కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 3 పేజీలు 6-7
  • సహానుభూతి చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహానుభూతి చూపించండి
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్య
  • బైబిలు సలహా
  • సహానుభూతి చూపించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
  • మీరేం చేయవచ్చు?
  • తదనుభూతి దయా కనికరాలు చూపించడానికి కీలకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • సహానుభూతి చూపించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • దేవునికి తదనుభూతి లేదా సానుభూతి ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • కుటుంబ జీవితం, స్నేహం
    తేజరిల్లు!—2019
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 3 పేజీలు 6-7
ఒక యూరప్‌ దేశస్థుడు, ఒక సిఖ్‌ వ్యక్తి విమానంలో పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు.

సహానుభూతి చూపించండి

సమస్య

మనకు, వేరేవాళ్లకు మధ్య ఉన్న తేడాల మీదే మనసుపెడితే, ఆ తేడాల్ని వాళ్ల తప్పులుగా లేదా లోపాలుగా చూసే ప్రమాదం ఉంది. దానివల్ల మనకు భిన్నంగా ఉన్నవాళ్లను చిన్నచూపు చూసే అవకాశం ఉంది. ఎదుటివాళ్ల మీద అలాంటి తప్పుడు అభిప్రాయం ఏర్పడితే, మనకు వాళ్ల మీద సహానుభూతి చూపించడం కష్టమౌతుంది. సహానుభూతి చూపించలేక పోతున్నామంటే మనలో వివక్ష అనే జబ్బు ఉన్నట్టే.

బైబిలు సలహా

“సంతోషించేవాళ్లతో సంతోషించండి; ఏడ్చేవాళ్లతో ఏడ్వండి.”—రోమీయులు 12:15.

అంటే . . . ఒక్కమాటలో చెప్పాలంటే, సహానుభూతి చూపించాలి. మనల్ని వేరేవాళ్ల స్థానంలో ఊహించుకుని వాళ్ల బాధను మన బాధలా, వాళ్ల సంతోషాన్ని మన సంతోషంలా భావించడమే సహానుభూతి.

సహానుభూతి చూపించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

మనం ఎవరి మీదైనా సహానుభూతి చూపించినప్పుడు వాళ్లూ మనలాంటి వాళ్లే అని గుర్తిస్తాం. వాళ్లకూ మనలాంటి భావాలే ఉన్నాయని, వాళ్లూ మనలాగే స్పందిస్తారని అర్థం చేసుకుంటాం. ఏ నేపథ్యం వాళ్లయినా సరే, మనుషులంతా ఒకే కుటుంబమని గుర్తించేలా సహానుభూతి సహాయం చేస్తుంది. వాళ్లు ఏయే విషయాల్లో మనలా ఉన్నారో ఆలోచించినప్పుడు వాళ్ల మీద మనకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

అంతేకాదు సహానుభూతి ఉంటే వేరేవాళ్లను గౌరవిస్తాం. సెనెగల్‌ దేశానికి చెందిన ఆన్‌-మేరీ ఒకప్పుడు, తక్కువ కులం వాళ్లను చిన్నచూపు చూసేది. అయితే సహానుభూతి అనే లక్షణం తనకెలా సహాయం చేసిందో ఆమె వివరిస్తోంది: “వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసి, వాళ్ల స్థానంలో ఉంటే నాకెలా అనిపిస్తుందో ఊహించుకున్నాను. అసలు నేను ఏవిధంగా వాళ్లకన్నా గొప్ప, వాళ్లు ఏవిధంగా నాకన్నా తక్కువ అని ఆలోచించాను. ఈ కులం నేను ఎంచుకున్నదీ కాదు, ఈ హోదా నేను సంపాదించుకున్నదీ కాదు.” అవును, వేరేవాళ్ల కష్టాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వాళ్లను విమర్శించే బదులు సహానుభూతి చూపిస్తాం.

మీరేం చేయవచ్చు?

ఏదైనా ఒక వర్గం వాళ్ల మీద మీకు చెడు అభిప్రాయం ఉంటే, వాళ్లు ఏ విషయాల్లో మీలా లేరో ఆలోచించే బదులు వాళ్లు ఏ విషయాల్లో మీలా ఉన్నారో ఆలోచించండి. ఉదాహరణకు, ఈ సందర్భాల్లో వాళ్లకెలా అనిపిస్తుందో ఊహించండి:

సహానుభూతి ఉంటే మనుషులంతా ఒకే కుటుంబమని గుర్తిస్తాం

  • కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు

  • రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత

  • స్నేహితులతో సమయం గడుపుతున్నప్పుడు

  • ఇష్టమైన పాటలు వింటున్నప్పుడు

తర్వాత, వాళ్ల స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. ఈ ప్రశ్నలు వేసుకోండి:

  • ‘ఎవరైనా నన్ను చిన్నచూపు చూస్తే నాకెలా అనిపిస్తుంది?’

  • ‘వేరేవాళ్లు నా గురించి తెలుసుకోకుండానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తే నాకెలా ఉంటుంది?’

  • ‘నేనూ ఆ వర్గం వాడినే అయితే, ఇతరులు నాతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటాను?’

ఆ యూరప్‌ దేశస్థుడు, సిఖ్‌ వ్యక్తి, వాళ్లిద్దరూ ఒకేలా ఉన్న విషయాల్ని అంటే కుటుంబం, నచ్చిన ఆటలు, ఉద్యోగం వంటి వాటికి సంబంధించిన ఫోటోల్ని పంచుకుంటున్నారు.

నిజ జీవిత అనుభవం: రాబర్ట్‌ (సింగపూర్‌)

“వినికిడి లోపం ఉన్నవాళ్లు అదోలా ఉంటారని, వాళ్లకు అంత తెలివి ఉండదని, ప్రతీ చిన్నదానికి నొచ్చుకుంటారని అనుకునేవాన్ని. కాబట్టి వాళ్లను దూరం పెట్టేవాన్ని. అయితే, నేను వివక్ష చూపిస్తున్నట్టు నాకు తెలీదు.”

“వినికిడి లోపం ఉన్నవాళ్ల మీద సహానుభూతి చూపించడం వల్ల నేను వివక్షను తీసేసుకోగలిగాను. ఉదాహరణకు, నేను వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్లు ఏమీ అర్థంకానట్టు ముఖం పెట్టేవాళ్లు, కాబట్టి వాళ్లకంత తెలివితేటలు ఉండవని అనుకున్నాను. అయితే ఎవరైనా చెప్పేది నాకు వినిపించకపోతే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. నేను కూడా ఏమీ అర్థంకానట్టు ముఖం పెడతాను! ఒకవేళ చెవిటి మిషన్‌ పెట్టుకున్నా, ఎదుటివాళ్లు చెప్పేది అర్థంచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు నా ముఖం కనిపిస్తుంది, కానీ నిజానికి నేను ఇబ్బందిపడేది వినడానికి.”

“వినికిడి లోపం ఉన్నవాళ్ల స్థానంలో నన్ను నేను ఊహించుకున్నప్పుడు, నాలో ఉన్న వివక్ష మాయమైపోయింది.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి