కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 35 పేజీ 86-పేజీ 87 పేరా 1
  • హన్నా ఒక కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హన్నా ఒక కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆమె ప్రార్థనలో దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరించింది
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని కుమ్మరించింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • హన్నాకు మనశ్శాంతి ఎలా లభించింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవా మీకు ఊరటను ఇవ్వనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 35 పేజీ 86-పేజీ 87 పేరా 1
హన్నా చిన్ని సమూయేలును గుడారం దగ్గర ఏలీకి ఇచ్చేస్తుంది

లెసన్‌ 35

హన్నా ఒక కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది

ఎల్కానా అనే ఇశ్రాయేలీయుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వాళ్ల పేర్లు హన్నా, పెనిన్నా. అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె ఎప్పుడూ హన్నాను వెక్కిరిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం, ఎల్కానా అతని కుటుంబాన్ని ఆరాధన కోసం షిలోహులో ఉన్న గుడారానికి తీసుకెళ్లేవాడు. ఒకసారి వాళ్లు అక్కడికి వెళ్లినప్పుడు ఆయనెంతో ప్రేమిస్తున్న హన్నా చాలా దిగులుగా ఉండడం చూశాడు. ఆయన ఆమెతో, ‘ప్లీజ్‌ ఏడవకు హన్నా, నీకు నేను ఉన్నానుగా, నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు.

తర్వాత హన్నా ప్రార్థన చేసుకోవడానికి వెళ్లిపోతుంది. సహాయం చేయమని యెహోవాను అడుగుతున్నప్పుడు ఆమె ఏడవకుండా ఉండలేకపోయింది. ‘యెహోవా, నాకు ఒక కొడుకుని ఇస్తే నేను అతనిని నీకు ఇచ్చేస్తాను, జీవితాంతం అతను నీ సేవ చేస్తాడు’ అని మాట ఇచ్చింది.

హన్నా ప్రార్థన చేస్తూ ఏడవడం ఏలీ చూస్తాడు

హన్నా వెక్కివెక్కి ఏడుస్తున్నప్పుడు యాజకుడైన ఏలీ ఆమె తాగి ఉందని అనుకున్నాడు. హన్నా అతనితో, ‘ప్రభూ నేను తాగి లేను. నాకు చాలా పెద్ద సమస్య ఉంది, దాని గురించి యెహోవాతో మాట్లాడుతున్నాను’ అని చెప్పింది. ఏలీ తప్పుగా అనుకున్నాడని అతనికి అర్థమై హన్నాతో ఇలా అన్నాడు: ‘నీకు కావాల్సింది దేవుడు నీకు ఇస్తాడు.’ తర్వాత హన్నా బాధ తగ్గి అక్కడి నుండి వెళ్లిపోయింది. సంవత్సరం పూర్తి అవ్వకముందే ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. హన్నాకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో మీరు ఊహించుకోగలరా?

హన్నా యెహోవాకు ఇచ్చిన మాటను మర్చిపోలేదు. సమూయేలుకు పాలు తాగే వయసు దాటగానే ఆమె అతన్ని గుడారం దగ్గర సేవ చేయడానికి తెచ్చేసింది. ఆమె ఏలీతో ఇలా చెప్పింది: ‘నేను ప్రార్థన చేసింది ఈ బాబును ఇవ్వమనే. అతన్ని నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను.’ ఎల్కానా, హన్నా ప్రతి సంవత్సరం ఆయనకు ఒక కొత్త అంగీని తెచ్చి ఇచ్చేవాళ్లు. హన్నాకు యెహోవా ఇంకో ముగ్గురు కొడుకుల్ని ఇద్దరు కూతురుల్ని ఇచ్చాడు.

“అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది.”—మత్తయి 7:7

ప్రశ్నలు: హన్నా ఎందుకు దిగులుగా ఉంది? యెహోవా హన్నాను ఎలా ఆశీర్వదించాడు?

1 సమూయేలు 1:1–2:11, 18-21

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి