కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 43 పేజీ 104
  • దావీదు రాజు చేసిన పాపం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దావీదు రాజు చేసిన పాపం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • దావీదు ఇంట్లో శ్రమ
    నా బైబిలు కథల పుస్తకము
  • మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • పాపాన్ని ఒప్పుకోవడం స్వస్థతకు నడిపిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ‘విరిగి నలిగిన హృదయం’ క్షమాపణ అడిగితే?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 43 పేజీ 104
నాతాను ప్రవక్త దావీదు రాజును సరిదిద్దుతున్నాడు

లెసన్‌ 43

దావీదు రాజు చేసిన పాపం

సౌలు చనిపోయాక, దావీదు రాజు అయ్యాడు. అప్పుడు అతనికి 30 సంవత్సరాలు. రాజు అయిన కొన్ని సంవత్సరాలకు, ఒకరోజు రాత్రి దావీదు అతని మేడ పైనుండి ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆమె పేరు బత్షెబ అని, ఊరియా అనే సైనికుని భార్య అని తెలుసుకుంటాడు. దావీదు ఆమెను రాజభవనానికి రప్పిస్తాడు. ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆమె గర్భవతి అవుతుంది. దావీదు చేసిన తప్పును దాచిపెట్టాలని అనుకుంటాడు. అతని సైన్యాధికారితో ఊరియాను యుద్ధంలో ముందు వరుసలో పెట్టి, ఒక్కడినే వదిలేయమని చెప్తాడు. ఊరియా యుద్ధంలో చనిపోయాక, దావీదు బత్షెబను పెళ్లి చేసుకుంటాడు.

దావీదు రాజు క్షమాపణ కోసం ప్రార్థన చేస్తాడు

జరిగిన ఈ చెడ్డ విషయాలన్నీ యెహోవా చూశాడు. మరి ఆయన ఏమి చేశాడు? యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరకు పంపిస్తాడు. నాతాను ఇలా చెప్పాడు: ‘బాగా డబ్బు ఉన్న ఒకతనికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒకేఒక్క గొర్రెపిల్ల ఉంది, అదంటే అతనికి చాలా ఇష్టం. కానీ ఆ ధనవంతుడు పేదవాడి దగ్గర ఉన్న ఒక్క గొర్రెపిల్లను తీసేసుకున్నాడు.’ దావీదు చాలా కోపంతో ఇలా అన్నాడు: ‘అతనికి మరణ శిక్ష వేయాలి!’ నాతాను దావీదుతో ఇలా చెప్పాడు: ‘ఆ ధనవంతుడివి నువ్వే!’ దావీదు గుండె బద్దలు అయిపోయింది, నాతాను దగ్గర ఇలా ఒప్పుకున్నాడు: ‘నేను యెహోవాకు ఇష్టం లేని పని చేశాను.’ ఈ తప్పు దావీదుకు అతని కుటుంబానికి ఎన్నో కష్టాలను తీసుకొచ్చింది. యెహోవా దావీదును శిక్షించాడు, కానీ అతనికి మరణశిక్ష వేయలేదు ఎందుకంటే ఆయన నిజాయితీగా వినయంగా ఉన్నాడు.

దావీదు యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టాలని అనుకున్నాడు. కానీ దావీదు కొడుకైన సొలొమోను ఆ ఆలయాన్ని కట్టాలని యెహోవా నిర్ణయించాడు. సొలొమోను ఆలయం కట్టడానికి దావీదు అన్నీ సిద్ధం చేస్తూ ఇలా అన్నాడు: ‘యెహోవా ఆలయం చాలా గొప్పగా ఉండాలి. సొలొమోను ఇంకా చిన్నవాడే, నేను అతనికి అన్నీ సిద్ధం చేసి సహాయం చేస్తాను.’ ఆ పని చేయడానికి దావీదు తన సొంత డబ్బును చాలా ఇచ్చాడు. పని బాగా చేసే వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకున్నాడు. బంగారాన్ని, వెండిని సమకూర్చి, తూరు సీదోనుల నుండి దేవదారు మ్రానుల్ని తెప్పిస్తాడు. చనిపోయే కొన్నిరోజుల ముందు ఆలయాన్ని ఎలా కట్టాలో దావీదు సొలొమోనుకు చెప్తాడు. దావీదు ఇలా చెప్తాడు: ‘యెహోవా ఈ విషయాలను నీ కోసం నాతో రాయించాడు. యెహోవా నీకు సహాయం చేస్తాడు. భయపడకు. ధైర్యంగా ఉండి, పని మొదలుపెట్టు.’

యువకుడైన సొలొమోనుతో దావీదు ఆలయాన్ని కట్టే పనులు గురించి వివరిస్తున్నాడు

“తన దోషాన్ని కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడి మీద కరుణ చూపించబడుతుంది.”—సామెతలు 28:13

ప్రశ్నలు: దావీదు చేసిన పాపం ఏమిటి? తన కొడుకు సొలొమోనుకు సహాయం చేయడానికి దావీదు ఏమి చేశాడు?

2 సమూయేలు 5:3, 4, 10; 7:1-16; 8:1-14; 11:1–12:14; 1 దినవృత్తాంతాలు 22:1-19; 28:11-21; కీర్తన 51:1-19

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి