కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 3 పేజీ 14-పేజీ 15 పేరా 3
  • ఆదాము, హవ్వ దేవుని మాట వినలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదాము, హవ్వ దేవుని మాట వినలేదు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం
    నా బైబిలు కథల పుస్తకము
  • దేవుడు అందరికన్నా గొప్పవాడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • కష్టమైన జీవితం మొదలవడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 3 పేజీ 14-పేజీ 15 పేరా 3
ఆదాము, హవ్వ ఏదెను తోటనుండి బయటకు వెళ్లిపోతున్నారు

లెసన్‌ 3

ఆదాము, హవ్వ దేవుని మాట వినలేదు

తనకు హవ్వ ఇచ్చిన కాయను ఆదాము చేతిలో పట్టుకున్నాడు

ఒకరోజు హవ్వ ఒక్కతే ఉన్నప్పుడు, ఒక పాము ఆమెతో మాట్లాడింది. ఆ పాము ఇలా అడిగింది: ‘ఇది నిజమేనా, దేవుడు ఈ తోటలో అన్ని చెట్ల కాయలు తినొద్దు అన్నాడా?’ అప్పుడు హవ్వ: ‘మేము అన్ని చెట్ల కాయలు తినవచ్చు. కానీ ఒక్క చెట్టు కాయ మాత్రం తినకూడదు. ఆ కాయ తింటే మేము చనిపోతాము.’ అప్పుడు పాము: ‘మీరు చనిపోరు. మీకు తెలుసా, మీరు ఆ కాయ తింటే దేవుడిలా అవుతారు’ అని అంది. ఆ పాము చెప్పింది నిజమేనా? కాదు. అది అబద్ధం. కానీ హవ్వ నమ్మేసింది. ఆమె ఆ చెట్టు కాయను చూసే కొద్దీ దానిని తినాలని అనిపించింది. హవ్వ ఆ కాయను తిని ఆదాముకు కూడా ఇచ్చింది. దేవుని మాట వినకపోతే వాళ్లు చనిపోతారని ఆదాముకు తెలుసు. అయినా ఆదాము ఆ కాయను తిన్నాడు.

ఆదాము, హవ్వ ఏదెను తోటనుండి బయటకు వెళ్తున్నప్పుడు దేవుడు దేవదూతల్ని, మండుతున్న పెద్ద కత్తిని ఆ దారికి కాపలా పెట్టాడు

ఆ రోజు సాయంత్రం యెహోవా ఆదాము, హవ్వతో మాట్లాడాడు. వాళ్లు ఆయన మాట ఎందుకు వినలేదో దేవుడు అడిగాడు. హవ్వ తప్పును పాము మీదికి తోసేసింది, ఆదాము హవ్వ మీదికి తోసేశాడు. ఆదాము, హవ్వ దేవుని మాట వినలేదు కాబట్టి యెహోవా వాళ్లిద్దరినీ ఏదెను తోటలో నుండి బయటకు పంపించేశాడు. మళ్లీ వాళ్లు ఎప్పటికీ లోపలికి రాకుండా దేవదూతల్ని, మండుతున్న పెద్ద కత్తిని ఆ దారికి అడ్డు పెట్టాడు.

హవ్వతో ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్లకి కూడా శిక్ష పడుతుందని యెహోవా అన్నాడు. అయితే హవ్వతో మాట్లాడింది పాము కాదు. యెహోవా మాట్లాడే పాముల్ని చేయలేదు. ఆ పాముని మాట్లాడేలా చేసింది ఒక చెడ్డ దూత. అతను హవ్వను మోసం చేయడానికి అలా చేశాడు. ఆ దూతని అపవాది అయిన సాతాను అంటారు. భవిష్యత్తులో యెహోవా సాతానుని నాశనం చేస్తాడు కాబట్టి మోసం చేసి అతను ఎవరితో చెడ్డ పనులు చేయించలేడు.

“మొదటి నుండి [అపవాది] హంతకుడు. అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు, ఎందుకంటే అతనిలో సత్యం లేదు.”—యోహాను 8:44

ప్రశ్నలు: హవ్వ ఎందుకు ఆ కాయ తిన్నది?

యెహోవాకు ఎదురుతిరిగాక ఆదాముకు హవ్వకు ఏమైంది? అపవాదియైన సాతాను ఎవరు?

ఆదికాండం 3:1-24; యోహాను 8:44; 1 యోహాను 3:8; ప్రకటన 12:9

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి