కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 1/1 పేజీలు 8-9
  • యేసు ఉపమానములనుండి ప్రయోజనము పొందుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు ఉపమానములనుండి ప్రయోజనము పొందుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉపమానములతో బోధించుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • రాజ్యం గురించిన ఉదాహరణలు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • ‘ఉపమానము లేకుండా వారికేమియు బోధింపలేదు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 1/1 పేజీలు 8-9

యేసు’ జీవితము పరిచర్య

యేసు ఉపమానములనుండి ప్రయోజనము పొందుట

సముద్రతీరమున జనసమూహమునకు యేసు ఉపన్యసించిన తదుపరి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఉపదేశించుటలో ఆయన చేపట్టిన క్రొత్త పద్ధతిని గూర్చి తెలిసికోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఆయన ఉపమానములను వాడుట వారు ముందు విన్నారు, గాని యింత విస్తృతంగా వాడడం వినలేదు. కనుక వారు తెలిసికొనగోరి, “నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు?” అని అడిగారు.

ఆయన అలా చేయడానికి గల కారణములో ఒకటి ఈ ప్రవచన మాటల నెరవేర్పుకొరకు “నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను.” కాని అంతకన్నా గొప్ప కారణమున్నది. ఆయన ఉపమానములను వాడుట ప్రజల హృదయదృక్పథము బహిర్గతమగుటకు సహాయపడింది.

వాస్తవంగా యేసు మంచి కధలు చెప్పేవాడని, అద్భుత కార్యాలు చేస్తాడని అనేకులు ఆసక్తి చూపారేగాని, ప్రభువుగా సేవించదగినవాడని, నిస్వార్థంగా అనుసరించదగినవాడని కాదు. తమ జీవనవిధానములోగాని, తమ దృక్పథాలలోగాని ఆటంకపర్చబడడం వారికి యిష్టంలేదు. ఆ వర్తమానము అంతమేరకు చొచ్చుకొని పోవుట వారికి యిష్టం లేదు కనుక యేసు యిట్లన్నారు: “ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను, ఈ ప్రజల హృదయము క్రొవ్వినది. వారు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు ఆను యెషయా ప్రవచనము వీరి విషయములో నెరవేరినది.”

యేసు యింకా చెప్పుచు, “అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచు వాటిని చూడగోరియు చూడక పోయిరి. మీరు వినువాటిని విన గోరియు వినక పోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

అవును 12 మంది అపొస్తలులు, వారితో ఉన్నవారికి గ్రహించే హృదయములున్నవి. అందుచే యేసు వారితో ఇలా అన్నారు: “పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది, గాని వారికి అనుగ్రహింపబడలేదు.” అర్ధాన్ని గ్రహించాలని వారికున్న ఆసక్తి మూలంగా విత్తువాని గూర్చిన ఉపమానమును యేసు తన శిష్యులకు వివరించును.

“విత్తనము దేవుని వాక్యము” నేల హృదయము అని యేసు చెప్పెను. త్రోవప్రక్కన విత్తబడిన విత్తనము గూర్చి ఆయన వివరిస్తూ: “నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తికొని పోవును.”

రాతినేల నుండు వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. అయితే, అటువంటి వారి హృదయములలోనికి వాక్యము లోతుగా వేరుపారులేదు గనుక శోధనకాలములో లేదా శ్రమలు వచ్చినప్పుడు వీరు పడిపోవుదురు.

ముండ్ల పోదలలో పడిన విత్తనముల సంగతేమంటే, అవి యేసు చెప్పుచు, వాక్యమును వినిన ప్రజలను సూచించుచున్నదనెను. అయితే, వీరు ఈ జీవన సంబంధమగు ఐహిక విచారములు, ధనము మరియు వినోదములకు కొనిపోబడిరి, కనుక వారు పూర్తిగా అణిచి వేయబడిన పరిపూర్ణతకు రాలేరు.

చివరకు మంచినేలను పడిని విత్తనములు, సరియైన మరియు మంచి హృదయముతో వాక్యమును విని దానిని పదిలపర్చుకొని సహనముతో ఫలించిన వారిని సూచించుచున్నవని యేసు చెప్పెను.

తన ఉపదేశముల భావమును పొందుటకు యేసు అడిగిన ఈ శిష్యులు ఎంతగా దీవెనలు పొందగలరు! ఈ ఉపమానములను అర్థము చేసికొని, యితరులలో సత్యము నాటవలెనని యేసు ఉద్దేశించెను. “దీపమును వెలిగించి కుంచము క్రింద, మంచము క్రింద పెట్టుదురా?” ఆయన ప్రశ్నించెను. లేదే, “దానిని దీపస్తంభముమీద పెట్టుదురు,” అని యేసు చెప్పి “మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడనెను. మత్తయి 13:10-23, 34-36; మార్కు 4:10-25, 33, 34; లూకా 8:9-18; కీర్తన 78:2; యెషయా 6:9, 10. (w87 4/1)

◆ యేసు ఉపమానములతో ఎందుకు మాట్లాడెను?

◆ జనసమూహములతో తాము భిన్నమై యున్నట్లు యేసు శిష్యులు తమను ఎలా కనపర్చుకొనిరి?

◆ విత్తువానిని గూర్చిన ఉపమానమునకు యేసు ఎటువంటి వివరణ యిచ్చెను?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి