కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 41 పేజీ 100-పేజీ 101 పేరా 2
  • దావీదు, సౌలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దావీదు, సౌలు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది
    నా బైబిలు కథల పుస్తకము
  • దావీదు రాజుగా చేయబడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • 1 సమూయేలు విషయసూచిక
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 41 పేజీ 100-పేజీ 101 పేరా 2
సౌలు ఉన్న చోటుకు వినబడేలా దావీదు అరుస్తాడు

లెసన్‌ 41

దావీదు, సౌలు

దావీదు గొల్యాతును చంపిన తర్వాత సౌలు ఆయనను తన సైన్యం మీద అధికారిగా పెడతాడు. దావీదు చాలా యుద్ధాల్లో గెల్చాడు, పెద్ద పేరు తెచ్చుకున్నాడు. దావీదు యుద్ధం చేసి ఇంటికి వచ్చిన ప్రతిసారి, స్త్రీలు బయటకు వచ్చి డాన్స్‌ చేస్తూ ఇలా పాడేవాళ్లు: ‘సౌలు వేల మందిని చంపాడు, దావీదు పదివేల మందిని చంపాడు!’ సౌలు దావీదును చూసి కుళ్లుకున్నాడు, అతనిని చంపాలని అనుకున్నాడు.

దావీదు వీణ లాంటి సంగీత వాయిద్యాన్ని బాగా వాయించేవాడు. ఒకరోజు దావీదు ఆ వాయిద్యాన్ని వాయిస్తుండగా సౌలు తన ఈటెను గట్టిగా దావీదు మీదకు విసిరాడు. దావీదు వెంటనే పక్కకు జరిగి తప్పించుకున్నప్పుడు అది వెళ్లి గోడకు గుచ్చుకుంది. ఆ తర్వాత సౌలు చాలాసార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. చివరికి దావీదు పారిపోయి ఎడారిలో దాక్కున్నాడు.

సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు అతని ఈటెను తీసుకుంటాడు

సౌలు 3,000 మంది సైనికులను తీసుకుని దావీదును పట్టుకోవడానికి వెళ్లాడు. సౌలు అనుకోకుండా దావీదు, అతని మనుషులు దాక్కున్న గుహలోకే వెళ్లాడు. దావీదు మనుషులు అతనితో చిన్నగా ఇలా చెప్పారు: ‘సౌలును చంపడానికి నీకు ఇదే అవకాశం.’ దావీదు సౌలు దగ్గరకు మెల్లగా వెళ్లి రాజుగా ఆయన వేసుకున్న బట్టల్లో చిన్న ముక్క చింపుతాడు. సౌలుకు అది తెలియలేదు. తర్వాత యెహోవా అభిషేకించిన రాజుకు గౌరవం చూపించలేదని దావీదు చాలా బాధ పడ్డాడు. తన మనుషుల్ని సౌలు మీద దాడి చేయనివ్వలేదు. అతను సౌలును పిలిచి, నిన్ను చంపడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు కావాలనుకుంటే చంపేవాణ్ణి అన్నాడు. మరి దావీదు విషయంలో సౌలు తన మనసును మార్చుకున్నాడా?

లేదు. సౌలు దావీదు కోసం వెదుకుతూనే ఉన్నాడు. ఒక రాత్రి దావీదు, అతని బంధువైన అబీషై రహస్యంగా సౌలు ఉండే చోటుకు వెళ్లారు. సౌలు కాపలాదారుడైన అబ్నేరు కూడా నిద్రపోతున్నాడు. అబీషై ఇలా అంటాడు: ‘ఇదే మనకు మంచి అవకాశం! నేను అతన్ని చంపేయనా?’ దావీదు ఇలా చెప్పాడు: ‘సౌలు సంగతి యెహోవా చూసుకుంటాడు. అతని ఈటెను, నీళ్ల జగ్గును మాత్రం మనం తీసుకెళ్దాం.’

సౌలు ఉన్న చోటు కనపడేలా ఒక కొండ ఎక్కి దావీదు ఇలా అరిచాడు: ‘అబ్నేరు. ఎందుకు నీ రాజును కాపాడలేదు? సౌలు జగ్గు, ఈటె ఎక్కడ?’ సౌలు దావీదు స్వరాన్ని గుర్తుపట్టి ఇలా అన్నాడు: ‘నన్ను చంపే అవకాశం నీకు వచ్చినా అలా చేయలేదు. నా తర్వాత నువ్వు ఇశ్రాయేలీయులకు రాజువి అవుతావు.’ సౌలు తన రాజభవనానికి తిరిగి వెళ్లి పోయాడు. అయితే సౌలు కుటుంబంలో అందరికీ దావీదు మీద కోపం లేదు.

“సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి. ప్రియ సహోదరులారా, మీకు మీరే పగతీర్చుకోకండి, దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వండి.”—రోమీయులు 12:18, 19

ప్రశ్నలు: సౌలు దావీదును ఎందుకు చంపాలని అనుకుంటాడు? దావీదు సౌలును ఎందుకు చంపలేదు?

1 సమూయేలు 16:14-23; 18:5-16; 19:9-12; 23:19-29; 24:1-15; 26:1-25

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి