కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 11 పేజీ 32-పేజీ 33 పేరా 2
  • విశ్వాసానికి పరీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసానికి పరీక్ష
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • తన కుమారుణ్ణి బలి ఇవ్వమని అబ్రాహామును దేవుడు ఎందుకు అడిగాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 11 పేజీ 32-పేజీ 33 పేరా 2
అబ్రాహాము, ఇస్సాకు మోరీయా ప్రాంతానికి నడిచి వెళ్తున్నారు

లెసన్‌ 11

విశ్వాసానికి పరీక్ష

అబ్రాహాము తన కొడుకు ఇస్సాకుకు యెహోవాను ప్రేమించాలని, ఆయన వాగ్దానాల అన్నిటిని నమ్మాలని నేర్పించాడు. ఇస్సాకుకు దాదాపు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు, యెహోవా అబ్రాహామును చాలా కష్టమైనది ఏదో చేయమని అడిగాడు. ఏంటది?

దేవుడు అబ్రాహాముతో: ‘దయచేసి, నీ ఒక్కగానొక్క కొడుకును తీసుకుని వెళ్లి మోరీయా ప్రాంతంలో ఒక కొండపైన నాకు బలిగా అర్పించు’ అన్నాడు. యెహోవా ఎందుకు అలా అడిగాడో అబ్రాహాముకు ఏం తెలియకపోయినా ఆయన చెప్పిన మాటకు లోబడ్డాడు.

అబ్రాహాము తర్వాత రోజు ఉదయాన్నే ఇస్సాకును, ఇద్దరు పనివాళ్లను తీసుకుని మోరీయా ప్రాంతానికి బయలుదేరాడు. మూడు రోజులు ప్రయాణించాక దూరం నుండి ఆ కొండలు కనిపించాయి. అబ్రాహాము పనివాళ్లతో అక్కడే ఆగమని చెప్పాడు, ఇస్సాకును తీసుకుని బలి అర్పించడానికి వెళ్లాడు. ఇస్సాకును కట్టెలు పట్టుకోమని చెప్పి అబ్రాహాము కత్తి తీసుకున్నాడు. అప్పుడు ఇస్సాకు వాళ్ల నాన్నతో ‘బలి ఇవ్వడానికి జంతువు ఎక్కడ ఉంది?’ అని అడిగాడు. అబ్రాహాము ‘యెహోవా ఇస్తాడు నాన్న’ అని చెప్పాడు.

చివరికి కొండ దగ్గరికి రాగానే వాళ్లు అక్కడ ఒక బలిపీఠం కట్టారు. అబ్రాహాము ఇస్సాకు కాళ్లూ చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకో పెట్టాడు.

ఇస్సాకు కట్టి వేయబడి బలిపీఠంపై ఉన్నాడు, అబ్రాహాము చేతితో కత్తి పట్టుకున్నాడు

అబ్రాహాము కత్తిని తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే యెహోవా దూత పరలోకం నుండి పిలిచి: ‘అబ్రాహాము! బాబును ఏమి చేయవద్దు! నీ కొడుకుని కూడా బలి ఇచ్చేయడానికి సిద్ధపడ్డావు కాబట్టి నీకు దేవుని మీద విశ్వాసం ఉందని ఇప్పుడు నాకు తెలిసింది’ అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాముకు ఒక పొట్టేలు కనిపిస్తుంది. దాని కొమ్ములు చెట్టులో ఇరుక్కుని ఉన్నాయి. వెంటనే ఆయన ఇస్సాకు కట్లు ఊడదీసి ఆ పొట్టేలును బలిగా ఇచ్చాడు.

ఆ రోజు నుండి యెహోవా అబ్రాహామును స్నేహితుడని పిలిచాడు. ఎందుకో మీకు తెలుసా? అబ్రాహాము యెహోవా ఏది అడిగినా చేశాడు, ఆయనను యెహోవా అలా ఎందుకు అడిగాడో అర్థం కాకపోయినా చేశాడు.

అబ్రాహాము ఇస్సాకు కట్లు విప్పుతున్నాడు

యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని మళ్లీ అతనికి చెప్పాడు: ‘నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని అంటే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను.’ యెహోవా అబ్రాహాము కుటుంబం ద్వారా మంచివాళ్లందరినీ ఆశీర్వదిస్తాడని దీని అర్థం.

“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” —యోహాను 3:16

ప్రశ్నలు: అబ్రాహాము యెహోవా మీద నమ్మకం ఉంచాడని ఎలా చూపించాడు? యెహోవా అబ్రాహాముకు ఏమని మాట ఇచ్చాడు?

ఆదికాండం 22:1-18; హెబ్రీయులు 11:17-19; యాకోబు 2:21-23

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి