కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • uw అధ్యా. 8 పేజీలు 62-69
  • ‘దురాత్మల సమూహములకు వ్యతిరేకంగా పోరాడుట’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘దురాత్మల సమూహములకు వ్యతిరేకంగా పోరాడుట’
  • అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆకాశమండలమందలి లోకపాలకులు
  • దుష్టుని కపట పన్నాగాలు
  • జయించుటకు సంసిద్ధులగుట
  • ‘దురాత్మల సమూహాలతో పోరాటం’
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
  • దయ్యాలను మనమెలా ఎదిరించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ‘ప్రభువునందు బలవంతులై యుండుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • అపవాదిని, అతడి కుతంత్రాలను ఎదిరించండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
uw అధ్యా. 8 పేజీలు 62-69

అధ్యాయం 8

‘దురాత్మల సమూహములకు వ్యతిరేకంగా పోరాడుట’

1. దురాత్మల క్రియలు మనకెందుకు ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఉన్నాయి?

భౌతికవాదాన్ని నమ్మే ప్రజలు దురాత్మలనే తలంపును అపహసించవచ్చు. అయితే ఇది నవ్విపారేసే విషయం కాదు. వారు నమ్మినా, నమ్మకపోయినా ప్రతివారిపై దయ్యాల క్రియల ఒత్తిడి పడుతూనేవుంది. యెహోవా ఆరాధికులు ఇందు మినహాయింపబడలేదు. నిజం చెప్పాలంటే వారు ప్రాథమిక గురిగా ఉన్నారు. ఈ పోరాటాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తూ, ఇలా చెబుతున్నాడు: “మనము పోరాడునది శరీరులతో [రక్తమాంసములుగలవారితో] కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫె. 6:12) సాతాను పరలోకమునుండి పడద్రోయబడి, తనకిక కొంచెమే సమయమున్నదని ఎరిగినవాడై బహుకోపియై ఉన్నందున, మనకాలమందు ఈ ఒత్తిడి క్రితమెన్నటికంటే మరెంతో ఎక్కువగా పెరిగిపోయింది.—ప్రక. 12:12.

2. మానవాతీత శక్తులతో విజయవంతముగా పోరాడుట మనకెలా సాధ్యమౌతుంది?

2 ఈ మానవాతీత ఆత్మీయ శక్తులతోగల పోరాటమందు మనలో ఎవరైనా ఎట్లు గెలువగలరు? కేవలం యెహోవాపై పూర్తిగా ఆధారపడుట ద్వారానే. మనమాయన మాటవిని ఆయన వాక్యానికి లోబడాలి. అలాచేయుట ద్వారా మనం సాతాను అధీనమందున్న వారనుభవించే భౌతిక, నైతిక, భావోద్రేక, మానసిక నష్టాలనుండి తప్పించుకోగలము.—ఎఫె. 6:11; యాకో. 4:7.

ఆకాశమండలమందలి లోకపాలకులు

3. దేనిని మరియు ఎవరిని సాతాను తీవ్రంగా ఎదిరిస్తున్నాడు?

3 పరలోకమందలి తన మహా ఉన్నత స్థానాన్నుండి ప్రపంచ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న యెహోవా మనకు దానిని విశదపరస్తున్నాడు. సా.శ. 1914 లో పరలోకమందు దేవుని మెస్సీయ రాజ్యం పుట్టినవెంటనే సాధ్యమైతే మ్రింగజూసిన “యెఱ్ఱని మహాఘటసర్పము” అని సాతానును వర్ణించిన ఒక దర్శనాన్ని ఆయన అపొస్తలుడైన యోహానుకు ఇచ్చాడు. అలాచేయడంలో విఫలుడైన సాతాను, దేవుని “స్త్రీ” రెండవశ్రేణి సంతానమగు ఆ రాజ్యంయొక్క దృశ్య ప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకతను ప్రబలింపజేసాడు.—ప్రక. 12:3, 4, 13, 17.

4. (ఎ) మానవ ప్రభుత్వాల అధికారమూలాన్ని గూర్చిన ఏ వాస్తవం విషయంలో బైబిలు మనల్ని అప్రమత్తుల్నిజేస్తుంది? (బి) రాజకీయ పాలకులందరు ఇప్పుడు దేనికి సమకూర్చబడుతున్నారు, ఎవరి ద్వారా?

4 యోహానుకిచ్చిన ఆ ప్రకటనలో మానవ ప్రభుత్వాలకివ్వబడిన శక్తి, అధికారముల మూలము కూడ బట్టబయలు చేయబడింది. “ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడు వారిమీదను ప్రతి జనము మీదను అధికారము” ఇవ్వబడిన 7 తలలు 10 కొమ్ములుగల సంయుక్త క్రూరమృగం ఆయనకు చూపబడింది. ఇది కేవలం ఒక ప్రభుత్వాన్ని కాదుగాని భూవ్యాప్త రాజకీయ విధానాన్ని సూచిస్తున్నది. “దానికి [క్రూరమృగానికి] ఆ ఘటసర్పము [అపవాదియగు సాతాను] తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను” అని యోహానుకు తెల్పబడింది. (ప్రక. 13:1, 2, 7; లూకా 4:5, 6 పోల్చండి.) రాజకీయ పాలకులు మతాన్నిగూర్చి ఏమి చెప్పుకొన్ననూ, “క్రూరమృగము” యొక్క సభ్యదేశాలు ఏవీకూడ సర్వాధిపతియగు యెహోవాకు, ఆయన నియమించిన రాజగు యేసుక్రీస్తుకు లోబడుట లేదు. వారందరు తమ సర్వాధిపత్యాన్ని నిలుపుకోవడానికే పోరాడుతున్నారు. ప్రకటన చూపునట్లుగా నేడు, ‘దయ్యములు ప్రేరేపించు మాటలు’ వారందరిని “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు” అనగా హార్‌మెగిద్దోనను చోటుకు పోగుచేస్తున్నవి. (ప్రక. 16:13, 14, 16) అవును, అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా, “లోకనాథులు” కేవలం మనుష్యులు కాదుగాని “ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములై” యున్నారు. (ఎఫె. 6:12) యెహోవా సత్యారాధికులుగా నిరూపించుకొను వారందరు దాని విశేషతను సంపూర్ణంగా గ్రహించాలి.

5. సాతాను విధానానికి మద్దతునిచ్చే ప్రమాదాన్ని తప్పించుకొనేలా జాగ్రత్తగా ఉండుట ఎందుకు అవసరము?

5 మానవ కుటుంబాన్ని విచ్ఛిన్నంచేస్తున్న పోరాటాలతో ప్రతిదినం మన జీవితాలు స్పర్శించబడుతున్నాయి. మాటలద్వారా లేదా మరోవిధంగా ప్రజలు తాము భాగంగావున్న దేశం, తెగ, భాషాగుంపు లేదా సామాజిక తరగతి పక్షం వహించడం సర్వసాధారణం. ఏదైనా ప్రస్తుత పోరాటమందు వారి సమాజం ప్రత్యక్షంగా చేరకయున్ననూ, వారు ఏదోక పక్షం వహిస్తుంటారు. అయితే ఫలాని వ్యక్తని లేక కారణమని కాకుండా వారు బలపరచే కోరిక ఏదైనాసరే, నిజానికి వారు దేనికి మద్దతునిస్తున్న వారిగా ఉంటారు? “లోకమంతయు దుష్టునియందున్నదని” బైబిలు తేటగా చెబుతున్నది. (1 యోహా. 5:19) కాబట్టి, మిగతా మానవులతోపాటు మోసగింపబడకుండా ఒకడెలా తప్పించుకొనగలడు? ప్రపంచమందలి ఆయాప్రాంతాల మధ్య జరిగే పోరాటాల్లో సంపూర్ణ తటస్థతను అవలంబిస్తూ దేవుని రాజ్యానికి పూర్తి మద్దతునిచ్చుట ద్వారానే.—యోహా. 17:15, 16.

దుష్టుని కపట పన్నాగాలు

6. సత్యారాధన నుండి ప్రజల్ని త్రిప్పివేయుటకు సాతాను ఉపయోగించే విధానాల్లో ఏమేమి ఇమిడి ఉన్నాయి?

6 చరిత్రలోని అన్ని కాలాల్లో సాతాను ఆయాప్రజల్ని సత్యారాధన నుండి త్రిప్పివేయుటకు మాట మరియు శారీరక హింసను ఉపయోగించాడు. ఆలాగే అతడు మరిన్ని కుతంత్రాల్ని అనగా మోసపూరితమైన కపట పన్నాగాల్ని కూడా ప్రయోగించాడు.

7. అబద్ధమతాన్ని ఉపయోగించుటలో సాతాను తెలివి ఎలా ప్రదర్శితమైంది?

7 అదీ ఒకవేళ కోరుకుంటే, తాము కూడ దేవుని సేవిస్తున్నామని తలంచేటట్లుచేస్తూ అతడు తెలివిగా మానవుల్లోని అధికశాతం మందిని అబద్ధమతం ద్వారా అంధకారంలో ఉంచాడు. సత్యంయెడల నిష్కళంకమైన ప్రేమలేని కారణంగా వారు మర్మం, భావావేశంతో కూడిన మతసేవలచేత ఆకర్షింపబడవచ్చు లేదా అద్భుతక్రియల ప్రభావంచే ముగ్ధులుకావచ్చును. (2 థెస్స. 2:9, 10) అయితే సత్యారాధనలో భాగంవహించిన వారిలో సహితం “కొందరు . . . మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని” మనం హెచ్చరించబడ్డాము. (1 తిమో. 4:1) అదెలా సంభవించగలదు?

8. యెహోవాను ఆరాధించే కొందరిని సహితం సాతాను ఎలా అబద్ధమతంవైపు ఆకర్షింపజేశాడు?

8 అపవాది కపటోపాయంతో ఒకవ్యక్తి బలహీనతల్ని సొమ్ముచేసుకుంటాడు. అతనిపై మనుష్యుల భయం ఇంకా ప్రభావం చూపుతుందా? అట్లయితే, అతడు అబద్ధమత మూలం కలిగిన క్రియల్లో పాల్గొనేటట్లు బంధువులనుండి లేదా పొరుగువారినుండి వచ్చే ఒత్తిడికి లోనౌతాడు. ఆ వ్యక్తికి గర్వంవుందా? అలాంటప్పుడు అతనికెవరైనా సలహాయిస్తే లేదా అతనుచెప్పే ఆలోచనల్ని ఇతరులు అంగీకరించకపోతే దాన్నొక తప్పుగా అతడు తీసుకోవచ్చు. (సామె. 29:25; 15:10; 1 తిమో. 6:3, 4) ప్రాంతీయసేవలో అతడు భాగం వహించడం ప్రేమచే పురికొల్పబడనిదైతే అప్పుడేమి? క్రీస్తు మాదిరి ప్రకారం తన దృక్కోణాన్ని సవరించుకోవడానికి బదులు, కేవలం బైబిలు చదువుతూ “మంచి జీవితం” జీవిస్తేచాలని ‘తన చెవులకింపైన’ మాటలుచెప్పే వారివైపు అతడు మొగ్గుచూపవచ్చు. (2 తిమో. 4:3) అతడు నిజానికి మరో మతగుంపులో చేరుతున్నాడా లేక కేవలం తన మతాన్నే హత్తుకొంటున్నాడా అనేది కాదుగాని, దేవుడు తన వాక్యంద్వారా తన సంస్థద్వారా నడిపిస్తున్న రీతిగా అతడు యెహోవాను ఆరాధించకుండుటే సాతానుకు ముఖ్యం.

9. తన ధ్యేయాల్ని నెరవేర్చడానికి సాతాను కపటోపాయంతో ఎలా లైంగికత్వాన్ని ఉపయోగిస్తాడు?

9 సహజ కోరికల్ని తప్పుడు మార్గాల్లో తీర్చుకోవడానికి కూడ సాతాను కపటోపాయంతో ప్రజల్ని ప్రలోభపెడతాడు. అతడు దీనిని లైంగిక వాంఛల విషయంలో చేశాడు. బైబిలు నైతికత్వాన్ని నిరాకరిస్తూ లోకమందలి అనేకులు అవివాహితుల మధ్య లైంగిక సంబంధాలు న్యాయసమ్మతమేనని లేదా తమనవి పెద్దవారని నిరూపిస్తున్నాయని దృష్టిస్తున్నారు. మరి వివాహితుల మాటేమిటి? వివాహ సమస్యల్ని ఎదుర్కొంటున్న లోకస్థులకు విడాకులు తీసుకోవడం లేదా కేవలం విడిపోవడం, మరో వ్యక్తితో జీవించడం అసాధారణమేమీ కాదు. మనమిలాంటి జీవన విధానాన్ని గమనించినప్పుడు మనమేదో పోగొట్టుకుంటున్నామని, క్రైస్తవ విధానం మరీ కఠినమని భావిస్తామా? మేలైన దానిని యెహోవా అందకుండా చేస్తున్నాడని ఒకవ్యక్తి ఆలోచించేలా సాతాను మోసగిస్తాడు. యెహోవాతో, ఆయన కుమారునితో నిశ్చయంగా మనకుండే సంబంధంపై, ఆలాగే మనపై, ఇతరులపై ఉండగల దీర్ఘకాల ప్రభావాన్ని గూర్చి కాదుగాని, మనం ఇప్పుడే కలిగియుండగల సుఖాన్నిగూర్చి తలంచేటట్లు అతడు మనల్ని బలవంతపెడ్తాడు.—గల. 6:7, 8; 1 కొరిం. 6:9, 10.

10. హింసవైపు మన దృక్పథాన్ని మళ్లించుటకు సాతాను ఏ విధంగా ప్రయత్నిస్తాడు?

10 వినోదం కావాలనేది మరో సహజమైన కోరిక. యోగ్యమైనప్పుడు అది భౌతికంగా, మానసికంగా భావోద్రేకంగా సేదదీర్చేదిగా ఉండగలదు. అయితే మనం విశ్రమించే సందర్భాల్ని సాతాను తెలివిగా మన ఆలోచనల్ని దేవునినుండి దూరం చేయడానికి ఉపయోగించ ప్రయత్నించినప్పుడు మన ప్రతిస్పందన ఎలావుంటుంది? ఉదాహరణకు, హింసను ప్రేమించే వారిని యెహోవా అసహ్యించుకుంటాడని మనకు తెలుసు. (కీర్త. 11:5) అయితే దూరదర్శినిలో లేదా థియేటరులో చూపే సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు వచ్చినప్పుడు మనం వాటిని ఆలాగే చూస్తూ కూర్చుంటామా? లేదా అది క్రీడల పేరిట చూపబడినప్పుడు దాన్ని మనం అంగీకరిస్తూ, అందులో పాల్గొనేవారికి ప్రోత్సాహకరంగా మనం బహుశ కేకలు వేస్తుంటామా?—ఆదికాండము 6:13 పోల్చండి.

11. సత్యం తెలిసిన వ్యక్తి సహితం అభిచారం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏయే విధాలుగా ఉరిలో పడవచ్చు?

11 ఆలాగే ఎలాంటి అభిచారాన్నైనా అంటే సోదెచెప్పుట, మంత్ర ప్రయోగాలు లేదా మృతులతో సంభాషించుటకు ప్రయత్నించుటవంటి వాటిలో పాల్గొనేవారు కూడ “యెహోవాకు హేయము” అని మనకు తెలుసు. కర్ణపిశాచిగల వారిని సంప్రదించడాన్ని గూర్చి మనం ఆలోచించము, మన గృహాల్లో వారి పైశాచిక కళలు అభ్యసించడానికి వారిని మనమాహ్వానించము. అయితే మన దూరదర్శిని తెరపై వారు కన్పిస్తే వారుచెప్పేవి వింటూ, వారు చేసే పనుల్ని ఆసక్తిగా తిలకిస్తామా? మంత్రగాళ్లనుండి ఎట్టి చికిత్సను మనమెన్నటికి అంగీకరించకపోయిననూ, మనకు క్రొత్తగా జన్మించిన శిశువుకు ప్రమాదం వాటిల్లకుండా రక్షిస్తుందనే తలంపుతో ఆ శిశువు ముంజేతికి మనం ఏదైనా ఒక దారంకడతామా? లేదా ‘ఇంద్రజాలాన్ని’ బైబిలు ఖండిస్తుందని తెలిసిన మనం, తాత్కాలికంగానైనా ఒక ఇంద్రజాలికుడు మన మనస్సులను తన అధీనంలో పెట్టుకోవడానికి అనుమతిస్తామా?—ద్వితీ. 18:10-12; గల. 5:19-21.

12. (ఎ) తప్పని మనకు తెలిసిన ఆలోచనల్లో పడిపోయేటట్లు సంగీతం ఎలా ఉపయోగించబడుతుంది? (బి) ఒక వ్యక్తి దుస్తులు, శిరోజాలంకరణ లేదా మాటతీరు యెహోవా అంగీకరించని జీవన విధానంగల వారిని మెచ్చుకుంటున్నట్టు ఎలా సూచించవచ్చు? (సి) మోసకరమైన సాతాను పన్నాగాలకు బలికాకుండ తప్పించుకోవాలంటే మన పక్షాన ఏమి అవసరము?

12 ‘జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయేగాని, సరసోక్తులేగాని మనమధ్య ప్రస్తావనకే రాకూడదని’ మనం లేఖనాల్లో చదివాము. (ఎఫె. 5:3-5) అయితే మంచి సంగీతం, చక్కని రాగం లేదా వీనులవిందైన వాయిద్యంతో కలిపి తెలివిగా అట్టి పదజాలాలు వస్తూవుంటే అప్పుడేమి? వివాహం లేకుండానే లైంగికత్వాన్ని, సుఖానుభవం పొందడానికి, మాదక ద్రవ్యాల్ని సేవించడాన్ని, మరెన్నింటినో శ్లాఘించే గీతాల్ని అయత్నంగానే ఆలపించడం ఆరంభిస్తామా? లేదా అట్టి క్రియల్లో పాల్గొనే ప్రజల జీవన విధానాన్ని అనుకరించకూడదని మనకు తెలిసినా, వారి దుస్తుల్ని, శిరోజాలంకరణను లేదా వారి మాటల్ని అనుకరించుట ద్వారా వారివలె మనం ఉంటామా? సాతాను ఎంత మోసగాడో గదా! కుళ్లిన తన ఆలోచనా ధోరణిలోనే మానవులు ప్రవర్తించేలా వారినాకర్షించడానికి అతడుపయోగించే పద్ధతులు ఎంత నీచమైనవో గదా! (2 కొరిం. 4:3, 4) అతని మోసకరమైన పన్నాగాలకు బలికాకుండుటకు మనమీ లోకంతోపాటు కొట్టుకొనిపోవడం విసర్జించాలి. “అంధకారసంబంధులగు లోకనాథులు” ఎవరో మనస్సునందుంచుకొని చిత్తశుద్ధితో వారి ప్రభావానికి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉండాలి.—ఎఫె. 6:12; 1 పేతు. 5:8.

జయించుటకు సంసిద్ధులగుట

13. అసంపూర్ణత ఉన్ననూ సాతాను పరిపాలించే ఈ లోకాన్ని జయించుట మనలో ఎవరికైననూ ఎలా సాధ్యము?

13 మరణించడానికి ముందు యేసు తన అపొస్తలులకు ఇలాచెప్పాడు: “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.” అదేవిధంగా వారు కూడ జయించగలరు; మరి 60కి పైగా సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన యోహాను ఇలావ్రాశాడు: “యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?” (యోహా. 16:33; 1 యోహా. 5:5) యేసు వలెనే దేవుని వాక్యంపై ఆధారపడుతూ, మనమాయన మాటలకు లోబడటం ద్వారా అట్టి విశ్వాసాన్ని చూపిస్తాం. ఇంకా ఏమికూడ అవసరము? ఆయన శిరస్సుగానున్న సంఘాన్ని మనం సన్నిహితంగా హత్తుకొనియుండాలి. మనం తప్పు చేసినప్పుడు, మనఃస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి యేసు బలి ఆధారంగా దేవుని క్షమాపణను వెదకాలి. ఈ విధంగా, మన అసంపూర్ణతయందును మనం జయించగలము.

14. (ఎ) ఎఫెసీయులు 6:13-18 చదవండి. (బి) ఆత్మీయ కవచమందలి ప్రతిభాగమిచ్చే ప్రయోజనాల్ని చర్చించుటకు ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నల్ని, లేఖనాల్ని ఉపయోగించండి.

14 జయించుటకు మనం ఏ భాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా “దేవుడిచ్చు సర్వాంగ కవచమును” ధరించుకోవాలి. దయచేసి మీ బైబిల్లో ఎఫెసీయులు 6:13-18 తెరచి ఆ కవచమును గూర్చిన వర్ణనను చదవండి. ఆ పిమ్మట ఈ క్రింది ప్రశ్నలకు జవాబిస్తూ, కవచమందలి ప్రతి భాగమిచ్చే రక్షణనుండి మీరెలా ప్రయోజనం పొందగలరో ఆలోచించండి.

“నడుమునకు సత్యమను దట్టి”

మనకు సత్యం తెలిసినా, క్రమ పఠనము, బైబిలు సత్యాన్ని ధ్యానించుట, కూటములకు హాజరగుట మనల్నెలా సంరక్షిస్తాయి? (ఫిలి. 3:1; 4:8, 9; 1 కొరిం. 10:12, 13; 2 కొరిం. 13:5; 1 పేతు. 1:13, రాజ్యాంతఃసంబంధ, ఆంగ్లం)

“నీతియను మైమరువు”

నీతి విషయంలో ఇది ఎవరి కట్టడ? (ప్రక. 15:3)

ఆయన మార్గాలయెడల ప్రేమను పెంపొందించుకొనుటకు విఫలమగుటవల్ల యెహోవా ఆజ్ఞలకు అవిధేయుడగుట, ఎలా ఒక వ్యక్తిని బహుగా ఆత్మీయ హానికి గురిచేయగలదో ఉదహరించండి. (1 సమూయేలు 15:22, 23; ద్వితీయోపదేశకాండము 7:3, 4 చూడండి.)

“సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు”

సమాధానము కొరకైన దేవుని ఏర్పాట్లనుగూర్చి ప్రజలతో మాట్లాడుటకు మనల్ని తీసుకెళ్లునట్లు అవిశ్రాంతముగా మన పాదాల్ని ఉపయోగించుట మనకెలా రక్షణకరము? (రోమా. 10:15; కీర్త. 73:2, 3; 1 తిమో. 5:13)

“విశ్వాసమను డాలు”

స్థిరమైన పునాదిగల విశ్వాసం మనకుంటే, మనకు సందేహం లేదా భయం కల్గించే ప్రయత్నాల్ని ఎదుర్కొన్ననూ మనమెలా ప్రతిస్పందిస్తాము? (2 తిమోతి 1:12; 2 రాజులు 6:15-17 పోల్చండి.)

“రక్షణయను శిరస్త్రాణము”

వస్తుదాయకమైన వాటిపై అత్యంత మక్కువతో వాటి ఉరిలో పడకుండా తప్పించుకొనుటకు రక్షణయనే నిరీక్షణ ఒక వ్యక్తికెలా సహాయం చేస్తుంది? (1 తిమో. 6:7-10, 19)

“ఆత్మ ఖడ్గము”

మన లేదా ఇతరుల ఆత్మీయతపై జరిగే దాడులకు వ్యతిరేకంగా పోరాడునప్పుడు మనమన్నిసమయాల్లో దేనిపై ఆధారపడాలి? (కీర్త. 119:98; సామె. 3:5, 6; మత్తయి 4:3, 4 పోల్చండి.)

పైదానికి పొందికగా, ఆత్మీయ పోరాటమందు జయించుటకు మరింకేది కూడ అవశ్యమని ఎఫెసీయులు 6:18, 19 లో చూపబడింది? దానినెంత తరచుగా చేయాలి? ఎవరి పక్షాన చేయాలి?

15. (ఎ) మనందరం పోరాడుతున్న ఈ ఆత్మీయ పోరాటం కేవలం వ్యక్తిగతమైనదా? (బి) ఈ పోరాటంలో మనమెలా ముందుకు దూకగలము?

15 క్రైస్తవ సైనికులుగా మనం ఆత్మీయ యుద్ధమందు పాల్గొంటున్న ఒక పెద్ద సైన్యమందు భాగంగావున్నాము. మనం మెలకువగావుండి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మంచిగా ఉపయోగిస్తే, ఈ యుద్ధమందు మనం క్షతగాత్రులం కాము. బదులుగా, మనం తోటి దేవుని సేవకుల్ని బలపరచే సహాయకులముగా ఉంటాము. మనం సిద్ధంగావుండి దేవుని మెస్సీయ రాజ్యసువార్తను వ్యాప్తిజేస్తూ ముందుకు దూకుతాం. ఆ ప్రభుత్వాన్నే సాతాను దౌర్జన్యపూర్వకంగా ఎదిరిస్తున్నాడు.

పునఃసమీక్షా చర్చ

• ప్రపంచమందలి ఆయావర్గాల మధ్య జరుగుతున్న పోరాటాల్లో సంపూర్ణ తటస్థతను పాటించడానికి యెహోవా ఆరాధికులెందుకు కృషిచేస్తారు?

• క్రైస్తవులకు ఆత్మీయ వినాశనం కల్గించడానికి సాతాను మోసపూరితంగా ఉపయోగించే కొన్ని పద్ధతులేమైయున్నవి?

• ఈ ఆత్మీయ పోరాటమందు నిర్ణయాత్మక మార్గాల్లో దేవుడిచ్చు కవచమెలా మనల్ని సంరక్షిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి