కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 26 పేజీ 66-పేజీ 67 పేరా 1
  • 12 మంది గూఢచారులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 12 మంది గూఢచారులు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • పన్నెండు మంది వేగులవారు
    నా బైబిలు కథల పుస్తకము
  • యెహోషువ గుర్తుంచుకున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 26 పేజీ 66-పేజీ 67 పేరా 1
ఇశ్రాయేలు వాళ్లు కనాను దేశాన్ని రహస్యంగా చూస్తున్నారు

లెసన్‌ 26

పన్నెండు మంది గూఢచారులు

ఇశ్రాయేలీయులు సీనాయి కొండ దగ్గర నుండి బయల్దేరి పారాను అరణ్యం గుండా ప్రయాణిస్తూ కాదేషు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ‘ప్రతీ గోత్రం నుండి ఒకరిని మొత్తం 12 మందిని కనాను దేశాన్ని రహస్యంగా చూడడానికి పంపించు. ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులకు నేను ఇస్తాను.’ అలా వేరే దేశాలను రహస్యంగా చూడడానికి వెళ్లేవాళ్లను గూఢచారులు అంటారు. మోషే 12 మంది గూఢచారులను ఏర్పాటుచేసి వాళ్లతో ఇలా చెప్పాడు: ‘మీరు కనానుకు వెళ్లి, ఆహారం పండించడానికి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి రండి. అక్కడ ఉండే ప్రజలు బలంగా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, గుడారాల్లో నివసిస్తున్నారో, పట్టణాల్లో నివసిస్తున్నారో చూసి రండి.’ ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు, వాళ్లంతా కనానుకు బయల్దేరారు.

ఇశ్రాయేలీయులు పేచీలు పెట్టారు, బాగా భయపడిపోయారు

వాళ్లు 40 రోజుల తర్వాత, అంజూర పండ్లను, దానిమ్మ కాయలను, ద్రాక్ష కాయలను తీసుకుని వస్తారు. వాళ్లు ఇలా చెప్తారు: ‘అది మంచి దేశం, కానీ ఆ ప్రజలు చాలా బలంగలవాళ్లు, వాళ్ల పట్టణాల చుట్టూ గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి.’ కాలేబు ఇలా అంటాడు: ‘మనం వాళ్లను ఓడించవచ్చు. ఇప్పుడే మనం వెళ్దాం!’ కాలేబు అలా ఎందుకు అన్నాడో మీకు తెలుసా? ఎందుకంటే కాలేబుకు, యెహోషువకు యెహోవా మీద నమ్మకం ఉంది. కానీ మిగిలిన పది మంది ఇలా అన్నారు: ‘వద్దు! ఆ ప్రజలు చాలా పెద్దగా, రాక్షసుల్లా ఉన్నారు! మేము వాళ్ల పక్కన మిడతల్లా కనిపిస్తున్నాం.’

ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. వాళ్లు పేచీలు పెడుతూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: ‘మనం వేరే నాయకుడిని ఎన్నుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్లిపోదాం. మనం ఆ దేశానికి వెళ్లి వాళ్ల చేతుల్లో ఎందుకు చచ్చిపోవాలి?’ యెహోషువ కాలేబు ఇలా అన్నారు: ‘యెహోవాకు అవిధేయత చూపించకండి, ఆయన మనలను కాపాడతాడు, భయపడకండి.’ కానీ ఇశ్రాయేలీయులు వినలేదు. వాళ్లు యెహోషువ కాలేబులను చంపాలని కూడా అనుకున్నారు.

యెహోవా ఏమి చేశాడు? ఆయన మోషేతో ఇలా చెప్పాడు: ‘నేను ఇశ్రాయేలీయుల కోసం అన్నీ చేశాను, కానీ వాళ్లు ఇంకా నా మాటకు లోబడట్లేదు. కాబట్టి వాళ్లు 40 సంవత్సరాలు ఈ ఎడారిలోనే ఉంటారు, ఇక్కడే చచ్చిపోతారు. నేను వాళ్లకు ఇస్తానన్న దేశంలో వాళ్ల పిల్లలు, యెహోషువ, కాలేబు మాత్రమే ఉంటారు.’

“అల్పవిశ్వాసులారా, మీరెందుకు ఇంత భయపడుతున్నారు?”—మత్తయి 8:26

ప్రశ్నలు: 12 మంది కనాను నుండి తిరిగి వచ్చాక ఏమి జరిగింది? యెహోషువ, కాలేబు తమకు యెహోవా మీద నమ్మకం ఉందని ఎలా చూపించారు?

సంఖ్యాకాండం 13:1–14:38; ద్వితీయోపదేశకాండం 1:22-33; కీర్తన 78:22; హెబ్రీయులు 3:17-19

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి