పాట 75
‘నేనున్నాను! నన్ను పంపించు!’
1. నేడు దేవుని పేరును
ఎన్నో మాటలంటున్నారు.
జాలి, దయ లేనోడంటూ
దేవుడు లేడనేస్తారు.
తొలగించి ఆ నిందలు,
స్తుతి పాడేవాళ్లెవరు?
(పల్లవి 1)
పంపించు యెహోవా నన్ను,
నే నీకు స్తుతి పాడతా.
ఇంకేది ముఖ్యం కాదు దేవా
నేనున్నాను, పంపించు.
2. అంతా చూస్తూ, ఏం చేయడా?
అంటూ ప్రశ్నలేస్తుంటారు
బొమ్మల్ని పూజిస్తుంటారు
మనిషే దేవుడంటారు
దేవుని తీర్పు తెలిపి
హెచ్చరించేవాళ్లెవరు?
(పల్లవి 2)
పంపించు యెహోవా నన్ను,
నే ధైర్యంగా హెచ్చరిస్తా.
ఇంకేది ముఖ్యం కాదు దేవా
నేనున్నాను, పంపించు.
3. మంచోళ్లకే కన్నీళ్లన్నీ
ఆగే దారేదీ లోకంలో?
ఆశేదైనా ఉందా అని
ఎదురుచూస్తూ ఉంటారు.
వాళ్ల కన్నీరు తుడిచి
సత్యాన్ని చెప్పేదెవరు?
(పల్లవి 3)
పంపించు యెహోవా నన్ను,
ఓర్పుతో నేను బోధిస్తా
ఇంకేది ముఖ్యం కాదు దేవా
నేనున్నాను, పంపించు.
(కీర్త. 10:4; యెహె. 9:4 కూడా చూడండి.)