కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 38 పేజీ 92-పేజీ 93 పేరా 2
  • యెహోవా సమ్సోనుకు బలాన్ని ఇచ్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సమ్సోనుకు బలాన్ని ఇచ్చాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • గొప్ప బలంగల వ్యక్తి
    నా బైబిలు కథల పుస్తకము
  • సమ్సోను యెహోవా శక్తితో జయించాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • సమ్సోనులా యెహోవా మీద ఆధారపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 38 పేజీ 92-పేజీ 93 పేరా 2
సమ్సోను దాగోను గుడి స్తంభాల్ని నెట్టినప్పుడు అది కూలిపోతుంది

లెసన్‌ 38

యెహోవా సమ్సోనుకు బలాన్ని ఇచ్చాడు

చాలామంది ఇశ్రాయేలీయులు తిరిగి విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు, అందుకే యెహోవా వాళ్ల దేశాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. కానీ యెహోవాను ప్రేమించే ఇశ్రాయేలీయులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒక అతను మానోహ. అతనికి పిల్లలు లేరు. ఒకరోజు యెహోవా మానోహ భార్య దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు. ఆ దూత ఆమెతో, ‘మీకు ఒక కొడుకు పుడతాడు. అతను ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల నుండి కాపాడతాడు. అతను నాజీరుగా ఉంటాడు’ అని చెప్పాడు. నాజీరులు అంటే ఎవరో మీకు తెలుసా? వాళ్లు యెహోవాకు ప్రత్యేకమైన సేవకులు. నాజీరులు జుట్టు కత్తిరించుకోకూడదు.

కొంతకాలానికి మానోహకు కొడుకు పుట్టాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టారు. సమ్సోను పెద్దవాడు అయ్యాక, యెహోవా అతనికి చాలా బలం ఇచ్చాడు. అతను వట్టి చేతులతో సింహాన్ని చంపగలిగాడు. ఒకసారి సమ్సోను ఒక్కడే 30 మంది ఫిలిష్తీయుల్ని చంపాడు. ఫిలిష్తీయులకు అతను అంటే అస్సలు ఇష్టం లేదు. అతన్ని ఎలాగైనా చంపాలని చూశారు. ఒకరోజు రాత్రి సమ్సోను గాజాలో నిద్రపోతున్నప్పుడు వాళ్లు అక్కడకు వెళ్లి తెల్లవారిన తర్వాత అతన్ని చంపాలని ఆ పట్టణం గేట్‌ దగ్గర ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ రాత్రి మధ్యలోనే సమ్సోను నిద్ర లేచి, పట్టణం గేట్‌ దగ్గరకు వెళ్లి దాన్ని ఊడబీకాడు. అతను ఆ పట్టణం గేట్‌ని అతని భుజాల మీద పెట్టుకుని హెబ్రోను కొండపైవరకు తీసుకెళ్లాడు.

తర్వాత ఫిలిష్తీయులు సమ్సోను ప్రేమిస్తున్న దెలీలా దగ్గరకు వెళ్లి ఆమెతో ఇలా అన్నారు: ‘సమ్సోను ఎందుకు అంత బలంగా ఉంటాడో నువ్వు కనుక్కుంటే మేము నీకు వెయ్యి వెండి నాణాలు ఇస్తాము. అతన్ని పట్టుకుని జైల్లో వేయాలని అనుకుంటున్నాము.’ దెలీలా ఆ డబ్బు మీద ఆశతో ఒప్పుకుంది. సమ్సోను ఎందుకు అంత బలంగా ఉంటాడో ముందు చెప్పలేదు. కానీ ఆమె అతన్ని విసిగించి విసిగించి ఆ రహస్యం చెప్పేలా చేసింది. ‘నా జుట్టుని ఇప్పటి వరకు ఎప్పుడూ కత్తిరించలేదు, ఎందుకంటే నేను ఒక నాజీరుని. నా జుట్టుని కత్తిరిస్తే నా బలం పోతుంది,’ అని అతను ఆమెకు చెప్పాడు. సమ్సోను అలా చెప్పి చాలా పెద్ద తప్పు చేశాడు కదా?

దెలీలా వెంటనే ఫిలిష్తీయులకు, ‘నాకు అతని రహస్యం తెలిసిపోయింది’ అని చెప్పింది. సమ్సోనును ఆమె ఒళ్లో నిద్రపోయేలా చేసి వేరే అతనితో సమ్సోను జుట్టును కత్తిరించి తర్వాత ఇలా అరిచింది: ‘సమ్సోను ఫిలిష్తీయులు వచ్చేశారు.’ సమ్సోను లేచాడు కానీ అతని బలమంతా పోయింది. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని, గుడ్డివాడిని చేసి, జైల్లో పడేశారు.

ఒకరోజు వేలమంది ఫిలిష్తీయులు వాళ్ల దేవుడు దాగోను గుడిలో కలుసుకుని ఇలా అరుస్తున్నారు: ‘మన దేవుడు సమ్సోనుని మన చేతికి అప్పగించాడు! సమ్సోనుని ఇక్కడికి తీసుకురండి. మనం అతన్ని ఏడిపించి నవ్వుకుందాం.’ వాళ్లు అతన్ని తీసుకొచ్చి రెండు స్తంభాల మధ్య నిలబెట్టారు, అతన్ని బాగా వెక్కిరించారు. అప్పుడు సమ్సోను ‘యెహోవా, ప్లీజ్‌ నాకు ఒక్కసారి బలాన్ని ఇవ్వు’ అని అడిగాడు. అప్పటికి సమ్సోను జుట్టు కూడా పొడవుగా పెరిగింది. అతను బలమంతా ఉపయోగించి ఆ గుడి స్తంభాల్ని నెట్టాడు. ఆ గుడి అంతా కిందికి కూలిపోయింది. అందులో ఉన్న వాళ్లందరూ చనిపోయారు, సమ్సోను కూడా చనిపోయాడు.

“ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13

ప్రశ్నలు: సమ్సోను ఎందుకు అంత బలంగా ఉన్నాడు? సమ్సోను ఎందుకు బలంగా ఉన్నాడో దెలీలాకు చెప్పినప్పుడు అతనికి ఏం జరిగింది?

న్యాయాధిపతులు 13:1–16:31

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి