు ఇంకా ఆసక్తి పెరిగింది.

దేవుడే తనకు ఈ వరాన్ని ఇచ్చాడని, దానివల్ల ప్రజలకు సహాయం చేయగలుగుతుందని షుభాంగి అనుకుంది. “కానీ, నన్ను ఒక విషయం ఇబ్బంది పెట్టేది” అని ఆమె చెప్పింది. “వేరేవాళ్లకోసం టారొ కార్డులు చదివి చెప్పగలిగేదాన్ని. కానీ నా భవిష్యత్తు తెలుసుకోవాలని ఉన్నా, నా గురించి నేను చదవగలిగే దాన్ని కాదు.”

అర్థం కాని ఎన్నో ప్రశ్నలతో షుభాంగి దేవునికి ప్రార్థన చేసింది. ఆ తర్వాత యెహోవాసాక్షులు ఆమెను కలిసి బైబిల్‌ గురించి నేర్పించడం మొదలుపెట్టారు. భవిష్యత్తు గురించి తెలుసుకునే శక్తి తనకు దేవుని నుండి రాలేదని షుభాంగి తెలుసుకుంది. అంతేకాదు దేవునికి దగ్గరవ్వాలనుకునే వాళ్లు మంత్రాలకు, దయ్యాల సంబంధమైన అన్ని వస్తువులకు దూరంగా ఉండాలని నేర్చుకుంది. (1 కొరింథీయులు 10:21) ఫలితంగా మాయమంత్రాలకు సంబంధించి ఆమె దగ్గరున్న వస్తువులు పుస్తకాలన్నిటిని పడేసింది. ఇప్పుడు ఆమె బైబిల్‌ నుండి నేర్చుకున్న ఖచ్చితమైన నిజాలను వేరేవాళ్లకు చెప్తుంది.

కౌషిక్‌ టీనేజ్‌లో ఉన్నప్పుడు మానవాతీత శక్తుల గురించిన నవల్లు బాగా చదివేవాడు. “నా వయసులో ఉండి, కల్పిత లోకాలను సంచరించే హీరోలతో నన్ను నేను పోల్చుకుంటూ, వాళ్లలా ఊహించుకుంటూ ఆనందించే వాడిని” అని చెప్పాడు. మెల్లమెల్లగా కౌషిక్‌కు మ్యాజిక్‌, సాతాను ఆచారాలకు సంబంధించిన పుస్తకాలను చదవడం అలవాటైంది. “ఎక్కువ తెలుసుకోవాలనే కుతూహలంతో, ఇలాంటి అంశాలతో ఉన్న పుస్తకాలు చదవాలని, సినిమాలు చూడాలని నాకు బాగా అనిపించేది” అని కౌషిక్‌ అంటున్నాడు.

కానీ కౌషిక్‌ బైబిల్ని నేర్చుకోవడం వల్ల తను ఏమి చదువుతున్నాడనే విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించాలని గ్రహించాడు. “దయ్యాలతో ముడిపడి ఉన్న ప్రతీ వస్తువు గురించి ఒక లిస్టు తయారు చేసుకుని వాటన్నిటిని వదిలించుకున్నాను” అని చెప్పాడు. “నేను ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. బైబిల్లో 1 కొరింథీయులు 10:31⁠లో ఉన్నట్లు, ‘అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా’ చేయాలి. ఇప్పుడు నన్ను నేను ఇలా ప్రశ్నించుకుంటాను, నేను ఈ సమాచారం చదవడం వల్ల దేవుని మహిమను పాడుచేసే దేన్నైనా చేస్తున్నానా? అలా అయితే వాటిని ఆపేయాలి.”

ఒకామె www.pr2711.com వెబ్‌సైట్‌ చూస్తుంది

బైబిల్ని దీపమని వర్ణించడంలో మంచి అర్థం ఉంది. మంత్రతంత్రాల్లో ఉన్న అబద్ధాన్ని బయటపెట్టే ఒకే ఒక్క మార్గం బైబిలు. (కీర్తన 119:105) అంతేకాదు బైబిల్లో చెడ్డ దూతలు లేని ఒక లోకం గురించిన అద్భుతమైన వాగ్దానం కూడా ఉంది. దాని వల్ల మనుషులందరిమీద ఎంతో ప్రభావం ఉంటుంది. కీర్తన 37:10, 11⁠లో ఇలా ఉంది, “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”

a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.

మంత్రవిద్య అంటే ఏంటి?

మంత్ర విద్య అంటే జ్యోతిష్యం, రాశి ఫలాలు, మాయమంత్రాలు లాంటి వాటి మీద ఉండే ఆసక్తి. ప్రపంచంలో చాలా చోట్ల ప్రజలు మాంత్రికుల ద్వారా లేదా భూతవైద్యుల ద్వారా దయ్యాలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. చాలామంది సోదె లేదా జ్యోతిష్యం ద్వారా ఏమి జరగబోతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్లు నక్షత్రాల్ని, శకునాల్ని, స్పటిక గోళాల్ని లేదా అరచేతిని చూస్తుంటారు.

దయ్యాలను, మంత్రాలను ఏ ప్రమాదం లేదన్నట్లుగా, ఆకర్షణీయంగా పుస్తకాలు, పత్రికలు, సినిమాలు చూపిస్తున్నాయి. కొంతమంది కమ్యూనికేషన్‌ నిపుణులు అనుకునేదేంటంటే, టీవీ కార్యక్రమాల్లో సినిమాల్లో, దయ్యాలను చూపించే విధానం వల్లే చాలామందికి వాటిమీద నమ్మకం పెరుగుతుంది.

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?

మీరు బైబిలు నిజంగా ఏమి బోధిస్తుంది? అనే పుస్తకంలో 10వ అధ్యాయంలో వీటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు. దీనిని www.pr2711.com/te వెబ్‌సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు లేదా ఈ కోడ్‌ స్కాన్‌ చేసుకోవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి