కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 75 పేజీ 178-పేజీ 179 పేరా 4
  • అపవాది యేసును పరీక్షిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపవాది యేసును పరీక్షిస్తాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పు చేయాలనే కోరికకు లొంగిపోకూడదు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • యేసులా ‘అపవాదిని ఎదిరించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యేసులా ప్రలోభాల్ని తిప్పికొట్టండి
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసుకు కలిగిన శోధనలనుండి నేర్చుకొనుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 75 పేజీ 178-పేజీ 179 పేరా 4
ఆలయంలో ఎత్తైన చోటు నుండి దూకడానికి యేసు ఒప్పుకోలేదు

లెసన్‌ 75

అపవాది యేసును పరీక్షిస్తాడు

రాళ్లను రొట్టెలుగా మార్చడానికి యేసు ఒప్పుకోలేదు

యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పవిత్ర శక్తి అతన్ని ఎడారిలోకి నడిపించింది. 40 రోజులు ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఆయనకు బాగా ఆకలేసింది. అప్పుడు అపవాది యేసుతో ఏదైనా తప్పు చేయించాలని ఇలా అన్నాడు: ‘నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే, రొట్టెలుగా అవ్వమని ఈ రాళ్లతో చెప్పు.’ కానీ యేసు లేఖనాలనుండి ఇలా జవాబు ఇచ్చాడు: ‘మనిషి ఆహారం వల్ల మాత్రమే జీవించడు. కానీ యెహోవా చెప్పే ప్రతీ మాట వినడం వల్ల జీవిస్తాడు అని రాసి ఉంది.’

తర్వాత అపవాది యేసుతో ‘నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే, ఆలయంలో ఎత్తైన స్థలం నుండి దూకు. దేవుడు తన దూతల్ని పంపించి నిన్ను పట్టుకుంటాడని రాసి ఉంది’ అని సవాలు చేశాడు. కానీ యేసు మళ్లీ లేఖనాల నుండి ఇలా చెప్పాడు: ‘యెహోవాను పరీక్షించకూడదని రాసి ఉంది.’

సాతాను లోక రాజ్యాలన్నిటిని ఇస్తానని చెప్పినప్పుడు యేసు వద్దన్నాడు

తర్వాత సాతాను యేసుకు లోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ, వాటి ధనాన్ని, గొప్పతనాన్ని చూపించి ఇలా అన్నాడు: ‘నన్ను ఒక్కసారి ఆరాధిస్తే నేను నీకు ఈ రాజ్యాలు, వాటి గొప్పతనమంతా ఇచ్చేస్తాను.’ కానీ యేసు ఇలా అన్నాడు: ‘సాతాను వెళ్లిపో! యెహోవా ఒక్కడినే ఆరాధించాలని రాసి ఉంది.’

ఇక అపవాది వెళ్లిపోయాడు, దేవదూతలు వచ్చి యేసుకు తినడానికి ఆహారం ఇచ్చారు. అప్పటి నుండి యేసు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాడు. అతన్ని భూమ్మీదకు పంపించింది ఈ పని చేయడానికే. యేసు ప్రజలకు నేర్పించిన వాటిని వాళ్లు ఎంతో ప్రేమించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఆయన వెంట వెళ్లారు.

“[అపవాది] అబద్ధం చెప్పేటప్పుడు తన స్వభావం ప్రకారమే మాట్లాడతాడు; ఎందుకంటే అతను అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి.”—యోహాను 8:44

ప్రశ్నలు: మూడు పరీక్షలు ఏంటి? యేసు అపవాదికి ఎలా జవాబు ఇచ్చాడు?

మత్తయి 4:1-11; మార్కు 1:12, 13; లూకా 4:1-15; ద్వితీయోపదేశకాండం 6:13, 16; 8:3; యాకోబు 4:7

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి