అధ్యాయం 9
పునరుత్థాన నిరీక్షణా శక్తి
1. పునరుత్థానము ద్వారా ఎలాంటి అద్భుతమైన ఉత్తరాపేక్షలు సాధ్యపర్చబడినవి?
పునరుత్థానం లేకుండా, మృతులైన మానవులకు బావిజీవితాన్ని గూర్చిన ఎలాంటి నిరీక్షణా ఉండదు. అయితే యెహోవా తన అపారమైన కృపచొప్పున, చనిపోయిన కోట్లాదిమందికి నిత్యజీవం అనుభవించే అమూల్యమైన అవకాశాన్ని తెరిచాడు. తత్ఫలితంగా, మరణమందు నిద్రించిన మన ప్రియమైన వారిని తిరిగి కలుసుకునే హృదయానందకరమైన నిరీక్షణను మనమూ కలిగివున్నాము.—మార్కు 5:35, 41, 42; అపొస్తలుల కార్యములు 9:36-41 పోల్చండి.
2. (ఎ) యెహోవా సంకల్పాన్ని నెరవేర్చుటలో పునరుత్థానము ప్రాముఖ్యమని ఏయే విధాలుగా నిరూపించబడింది? (బి) ప్రత్యేకంగా ఎప్పుడు పునరుత్థాన నిరీక్షణ మనకు ఓ ప్రాముఖ్యమైన బలానికి మూలముగా ఉంటుంది?
2 పునరుత్థానం కారణంగా యెహోవా తన నమ్మకమైన సేవకులకు శాశ్వతహాని కలుగకుండానే, “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని సాతాను దుర్బుద్ధితో చేసిన ఆరోపణను రుజువుపరచుటకు అతడు తన శక్తిమేరకు ప్రయత్నించునట్లు అనుమతించగలడు. (యోబు 2:4) యేసు మృతులలోనుండి లేచినందుననే, మనకు జీవాన్ని రక్షించుకునే ప్రయోజనంకలుగు నిమిత్తం, తన మానవబలి విలువను ఆయన తన తండ్రి సింహాసనముయెదుట అర్పించగల్గాడు. పునరుత్థానం మూలంగానే క్రీస్తుతోడి వారసులైన వారు పరలోక రాజ్యమందు ఆయనతో కూడ ఏకమయ్యారు. ఆలాగే మరణాన్ని ఎదుర్కొనేలాచేసే శోధనలను మనం అనుభవించునప్పుడు, పునరుత్థానమనేది విశ్వాసంగల మనందరికి అసాధారణ బలానికి మూలంగా ఉంటుంది.
క్రైస్తవ విశ్వాసానికి అదెందుకు మూలసిద్ధాంతము
3. (ఎ) ఏ భావమందు పునరుత్థానము ఒక “మూలోపదేశముగా” ఉంది? (బి) సాధారణ ప్రపంచానికి పునరుత్థానము ఎట్టి భావం కలిగివుంది?
3 హెబ్రీయులు 6:1, 2 లో చెప్పబడినట్లు పునరుత్థానం “మూలోపదేశముగా” విశ్వాసమనే పునాదిలో భాగం గనుక, ఇది లేకుండ మనమెన్నటికిని పూర్ణసిద్ధికి ఎదిగిన క్రైస్తవులము కాలేము. అయితే సాధారణ ప్రపంచాలోచనకిది పరాయిదై యున్నది. ఆత్మీయలేమివల్ల ఎక్కువమంది ప్రజలు సుఖభోగాల్లో తేలియాడుతున్నారు. వారు ఇదే నిజమైన జీవితమనుకుంటున్నారు. (1 కొరిం. 15:32) ఇటు క్రైస్తవ మతసామ్రాజ్యమందు అటు బయట సాంప్రదాయ మతాలకు హత్తుకొనియున్నవారు, పునరుత్థానాన్ని నిరర్థకంచేసే అమర్త్యమైన ఆత్మ వారికి ఉందని తలస్తారు. ఈ రెండు ఆలోచనా విధానాల్ని కలుపుటకు ప్రయత్నించువారు ప్రేరేపిత నిరీక్షణకంటే అది మరింత గందరగోళంగా ఉన్నట్లు కనుగొంటారు. వినడానికి ఇష్టపడేవారికి మనమెలా సహాయం చేయగలము?—అపొ. 17:32.
4. (ఎ) ఒకవ్యక్తి పునరుత్థానమును ప్రశంసించుటకు ముందు, అతనితో మనమేమి చర్చించాల్సి ఉంటుంది? (బి) ప్రాణము ఏమిటో, మృతుల స్థితి ఏమిటో వివరించడానికి మీరే లేఖనాల్ని ఉపయోగిస్తారు? (సి) అయితే ఆ వచనాల్లోని సత్యాలను మరుగు చేస్తున్నట్లు కనబడే బైబిలు అనువాదాన్ని ఎవరైనా ఉపయోగిస్తే అప్పుడేమి?
4 పునరుత్థానము ఎట్టి మహత్తరమైన ఏర్పాటో అట్టివారు ప్రశంసించుటకు ముందే వారు ఆత్మ ఏమిటో, మృతుల స్థితి ఏమిటో అర్థంచేసుకోవాలి. సత్యం ఎడల ఆకలిగొనియున్న వ్యక్తికి ఈ విషయాల్ని స్పష్టం చేయడానికి తరచుగా కొన్ని లేఖనాలు మాత్రమే సరిపోతాయి. (ఆది. 2:7; యెహె. 18:4; కీర్త. 146:3, 4) అయితే కొన్ని ఆధునిక బైబిలు అనువాదాలు, పదవివరణ సంచికలు ఈ సత్యాల్ని మరుగు చేస్తున్నాయి. కాబట్టి బైబిలుకు సంబంధించిన ఆదిమ భాషల్లో ఉపయోగింపబడిన పదాలను పరిశీలించుట అవసరము.
5. ప్రాణము ఏమిటో అట్టి వ్యక్తి అర్థం చేసుకొనేలా మీరెలా సహాయం చేస్తారు?
5 దీనిని చేయుటకు ప్రత్యేకంగా నూతనలోక అనువాదము (ఆంగ్లం) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది హెబ్రీ పదమైన నెఫెష్‌ను, దాని సమాంతర గ్రీకు పదమగు సైఖెను “ప్రాణము” అని పొందికగా అనువదిస్తున్నది, ఆలాగే దాని అనుబంధమందు ఈ పదాలున్న అనేక వచనాలు ఇవ్వబడ్డాయి. ఇతర ఆధునిక భాషాంతరాలు అవే ఆదిమ పదాల్ని “ప్రాణము” అని మాత్రమే కాకుండ “ప్రాణి,” “జీవి,” “వ్యక్తి,” “జీవము” అని; “నా నెఫెష్”ను “నేను” అని, “నీ నెఫెష్”ను “నీవు” అని కూడ అనువదించవచ్చు. ఈ బైబిళ్లను కొన్ని పాత అనువాదాలతో లేదా నూతన లోక అనువాదముతో పోల్చిచూచుటవల్ల “ప్రాణము” అని అనువదింపబడిన ఈ ఆదిమ భాషాపదాలు (1) వ్యక్తులను, (2) జంతువులను, (3) అవి అనుభవించు జీవాన్ని సూచిస్తున్నాయని గుణగ్రహించుటకు యథార్థపరుడైన విద్యార్థికి సహాయం చేస్తుంది. అయితే ప్రాణము అదృశ్యమైనదని, అస్పష్టమైనదని మరణమప్పుడు శరీరాన్నుండివేరై ఎక్కడో స్మృతియందు ఉనికిలో ఉంటుందనే తలంపునవి ఎన్నడూ ఇవ్వడం లేదు.
6. (ఎ) షియోల్, హేడిస్, గెహెన్నాల భావం విషయంలో కొన్ని ఆధునిక అనువాదాలు పాఠకులను ఎందుకు గందరగోళంలో పడవేస్తున్నాయి? (బి) షియోల్ లేక హేడిస్ మరియు గెహెన్నాల్లోని వ్యక్తుల పరిస్థితిని బైబిలునుండి మీరెలా వివరిస్తారు?
6 అదేప్రకారం, నూతన లోక అనువాదము హెబ్రీ పదమగు షోయల్‌ను షియోల్‌గా మరియు గ్రీకు పదాలగు హేడెస్‌ను హేడిస్‌గా, గెయెన్నాను గెహెన్నాగా మూలభాష ఉచ్చారణయందే పొందికగా ప్రయోగిస్తున్నది. అయితే మరికొన్ని ఆధునిక బైబిలు అనువాదాలు, పదవివరణ సంచికలు హేడెస్, గెయెన్నా అనే ఈ రెండు పదాలను “నరకము” అని వీటికి తోడు షియోల్, హేడిస్‌లను “సమాధి,” “మృతుల లోకము” అనే భావాలతో అనువదిస్తూ పాఠకున్ని గందరగోళ పెడుతున్నాయి. అవసరమైనచోట అనువాదాల్ని పోల్చిచూచుట ద్వారా, షియోల్, హేడిస్ సమానార్థ పదాలని చూపవచ్చును. (కీర్త. 16:10; అపొ. 2:27) షియోల్ లేదా హేడిస్ మానవజాతి సమాధియని, జీవముతో కాదుగాని మరణముతో అవి సంబంధాన్ని కలిగివున్నవని బైబిలు స్పష్టం చేస్తున్నది. (కీర్త. 89:48; ప్రక. 20:13) ఆలాగే అది పునరుత్థానము ద్వారా అక్కడనుండి తిరిగివచ్చే ఉత్తరాపేక్షను కూడ సూచిస్తున్నది. (యోబు 14:13; అపొ. 2:31) దీనికి భిన్నంగా గెహెన్నాకు పోవువారికి ఎలాంటి భవిష్యత్ జీవ నిరీక్షణ లేదు, అయితే ప్రాణము అక్కడ స్మృతిలో ఉంటుందని మాత్రం చెప్పబడలేదు.—మత్త. 18:9; 10:28.
7. సరిగా అర్థంచేసుకున్నప్పుడు, పునరుత్థానము ఒకవ్యక్తి దృక్పథం మీద, క్రియల మీద ఎలా ప్రభావం చూపగలదు?
7 ఆ విషయాలు స్పష్టం కావడంతో క్రీస్తు మరణ పునరుత్థానాలు నిజమైన భావాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకవ్యక్తికి పునరుత్థానము అతనికి ఏ భావాన్నిస్తుందో గ్రహించుటకు సహాయం చేయవచ్చును, పైగా ఇట్టి మహత్తరమైన ఏర్పాటు చేయుటలో యెహోవాచూపిన ప్రేమనతడు ప్రశంసించుట కారంభించవచ్చును. తమ ప్రియమైన వారిని మరణమందు పోగొట్టుకున్న వారి దుఃఖకరమైన స్థానాన్ని, ఇప్పుడు దేవుని నూతన విధానంలో తిరిగి కలుసుకునే సంతోషభరితమైన ఆశతో నింపవచ్చును. యేసుక్రీస్తు పునరుత్థానము క్రైస్తవ విశ్వాసానికి మూలకు తలరాయి అని మొదటి శతాబ్దపు క్రైస్తవులు గ్రహించారు. ఆసక్తిగా వారు దానిని గూర్చి, అది అభయమిచ్చిన నిరీక్షణను గూర్చి ఇతరులకు సాక్ష్యమిచ్చారు. అదేవిధంగా, దానిని నేడు ప్రశంసించు వారు సహితం ఈ అమూల్యమైన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.—అపొ. 5:30-32; 10:40-43; 13:32-39; 17:31.
‘హేడిస్ తాళపుచెవిని’ ఉపయోగించుట
8. యేసు “మరణముయొక్కయు పాతాళలోకము [“హేడిస్,” NW]యొక్కయు తాళపుచెవులు” ఉపయోగించుట తన ఆత్మాభిషక్త అనుచరులకెట్టి భావం కలిగివుంది?
8 క్రీస్తుతోపాటు పరలోక రాజ్యమందు సహవసించబోవు వారందరు చివరకు మరణించాలి. అయితే “మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము [“హేడిస్,” NW]యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి” అని అపొస్తలుడైన యోహానుతో చెప్పినప్పుడు ఆయనిచ్చిన అభయం వారికి బాగుగా తెలుసు. (ప్రక. 1:18) ఆయన భావమేమి? ఆయన తన స్వంత అనుభవంవైపు దృష్టిని మళ్లిస్తున్నాడు. ఆయన కూడ మరణించాడు. అయితే దేవుడు ఆయనను హేడిస్‌లో విడిచిపెట్టలేదు. మూడవ రోజున స్వయంగా యెహోవాయే ఆయనను ఆత్మీయ జీవానికి లేపి ఆయనకు అమర్త్యతను అనుగ్రహించాడు. అంతేకాదు, మానవుల సామాన్య సమాధినుండి, అనగా ఆదాము ద్వారా కలిగిన పాపపు ప్రభావముల నుండి ఇతరులను విడిపించుటకు దేవుడాయనకు “మరణముయొక్కయు పాతాళలోకము [“హేడిస్,” NW]యొక్కయు తాళపుచెవులు” ఇచ్చాడు. ఆ తాళపుచెవులను కలిగియున్న కారణంగా, యేసు తన నమ్మకమైన అనుచరులను మరణం నుండి లేపగలడు. ఆయనలా చేసినప్పుడు, తన తండ్రి తనకు అనుగ్రహించినట్లే తానుకూడ తన సంఘమందలి ఈ ఆత్మాభిషక్త సభ్యులకు అమూల్య వరమగు అమర్త్యమైన పరలోక జీవాన్ని అనుగ్రహిస్తాడు.—రోమా. 6:5; ఫిలి. 3:20, 21.
9. నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది?
9 నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు ఎప్పుడట్టి పునరుత్థానం పొందుతారు? అది ఇప్పటికే ఆరంభమైంది. ‘క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో’ వారు లేపబడతారని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు, కాగా ఆ ప్రత్యక్షత సా.శ. 1914 లో ఆరంభమైంది. (1 కొరిం. 15:23) ఇప్పుడు, తమ భూజీవితాన్ని చాలించిన పిదప, వారు తమ ప్రభువు తిరిగివచ్చుట కొరకు వేచివుండాల్సిన అవసరం లేదు. వారు మరణించిన వెంటనే “ఒక రెప్ప పాటున . . . మార్పుపొంది” ఆత్మీయ జీవానికి లేపబడతారు. “వారి క్రియలు వారివెంట పోవును” గనుక వారెంత ధన్యులో గదా!—1 కొరిం. 15:51, 52; ప్రక. 14:13.
10. మరింకే పునరుత్థానం కూడ ఉంటుంది, అదెప్పుడు ఆరంభమౌతుంది?
10 అయితే వారు మాత్రమే పునరుత్థానం చేయబడరు. అది “మొదటి పునరుత్థానము” అని పిలువబడుట, దానివెంట మరొకటి జరగాలని సూచిస్తున్నది. (ప్రక. 20:6) ఈ తర్వాతి పునరుత్థానము ద్వారా ప్రయోజనము పొందువారు పరదైసు భూమిపై నిత్యజీవం పొందే సంతోషకరమైన ఉత్తరాపేక్షను కలిగివుంటారు. అదెప్పుడు జరుగుతుంది? అది ప్రస్తుత దుష్ట విధానపు “భూమ్యాకాశములు” తొలగింపబడిన తర్వాత జరుగునని ప్రకటన గ్రంథము చూపిస్తున్నది. ఈ పాత విధానపు ఆ అంతం చాలా సమీపంగా ఉంది. ఆ పిమ్మట, దేవుని నిర్ణయ కాలమున ఆ భూపునరుత్థానం ఆరంభమౌతుంది.—ప్రక. 20:11, 12.
11. భూమ్మీది జీవానికి లేపబడే నమ్మకమైన వారిలో ఎవరుకూడ ఉంటారు, అదెందుకు పులకరించే ఉత్తరాపేక్షయై ఉన్నది?
11 దానిలో ఎవరెవరు చేరియుంటారు? అనాదికాలంనుండి ఉన్న నమ్మకమైన యెహోవా సేవకులు అందులో ఉంటారు. వారిలో పునరుత్థానమందు తమకున్న గట్టి విశ్వాసం కారణంగా “విడుదల పొందనొల్లని” మనుష్యులు ఉంటారు—కొందరైతే హింసాత్మక మరణాన్ని తప్పించుకోవడానికి దేవుని ఎడల తమకున్న యథార్థతయందు రాజీపడిపోతారు. (హెబ్రీ. 11:35) వారిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆలాగే బైబిల్లో క్లుప్తంగా మాత్రమే వ్రాయబడిన సంఘటనల్ని గూర్చి వారినుండి ప్రత్యక్షంగా వినడం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో గదా! అట్టివారిలో యెహోవా మొదటి నమ్మకమైన సాక్షియగు హేబెలు. జలప్రళయానికి ముందు దేవుని హెచ్చరికా వర్తమానాన్ని నిర్భయంగా ప్రకటించిన హనోకు, నోవహు. దూతలను తనయింట చేర్చుకొనిన అబ్రాహాము. సీనాయి పర్వతమునొద్ద తనద్వారా ధర్మశాస్త్రమివ్వబడిన మోషేయు ఉంటారు. మరియు సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనాన్ని చూసిన యిర్మీయావంటి ధైర్యవంతులైన ప్రవక్తలు. తన కుమారుడని యేసును దేవుడే స్వయంగా గుర్తించడాన్ని విన్న బాప్తిస్మమిచ్చు యోహాను. అలాగే ప్రస్తుత విధానపు అంత్యదినాల్లో చనిపోయిన యథార్థవంతులు కూడ వారిలో ఉంటారు.—హెబ్రీ. 11:4-38; మత్త. 11:11.
12. (ఎ) హేడిస్‌లోవున్న ఎంతమంది మృతులు లేపబడతారు? (బి) కాబట్టి ఎవరుకూడ చేరియున్నారు, ఎందుకు?
12 యుక్తకాలంలో మరితరులు కూడ లేపబడతారు. ‘హేడిస్ తాళపుచెవిని’ మానవజాతి పక్షాన యేసు ఎంతమేరకు ఉపయోగిస్తాడో అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన దర్శనమందు చూపబడింది, అందులో ఆయన హేడిస్ “అగ్నిగుండములో పడవేయబడుటను” చూశాడు. దాని భావమేమిటి? అది నాశనం చేయబడిందని; అంటే పూర్తిగా ఖాళీ కావడంతో అదిక ఉనికిలో లేకుండా చేయబడిందని దాని భావం. ఆ విధంగా, యెహోవా నమ్మకమైన ఆరాధికులతోబాటు, కనికరంతో యేసు హేడిస్ లేదా షియోల్ నందలి అనీతిమంతులను కూడ పునరుత్థానం చేస్తాడు. మరలా మరణించునట్లు తీర్పుతీర్చడానికి ఆయన వారిలో ఎవరినీ లేపడం లేదు. దేవుని రాజ్యం క్రింద నీతియుక్తమైన వాతావరణంలో, యెహోవా మార్గాల కనుగుణ్యంగా తమ జీవితాలు మార్చుకోవడానికి వారు సహాయం పొందుతారు. వారి పేర్లు వ్రాయబడే అవకాశం వారికి కలుగునట్లు “జీవగ్రంథము” ఒకటి విప్పబడినట్లు ఆ దర్శనం చూపింది. వారు తమ పునరుత్థానం తర్వాత చేసిన “క్రియలచొప్పున . . . తీర్పు” పొందుతారు. (ప్రక. 20:12-14; అపొ. 24:15) ఆ విధంగా, తుది ఫలితాన్నిబట్టి చూస్తే వారిది అనివార్యమైన “తీర్పు [శిక్షార్హమైన] పునరుత్థానం” కాదుగాని, “జీవ పునరుత్థానం” అని నిరూపింపబడగలదు.—యోహా. 5:28, 29.
13. (ఎ) ఎవరు పునరుత్థానం చేయబడరు? (బి) పునరుత్థానాన్ని గూర్చిన నిజమైన జ్ఞానం మన జీవితాలపై ఎట్టి ప్రభావం చూపాలి?
13 ఇప్పటివరకు జీవించిన వారందరు పునరుత్థానం చేయబడరు. ఎలాంటి క్షమాపణ సాధ్యంకాని పాపాల్ని కొందరు చేశారు. ఇప్పుడు సమీపమైయున్న “మహాశ్రమలలో” సంహరింపబడిన వారు నిత్యనాశనం అనుభవిస్తారు. (మత్త. 12:31, 32; 23:33; 24:21, 22; 25:41, 46; 2 థెస్స. 1:6-9) ఆ విధంగా, హేడిస్‌లో ఉన్న వారందరిని విడుదల చేయుటలో అసాధారణమైన కనికరం చూపబడినా, మనమిప్పుడు అలక్ష్యంగా జీవించడానికి మాత్రం పునరుత్థానమెట్టి ఆధారాన్నివ్వడం లేదు. బదులుగా, దేవుని ఈ అపారమైన కృపను మనమెంతగా ప్రశంసిస్తున్నామో చూపుటకది మనకు పురికొల్పునివ్వాలి.
పునరుత్థానపు నిరీక్షణ ద్వారా బలపర్చబడుట
14. తన ప్రస్తుత జీవితపు అవసానదశకు చేరుతున్న వ్యక్తికి పునరుత్థానం ఎలా గొప్ప బలానికి మూలం కాగలదు?
14 పునరుత్థాన నిరీక్షణను తమ స్వంతం చేసుకున్న వారు దానినుండి గొప్ప బలాన్ని పొందగలరు. జీవితం అవసానదశకు చేరుకున్నప్పుడు, వైద్య చికిత్స ఎంతవున్నా తమ మరణదినాన్ని అనిశ్చయంగా పొడిగించలేరని వారికి తెలుసు. (ప్రసం. 8:8) వారు ప్రభువు సేవయందే బహుగా గడిపి, ఆయన సంస్థతో యథార్థంగా సేవచేస్తే, వారు సంపూర్ణ అభయంతో భవిష్యత్తును చూడగలరు. దేవుని నిర్ణయ కాలంలో పునరుత్థానము ద్వారా తాము మరలా జీవితాన్ని అనుభవించగలరని వారెరుగుదురు. అదెంత మధురమైన జీవితమో గదా! అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా అది “వాస్తవమైన జీవము.”—1 తిమో. 6:19; 1 కొరిం. 15:58; హెబ్రీ. 6:10-12.
15. క్రూరంగా హింసించేవారు మనల్ని బెదిరిస్తే, యెహోవా ఎడల యథార్థత కాపాడుకోవడానికి మనకేది సహాయపడగలదు?
15 పునరుత్థానం ఉన్నదని తెలుసుకొనుట మాత్రమే కాదుగాని, ఆ యేర్పాటుకు మూలమెవరో తెలుసుకొనుట మనల్ని బలపరస్తుంది. క్రూరమైన హింసకుల చేతిలో మరణమనే భయమున్ననూ దేవునియెడల యథార్థంగా ఉండడానికిది మనల్ని దృఢపరస్తుంది. ప్రజల్ని దాస్యమందు కట్టిపడవేయడానికి అకాల మరణభయాన్ని సాతాను అనాదిగా ఉపయోగిస్తున్నాడు. అయితే యేసు అట్టి భయానికి లోనుకాలేదు; పైగా ఆయన మరణం వరకు యెహోవాకు నమ్మకస్థునిగా నిరూపించుకున్నాడు. తన మరణం సాధించిన దానిద్వారా అట్టి భయాన్నుండి ఇతరులను విడుదలచేసే ఒక ఏర్పాటును ఆయన చేశాడు. (హెబ్రీ. 2:14, 15) ఆ యేర్పాటునందు వారు విశ్వాసం చూపుటవల్ల, ఆయన నిజ అనుచరులు యథార్థపరులనే ఓ అసాధారణ చరిత్ర సృష్టించారు. ఒత్తిడి చేయబడినప్పుడు, వారు యెహోవాకంటే ఎక్కువగా తమ ‘ప్రాణములను ప్రేమించిన వారు’ కారని నిరూపించుకున్నారు. (ప్రక. 12:11) జ్ఞానయుక్తంగా, వారు తమ నిత్యజీవపు ఉత్తరాపేక్షను పోగొట్టుకొనే విధంగా క్రైస్తవ సూత్రాల్ని విసర్జించుట ద్వారా ప్రస్తుత జీవితాన్ని కాపాడుకొనుటకు ప్రయత్నించరు. (లూకా 9:24, 25) మీకు అటువంటి విశ్వాసమున్నదా? మీరు నిజంగా యెహోవాను ప్రేమిస్తూ, పునరుత్థాన నిరీక్షణను మీ హృదయానికి తీసుకుంటే మీరట్టి విశ్వాసాన్ని నిశ్చయంగా కలిగియుంటారు.
పునఃసమీక్షా చర్చ
• పునరుత్థానాన్ని తాను ప్రశంసించుటకు ముందు ఒకవ్యక్తి ప్రాణమేమిటో, మృతుల స్థితియేమిటో ఎందుకు అర్థం చేసుకోవాలి?
• మృతుల్లోనుండి ఎవరు తిరిగివస్తారు? ఈ జ్ఞానం మనపై ఎలా ప్రభావం చూపాలి?
• పునరుత్థాన నిరీక్షణ మనల్నెలా బలపరస్తుంది?