కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 8 పేజీ 26-పేజీ 27 పేరా 1
  • అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • అబ్రాహాము—దేవుని స్నేహితుడు
    నా బైబిలు కథల పుస్తకము
  • అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 8 పేజీ 26-పేజీ 27 పేరా 1
అబ్రాహాము శారా ఊరు పట్టణానికి బయలుదేరడానికి వస్తువులు సర్దుకుంటున్నారు

లెసన్‌ 8

అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు

బాబెలుకు కాస్త దూరంలో ఊరు అనే పట్టణం ఉంది. అక్కడి ప్రజలు యెహోవాను కాకుండా చాలామంది దేవుళ్లను ఆరాధించేవాళ్లు. కానీ ఆ పట్టణంలో ఒకతను యెహోవాను మాత్రమే ఆరాధించేవాడు. అతని పేరు అబ్రాహాము.

యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు: ‘నీ ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి, నేను నీకు చూపించే దేశానికి వెళ్లు.’ అప్పుడు దేవుడు ఇలా ఆశీర్వదించాడు: ‘నిన్ను పెద్ద దేశంగా చేస్తాను. నీ ద్వారా భూమి మీదున్న మనుషులందరికీ మంచి చేస్తాను.’

యెహోవా ఎక్కడికి పంపిస్తున్నాడో అబ్రాహాముకు తెలియదు అయినా ఆయన యెహోవా మీద నమ్మకం ఉంచాడు. అప్పుడు అబ్రాహాము, అతని భార్య శారా, నాన్న తెరహు, అన్న కొడుకు లోతు వాళ్లవాళ్ల వస్తువుల్ని సర్దుకుని దేవుడు చెప్పినట్లు ఆ దూర ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

యెహోవా చూపించాలనుకున్న చోటుకు అబ్రాహాము అతని కుటుంబం చేరుకునే సరికి అబ్రాహాముకు 75 సంవత్సరాలు. ఆ ప్రాంతాన్ని కనాను దేశం అని పిలిచేవాళ్లు. అక్కడ దేవుడు అబ్రాహాముతో ఒక వాగ్దానం చేశాడు: ‘నీ ఎదురుగా ఉన్న ఈ దేశమంతటినీ నీ పిల్లలకు ఇస్తాను.’ కానీ అబ్రాహాము, శారా చాలా ముసలివాళ్లు. వాళ్లకు ఇంకా పిల్లలు లేరు. మరి యెహోవా ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడు?

కనాను దేశానికి ప్రయాణంలో ఉన్న అబ్రాహాము అతని కుటుంబం

“విశ్వాసం వల్ల అబ్రాహాము . . . విధేయత చూపించి, తాను స్వాస్థ్యంగా పొందబోయే చోటికి బయల్దేరాడు; తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా బయల్దేరాడు.”—హెబ్రీయులు 11:8

ప్రశ్నలు: యెహోవా అబ్రాహామును ఏమి చేయమని అడిగాడు? యెహోవా అబ్రాహాముకు ఏమని మాట ఇచ్చాడు?

ఆదికాండం 11:29–12:9; అపొస్తలుల కార్యాలు 7:2-4; గలతీయులు 3:6; హెబ్రీయులు 11:8

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి