కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 30 పేజీ 76
  • రాహాబు గూఢచారులను దాచిపెట్టింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాహాబు గూఢచారులను దాచిపెట్టింది
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద నమ్మకం ఉంచిన రాహాబు
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • రాహాబు వేగులవాళ్లను దాచిపెట్టడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ఆమె “తన చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందింది”
    కావలికోట: దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
  • రాహాబు—విశ్వాస క్రియలనుబట్టి నీతిమంతురాలిగా తీర్చబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 30 పేజీ 76
సైనికుల్ని వేరే వైపు పంపించి రాహాబు గూఢచారుల్ని కాపాడుతుంది

లెసన్‌ 30

రాహాబు గూఢచారులను దాచిపెట్టింది

ఇశ్రాయేలీయులైన గూఢచారులు యెరికో పట్టణానికి వెళ్లినప్పుడు వాళ్లు రాహాబు అనే ఆమె ఇంట్లో ఉన్నారు. ఆ విషయం యెరికో రాజుకు తెలిసింది, ఆయన రాహాబు ఇంటికి సైనికులను పంపించాడు. ఆమె ఆ ఇద్దరు గూఢచారుల్ని ఇంటి పైన దాచిపెట్టి సైనికుల్ని వేరే వైపు పంపించింది. ఆమె ఆ ఇద్దరితో ఇలా అంది: ‘యెహోవా మీ వైపు ఉన్నాడని, మీరు ఈ దేశాన్ని ఓడిస్తారని నాకు తెలుసు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను. ప్లీజ్‌, మీరు నా కుటుంబాన్ని కాపాడతారని మాటివ్వండి.’

వాళ్లు రాహాబుతో ఇలా అన్నారు: ‘మీ ఇంటి లోపల ఉన్నవాళ్లెవ్వరికీ ఏమి కాదని మాటిస్తున్నాం. మీ కిటికీకి ఒక ఎర్ర తాడు కట్టు, అప్పుడు మీ కుటుంబానికి ఏం కాదు.’

యెరికో గోడలు కూలిపోతున్నప్పుడు, కిటికీకి ఎర్ర తాడు కట్టి ఉన్న రాహాబు ఇల్లు మాత్రం కూలిపోలేదు

రాహాబు తన ఇంటి కిటికీకి ఒక తాడు కట్టి దాని ద్వారా ఆ గూఢచారులను కిందకు దించింది. వాళ్లు కొండలకు వెళ్లిపోయి అక్కడ మూడు రోజులు దాక్కుని యెహోషువ దగ్గరకు తిరిగి వెళ్తారు. తర్వాత ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటి, ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధం అయ్యారు. వాళ్లు ఓడించిన మొదటి పట్టణం యెరికో. యెహోవా వాళ్లను ఆరు రోజులు ఆ పట్టణం చుట్టు రోజుకు ఒకసారి తిరగమని చెప్పాడు. ఏడవ రోజున, వాళ్లు ఆ పట్టణం చుట్టూ ఏడు సార్లు తిరిగారు. తర్వాత యాజకులు బూరలు ఊదారు. సైనికులందరూ అరవగలిగినంత గట్టిగా అరిచారు. ఆ పట్టణం గోడలు కూలిపోయాయి. అయితే, ఆ గోడ మీద ఉన్న రాహాబు ఇల్లు మాత్రం అలానే ఉంది. రాహాబు యెహోవాను నమ్మింది కాబట్టి ఆమెకు, ఆమె కుటుంబానికి ఏమీ కాలేదు.

“అలాగే రాహాబు . . . కూడా, గూఢచారుల్ని తన ఇంట్లో చేర్చుకుని, వాళ్లను ఇంకో దారిలో పంపించేసినప్పుడు తన చేతల వల్ల నీతిమంతురాలని తీర్పు పొందింది.”—యాకోబు 2:25

ప్రశ్నలు: రాహాబు గూఢచారులకు ఎందుకు సహాయం చేసింది? ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం మీద ఎలా దాడి చేశారు? రాహాబుకు, ఆమె కుటుంబానికి ఏమైంది?

యెహోషువ 2:1-24; 6:1-27; హెబ్రీయులు 11:30, 31; యాకోబు 2:24-26

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి