కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g22 No. 1 పేజీలు 4-6
  • 1 | ఆరోగ్యం కాపాడుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1 | ఆరోగ్యం కాపాడుకోండి
  • తేజరిల్లు!—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకో తెలుసా?
  • మీకు తెలుసా?
  • ఇప్పుడు ఏం చేయాలి?
  • పత్రిక ముఖ్యాంశం|మంచి ఆరోగ్యానికి—5 జాగ్రత్తలు
    తేజరిల్లు!—2015
  • హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?
    అదనపు అంశాలు
  • మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చంటే
    తేజరిల్లు!—1999
  • మీ విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
తేజరిల్లు!—2022
g22 No. 1 పేజీలు 4-6
ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల ఆహారపదార్థాలు టేబుల్‌ మీద ఉన్నాయి.

ప్రపంచమంతా గందరగోళం

1 | ఆరోగ్యం కాపాడుకోండి

ఎందుకో తెలుసా?

సాధారణంగా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, అది ఏదోకవిధంగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.

  • సమస్యలు వచ్చినప్పుడు చాలా టెన్షన్‌ పడతాం, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఎక్కువకాలం అలానే ఉంటే, ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా అంతే ఎక్కువుంటుంది.

  • విపత్తులు జరిగినప్పుడు, తీవ్రమైన అంటువ్యాధులు వ్యాపించినప్పుడు చికిత్స ఎక్కువమందికి అవసరమౌతుంది. హాస్పిటల్‌లు నిండిపోతాయి, మందులు అందరికీ దొరకకపోవచ్చు.

  • పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి; సరుకులు, మందులు కొనుక్కోవడం కూడా కష్టంగా మారుతుంది.

మీకు తెలుసా?

  • ఒంట్లో బాలేనప్పుడు, మానసికంగా ఎక్కువ ఒత్తిడి (mental stress) అనిపించినప్పుడు సరిగ్గా ఆలోచించలేం. దానివల్ల ఎప్పుడుపడితే అప్పుడు నిద్రలేస్తాం; ఐతే మరీ ఎక్కువ తినేస్తాం లేదా సరిగ్గా తినం. అప్పుడు ఆరోగ్యం ఇంకా పాడౌతుంది.

  • ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే జబ్బు ఇంకా పెద్దది అవ్వచ్చు, ప్రాణం మీదికి రావచ్చు.

  • మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోనప్పుడు అంతబాగా ఆలోచించగలుగుతారు; మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

  • ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు బాగా డబ్బు ఉండాల్సిన అవసరంలేదు. మీ స్తోమత ఏదైనా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలి?

సాధ్యమైతే, తెలివైనవాళ్లు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ముందుజాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యానికి కూడా ఇదే వర్తిస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభమని పెద్దలు అంటారు. అందుకే, ముందునుండే పరిశుభ్రంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే, జబ్బులు ఎక్కువ రాకుండా ఉంటాయి. వచ్చినా వాటి తీవ్రత తక్కువగా ఉంటుంది.

“మనల్ని, మన ఇంటిని, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డాక్టర్లకు, మందులకు అయ్యే ఖర్చు మిగులుతుంది.”—ఆనంద్‌.a

a కొన్ని పేర్లు మార్చాం.

సురక్షితంగా జీవించడం ఎలా?—చక్కని చిట్కాలు

ప్రపంచంలో పరిస్థితులు బాలేనప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి

శుభ్రంగా ఉండండి

ఒకతను బయటికెళ్లినప్పుడు తన చేతుల్ని సబ్బుతో కడుకుంటున్నాడు.

శుభ్రంగా ఉండండి

బైబిలు ఇలా చెప్తుంది: “వివేకం గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు.” (సామెతలు 22:3) కాబట్టి మీ ఆరోగ్యాన్ని పాడు చేసేవేంటో ముందే గుర్తించి, వాటికి దూరంగా ఉండండి.

  • ఎప్పటికప్పుడు మీ చేతుల్ని సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. ఏదైనా తినేముందు, టాయిలెట్‌కు వెళ్లొచ్చిన తర్వాత చేతుల్ని కడుక్కోవడం మర్చిపోకండి.

  • మీ ఇంటిని క్లీన్‌గా ఉంచుకోండి. ముఖ్యంగా, అందరూ ముట్టుకునే వస్తువుల మీద క్రిములు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అవి పోయేలా తుడవండి.

  • సాధ్యమైతే, అంటువ్యాధి సోకినవాళ్లకు కాస్త దూరంగా ఉండండి.

మంచి ఆహారం తినండి

ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల ఆహారపదార్థాలు టేబుల్‌ మీద ఉన్నాయి.

మంచి ఆహారం తినండి

బైబిలు ఇలా చెప్తుంది: “ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు.” (ఎఫెసీయులు 5:29) మన ఆరోగ్యం మీద మనకు శ్రద్ధవుంటే ఏదిపడితే అది తినకుండా, తాగకుండా ఉంటాం; సిగరెట్లు, డ్రగ్స్‌ లాంటి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంటాం.

  • నీళ్లు ఎక్కువ తాగండి.

  • రకరకాల పండ్లు, కూరగాయలు తినండి.

  • కొవ్వు పదార్థాలు, ఉప్పు, షుగర్‌ తగ్గించండి.

  • సిగరెట్లు, డ్రగ్స్‌ జోలికి పోకండి. మద్యం అతిగా తాగకండి.

“ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేనూ, నా భార్య మంచి ఆహారాన్ని తీసుకుంటాం. లేకపోతే, వచ్చే జీతం కాస్తా మందులకే ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బునేదో, ఆరోగ్యానికి మంచి చేసేవాటిని కొనుక్కోవడానికి వాడితే బెటర్‌ కదా అనుకుంటాం.”—కార్తిక్‌.

ఎక్సర్‌సైజ్‌ చేయండి, కంటినిండా నిద్రపోండి

ఒకతను మట్టి రోడ్డులో జాగింగ్‌ చేస్తున్నాడు.

ఎక్సర్‌సైజ్‌ చేయండి

బైబిలు ఇలా చెప్తుంది: “రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాస ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు.” (ప్రసంగి 4:6) కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో, కంటినిండా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.

  • రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయండి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే, ముందు వాకింగ్‌తో మొదలుపెట్టండి. ముసలివాళ్లు, అంగవైకల్యం ఉన్నవాళ్లు, పెద్దపెద్ద అనారోగ్యాలు ఉన్నవాళ్లు కూడా ఎక్సర్‌సైజ్‌ చేయవచ్చు. దానివల్ల ఆరోగ్యం మెరుగౌతుంది.

  • ఒక యువతి నిద్రపోతోంది.

    కంటినిండా నిద్రపోండి

    కంటినిండా నిద్రపోండి. సరిగ్గా నిద్రపోయే అలవాటు లేకపోతే ఒత్తిడి (stress) పెరుగుతుంది, చేసేపని మీద మనసుపెట్టలేరు. అదే అలవాటు ఎక్కువకాలం కొనసాగితే, పెద్దపెద్ద జబ్బులు కూడా వస్తాయి.

  • పడుకోవడానికి ఒక టైం పెట్టుకుని, ప్రతీరోజు ఆ టైం కల్లా పనులన్నీ ముగించుకోండి. రోజూ ఒకే టైంకు పడుకుని, లేవడానికి ప్రయత్నించండి.

  • బెడ్‌ మీద పడుకున్నాక టీవీ, ఫోన్‌ లాంటివి చూడకండి.

  • కడుపునిండా తిని వెంటనే పడుకోకండి. నిద్రపోయే ముందు కాఫీ, మద్యం లాంటివి తాగకండి.

“ఎంతసేపు నిద్రపోతున్నాను అనే దాన్నిబట్టి నా ఆరోగ్యం ఉంటుందని నాకు తెలుసు. నేను సరిగ్గా నిద్రపోకపోతే, కొన్నిసార్లు తలనొప్పిగా, నీరసంగా అనిపిస్తుంది. అదే కంటినిండా నిద్రపోతే, వెయ్యి ఏనుగుల బలమున్నట్టు అనిపిస్తుంది, అంతేకాదు ఎప్పుడో గానీ జబ్బుపడను.”—జావెద్‌.

“వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు” వీడియోలోని ఒక సన్నివేశం. ఒకావిడ తన ఇంటి మెయిన్‌ డోర్‌ తెరిచి వైరస్‌ను లోపలికి ఆహ్వానిస్తోంది.

ఎక్కువ తెలుసుకోండి. వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియో చూడండి. అలాగే, “మంచి ఆరోగ్యం కోసం . . . ” అనే ఆర్టికల్‌ కూడా చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి