కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bh పేజీ 218-పేజీ 219 పేరా 1
  • ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరు?
  • బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రధానదూతైన మిఖాయేలు ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • యేసే ప్రధానదూత అయిన మిఖాయేలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవదూతలు ఎవరు, వాళ్లు ఏం చేస్తారు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
bh పేజీ 218-పేజీ 219 పేరా 1

అనుబంధం

ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరు?

మిఖాయేలు అనే ఆత్మ సంబంధ ప్రాణి బైబిల్లో ఎక్కువగా ప్రస్తావించబడలేదు. అయితే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన కార్యశీలునిగా ఉన్నట్లే వర్ణించబడ్డాడు. దానియేలు గ్రంథంలో ఆయన దుష్టదూతలతో యుద్ధం చేస్తున్నట్లుగా, యూదా పత్రికలో ఆయన సాతానును ఖండిస్తున్నట్లుగా, ప్రకటన గ్రంథంలో అపవాదితో, అతని దయ్యాలతో యుద్ధం చేస్తున్నట్లుగా వర్ణించబడ్డాడు. యెహోవా పరిపాలనను సమర్థిస్తూ, దేవుని శత్రువులతో పోరాడడం ద్వారా మిఖాయేలు, “దేవుని వంటివాడు ఎవడు?” అనే తన పేరుకు తగ్గట్టు జీవిస్తున్నాడు. అయితే ఆ మిఖాయేలు ఎవరు?

కొన్నిసార్లు, కొందరు ఒకటి కన్నా ఎక్కువ పేర్లతో పిలువబడతారు. ఉదాహరణకు, పితరుడైన యాకోబుకు ఇశ్రాయేలు అనే పేరు, అపొస్తలుడైన పేతురుకు సీమోను అనే పేరు కూడా ఉన్నాయి. (ఆదికాండము 49:1, 2; మత్తయి 10:2) అదేవిధంగా యేసుక్రీస్తుకు భూజీవితానికి ముందు, ఆ తర్వాత మిఖాయేలు అనే మరో పేరు ఉందని బైబిలు సూచిస్తోంది. మనం ఆ నిర్ధారణకు రావడానికి కొన్ని లేఖనాధారిత కారణాలను పరిశీలిద్దాం.

ప్రధానదూత. దేవుని వాక్యం మిఖాయేలును “ప్రధానదూత” అని సూచిస్తోంది. (యూదా 9) మిఖాయేలు ప్రధానదూత అని పిలువబడ్డాడని గమనించండి. ఇది అలాంటి దేవదూత కేవలం ఒక్కడు మాత్రమే ఉన్నాడని సూచిస్తోంది. వాస్తవానికి, బైబిల్లో ‘ప్రధానదూత’ అనే పదం ఏకవచనంలో మాత్రమే ఉపయోగించబడిందే తప్ప బహువచనంలో ఎన్నడూ ఉపయోగించబడలేదు. అంతేకాక, యేసుకు ప్రధానదూత స్థానం లభించింది. పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తు గురించి 1 థెస్సలొనీకయులు 4:16 ఇలా చెబుతోంది: “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, . . . పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును.” కాబట్టి యేసు స్వరం ప్రధానదూత శబ్దంగా వర్ణించబడుతోంది. కాబట్టి ఈ లేఖనం యేసే ఆ ప్రధానదూతయైన మిఖాయేలు అని సూచిస్తోంది.

సైన్యాధ్యక్షుడు. ‘మిఖాయేలు అతని దూతలు ఆ ఘటసర్పముతో దాని దూతలతో యుద్ధము’ చేశారు అని బైబిలు చెబుతోంది. (ప్రకటన 12:7) కాబట్టి, మిఖాయేలు నమ్మకస్థులైన దేవదూతల సైన్యానికి నాయకునిగా ఉన్నాడు. యేసు నమ్మకస్థులైన దేవదూతల సైన్యాధ్యక్షుడని కూడా ప్రకటన గ్రంథం వర్ణిస్తోంది. (ప్రకటన 19:14-16) అపొస్తలుడైన పౌలు ప్రత్యేకంగా “ప్రభువైన యేసు” గురించి, ఆయన “ప్రభావమును కనుపరచు దూతల” గురించి ప్రస్తావిస్తున్నాడు. (2 థెస్సలొనీకయులు 1:6-7) కాబట్టి బైబిలు మిఖాయేలు ‘అతని దూతల’ గురించి, యేసు ‘ఆయన దూతల’ గురించి మాట్లాడుతోంది. (మత్తయి 13:41; 16:27; 24:31; 1 పేతురు 3:22) బైబిలు నమ్మకస్థులైన దేవదూతల రెండు వేర్వేరు సైన్యాలు పరలోకంలో ఉన్నట్లు అంటే మిఖాయేలు నాయకత్వం క్రింద ఒక సైన్యం ఉన్నట్లు, యేసు నాయకత్వం క్రింద మరో సైన్యం ఉన్నట్లు ఎక్కడా లేదు కాబట్టి, మిఖాయేలు మరెవరో కాదు, పరలోక జీవిత పాత్రలో ఉన్న యేసే అనే ముగింపుకు రావడం సరైనదే.a

a మిఖాయేలు అనే పేరు దేవుని కుమారునికే అన్వయిస్తుందనే విషయం మీద మరింత సమాచారం, యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటిలో 393-394 పేజీల్లో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి