కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 34 పేజీ 84-పేజీ 85 పేరా 2
  • గిద్యోను మిద్యానీయులను ఓడిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గిద్యోను మిద్యానీయులను ఓడిస్తాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • గిద్యోను, అతని 300 మంది పురుషులు
    నా బైబిలు కథల పుస్తకము
  • పెద్దలారా—గిద్యోనులా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా మన సాటిలేని స్నేహితుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 34 పేజీ 84-పేజీ 85 పేరా 2
గిద్యోను అతని మనుషులు బూరలు ఊదుతారు, కుండలు పగులగొడతారు, దివిటీలు ఊపుతారు, అరుస్తారు

లెసన్‌ 34

గిద్యోను మిద్యానీయులను ఓడిస్తాడు

కొంతకాలానికి ఇశ్రాయేలు దేశం మళ్లీ యెహోవాకు దూరమై అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టింది. ఏడు సంవత్సరాలు మిద్యానీయులు ఇశ్రాయేలీయుల జంతువులను దొంగతనం చేశారు, వాళ్ల పంటలను పాడుచేశారు. మిద్యానీయుల నుండి తప్పించుకోవడానికి ఇశ్రాయేలీయులు కొండల్లో గుహల్లో దాక్కున్నారు. కాపాడమని వాళ్లు యెహోవాను అడిగారు. అప్పుడు యెహోవా దేవుడు గిద్యోను అనే అతని దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు. ఆ దూత ‘యెహోవా నిన్ను ఒక గొప్ప యోధునిగా ఉండడానికి ఎన్నుకున్నాడు’ అని చెప్పాడు. అందుకు గిద్యోను ఇలా అన్నాడు: ‘నేను ఇశ్రాయేలును ఎలా రక్షిస్తాను, నాకే అర్హత ఉంది?’

యెహోవా ఆయనను ఎన్నుకున్నాడని గిద్యోనుకు ఎలా తెలుస్తుంది? గొర్రె బొచ్చును నేల మీద పెట్టి యెహోవాతో గిద్యోను ఇలా అన్నాడు: ‘రేపు ఉదయం కల్లా, నేలంతా పొడిగా ఉండి గొర్రె బొచ్చు మాత్రం తడిగా ఉంటే, నేను ఇశ్రాయేలును కాపాడాలని నువ్వు కోరుకుంటున్నావని నమ్ముతాను.’ ఆ తర్వాత పొద్దున కల్లా గొర్రె బొచ్చు పూర్తిగా తడిచిపోయింది కానీ నేలంతా పొడిగా ఉంది. అయితే గిద్యోను మళ్లీ రేపు ఉదయం కల్లా గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉండి నేలంతా తడిగా ఉండాలి అని అడిగాడు. అలానే జరిగినప్పుడు యెహోవా తనను ఎన్నుకున్నాడని చివరికి గిద్యోనుకు నమ్మకం కలిగింది. ఆయన మిద్యానీయులతో యుద్ధం చేయడానికి సైనికుల్ని తెచ్చుకుంటాడు.

యెహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు: ‘నేను ఇశ్రాయేలీయులు గెలిచేలా చేస్తాను. కానీ నీ దగ్గర చాలామంది సైనికులు ఉన్నారు కాబట్టి నువ్వు నీ సొంతగా యుద్ధం గెలిచావని అనుకోవచ్చు. భయపడే వాళ్లంతా ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పు.’ అప్పుడు 22,000 మంది ఇంటికి వెళ్లిపోయారు, 10,000 మంది ఉండిపోయారు. తర్వాత యెహోవా ఇలా అన్నాడు: ‘ఇంకా సైనికులు ఎక్కువమంది ఉన్నారు. వాళ్లను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లి నీళ్లు తాగమని చెప్పు. ఎవరైతే శత్రువు వస్తాడేమో అని చూసుకుంటూ జాగ్రత్తగా తాగుతారో వాళ్లనే నీతో ఉంచుకో.’ అలా 300 మంది మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటూ తాగారు. అప్పుడు ఆ కొంతమందే 1,35,000 మిద్యాను సైనికుల్ని ఓడిస్తారని యెహోవా మాట ఇస్తాడు.

ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో, ‘మిద్యానీయుల మీద యుద్ధం చేసే సమయం వచ్చేసింది’ అని చెప్పాడు. అప్పుడు గిద్యోను వాళ్లందరికీ బూరల్ని, పెద్దపెద్ద కుండల లోపల దివిటీలను పెట్టి ఇస్తాడు. ఆయన వాళ్లతో ‘నేను ఏమి చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. నేను ఎలా చేస్తే మీరు అలానే చేయాలి’ అన్నాడు. గిద్యోను బూర ఊది, కుండను పగులగొట్టి, దివిటీని ఊపి గట్టిగా ఇలా అరుస్తాడు: ‘యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం.’ ఆ 300 మంది కూడా అలానే చేస్తారు. అప్పుడు మిద్యానీయులు భయపడిపోయి అన్ని వైపుల పరిగెడతారు. ఆ గందరగోళంలో వాళ్లు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెడతారు. ఇంకొకసారి యెహోవా దేవుడు శత్రువుల్ని ఓడించడానికి ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తాడు.

భయపడిపోయిన మిద్యాను సైనికులు

“మాకున్న అసాధారణ శక్తి దేవుడు ఇచ్చిందే కానీ మా సొంతది కాదు.”—2 కొరింథీయులు 4:7

ప్రశ్నలు: గిద్యోనును ఎన్నుకున్నాడని యెహోవా ఎలా చూపించాడు? గిద్యోను సైన్యంలో 300 మంది మాత్రమే ఎందుకు ఉన్నారు?

న్యాయాధిపతులు 6:1-16; 6:36–7:25; 8:28

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి