కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 52 పేజీ 126-పేజీ 127 పేరా 1
  • యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు మరి మీరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యథార్థత మరియు స్వయంత్యాగ స్ఫూర్తికి మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ‘యెహోవా దినంలో’ ఎవరు సజీవంగా మిగిలి ఉంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 52 పేజీ 126-పేజీ 127 పేరా 1
సిరియా సైన్యం ఎలీషాను, అతని సేవకుడిని చుట్టుముట్టింది

లెసన్‌ 52

యెహోవా అగ్ని గుర్రాలు, రథాలు

సిరియా రాజైన బెన్హదదు ఇశ్రాయేలు దేశంపై దాడి చేస్తూ ఉన్నాడు. కానీ ప్రతీసారి ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు దాడి గురించి ముందే చెప్పడం వల్ల అతను తప్పించుకుంటూ ఉన్నాడు. అందుకని బెన్హదదు ఎలీషాను పట్టుకుని బంధించాలనుకున్నాడు. ఎలీషా దోతాను నగరంలో ఉన్నాడని తెలుసుకుని, అతన్ని పట్టుకోవడానికి సిరియా సైన్యాన్ని అక్కడికి పంపిస్తాడు.

సిరియన్లు దోతానుకు రాత్రిపూట వచ్చారు. తర్వాత రోజు ఉదయం, ఎలీషా సేవకుడు బయటికి వెళ్లినప్పుడు నగరం చుట్టూ పెద్ద సైన్యాన్ని చూశాడు. భయపడిపోయి ఇలా అరిచాడు: ‘ఎలీషా, మనం ఇప్పుడు ఏం చేయాలి?’ ఎలీషా ఇలా అన్నాడు: ‘వాళ్ల దగ్గర కన్నా మన దగ్గరే ఎక్కువమంది ఉన్నారు.’ అప్పుడు ఎలీషా సేవకుడు నగరం చుట్టూ కొండలపై ఉన్న గుర్రాలు, అగ్ని యుద్ధ రథాలు చూసేలా యెహోవా చేశాడు.

ఎలీషా, అతని సేవకుడు వాళ్ల చుట్టూ ఉన్న పరలోక సైన్యాన్ని చూస్తున్నారు

ఎలీషాను పట్టుకోవడానికి సిరియా సైనికులు వచ్చినప్పుడు అతను ఇలా ప్రార్థించాడు: ‘యెహోవా ప్లీజ్‌, వీళ్లందరూ గుడ్డివాళ్లు అయిపోయేలా చెయ్యి.’ అప్పుడు, ఆ సైనికులకు అన్నీ కనిపించినా వాళ్లు ఎక్కడున్నారో చెప్పలేకపోయారు. ఎలీషా ఆ సైనికులతో ఇలా అన్నాడు: ‘మీరు వేరే నగరానికి వచ్చారు. నా వెంట రండి, మీరు వెతుకుతున్న అతని దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను.’ వాళ్లు ఇశ్రాయేలు రాజు ఉన్న షోమ్రోను వరకు ఎలీషా వెంట వెళ్లారు.

చివరికి, వాళ్లు ఎక్కడున్నారో సిరియన్లు గుర్తుపట్టారు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇశ్రాయేలు రాజు ఎలీషాను ఇలా అడిగాడు: ‘నేను వీళ్లను చంపేయనా?’ ఈ అవకాశం ఉపయోగించుకుని ఎలీషా తనను బాధపెట్టాలనుకున్న వాళ్ల మీద పగ తీర్చుకున్నాడా? లేదు. ఎలీషా ఇలా అన్నాడు: ‘వాళ్లను చంపవద్దు. భోజనం పెట్టి, వాళ్ల దారిన వాళ్లను పంపించు.’ అప్పుడు రాజు పెద్ద విందు ఏర్పాటు చేసి, వాళ్లను ఇంటికి పంపిస్తాడు.

సిరియా సైనికులు షోమ్రోనులో భోంచేస్తున్నారు

“మనకున్న నమ్మకం ఏమిటంటే, మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.”—1 యోహాను 5:14

ప్రశ్నలు: ఎలీషాను, అతని సేవకుడిని యెహోవా ఎలా కాపాడాడు? యెహోవా మిమ్మల్ని కూడా కాపాడగలడా?

2 రాజులు 6:8-24

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి